నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్ 2024 : ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు
Admissions University Entrance Exams

నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్ 2024 : ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు

ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులలో అడ్మిషన్ కోసం నిర్వహించే నిఫ్ట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా 16 నిఫ్ట్ కళాశాలలో ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఫ్యాషన్ టెక్నాలజీ కి సంబందించిన యూజీ మరియు పీజీ కోర్సుల యందు అడ్మిషన్ పొందొచ్చు. అర్హులైన అభ్యర్థులు జనవరి 8 లోపు దరఖాస్తు చేసుకోండి.

Exam Name NIFT 2024
Exam Type Entrance Test
Eligibility For Designing Courses
Exam Date 05/02/2024
Exam Duration 2 Hours
Exam Level National Level

దేశంలో ఉన్న నిఫ్ట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఇనిస్టిట్యూట్లలో ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఫ్యాషన్ టెక్నాలజీ కి సంబందించిన యూజీ మరియు పీజీ కోర్సుల యందు ప్రవేశాలు కల్పించేందుకు నిఫ్ట్ ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది.

విభిన్న భౌగోళిక ప్రదేశాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న వస్త్రధారణ, విభిన్న ప్రాచీన కళలతో ఫ్యాషన్ పరంగా ఏకత్వంలో భిన్నత్వాన్ని కనబరిచే భారత ఫ్యాషన్ ఇండస్ట్రీలో, సుజనాత్మకత ఉన్నవారికి అవకాశాలకు కొదవు లేదు. విభిన్న వైవిద్యలతో నిండిన భారత్ ఫ్యాషన్ రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచనతో 1986 లో భారత ప్రభుత్వం టెక్సటైల్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో  నిఫ్ట్ లను స్థాపించింది.

2006లో భారత ప్రభుత్వం ద్వారా చట్టబద్దమైన స్వయం ప్రతిపత్తిని పొందిన నిఫ్ట్..ఇప్పుడు దేశ వ్యాప్తంగా 16 క్యాంపస్ లు కలిగిఉంది. ఈ 16 ఇనిస్టిట్యూట్లలో దాదాపు 2370 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నత కెరీర్ ఆశించే వేలాది మంది విద్యార్థులు ఎదురు చూసే ఈ నిఫ్ట్ ప్రవేశ పరీక్ష కోసం పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దేశంలో ఉన్న నిఫ్ట్ క్యాంపస్ లు

నిఫ్ట్ కు దేశ వ్యాప్తంగా 16 క్యాంపస్ లు ఉన్నాయి. అవి  ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై, హైదరాబాద్, భోపాల్, గాంధీనగర్, భువనేశ్వర్, జోధాపూర్, హిమాచల్ ప్రదేశ్, కన్నూర్ కేరళ, కోలకతా, పాట్నా, రాయబరేలి యూపీ, షిల్లాంగ్ మరియు శ్రీనగర్.

నిఫ్ట్ ఇనిస్టిట్యూట్లు అందిస్తున్న యూజీ మరియు పీజీ కోర్సులు

యూజీ కోర్సులు యూజీ కోర్సులు పీజీ కోర్సులు
బ్యాచిలర్ ఆఫ్ లెథర్ డిజైన్ బ్యాచిలర్ ఆఫ్ నైట్ వెర్ డిజైన్ మాస్టర్ ఆఫ్ డిజైన్
బ్యాచిలర్ ఆఫ్ యాక్సెసరీ డిజైన్ బి. ఫ్యాషన్ కమ్యూనికేషన్ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
బ్యాచిలర్ ఆఫ్ టెక్సటైల్ డిజైన్ బి. ఫ్యాషన్ టెక్నాలజీ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్

ఎలిజిబిలిటీ

నిఫ్ట్ యూజీ కోర్సుల ఎలిజిబిలిటీ 

  • B.Des (బ్యాచిలర్ అఫ్ డిజైన్): బ్యాచిలర్ అఫ్ డిజైన్ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 55 శాతం మార్కులతో 10+2/ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి.
  • కనీసం 5 సబ్జెక్టులతో నేషనల్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • AICTE లేదా రాష్టాల టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డుల నుండి 3 ఏళ్ళ డిప్లొమా పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
  • B.Ftech (బ్యాచిలర్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ): బీటెక్ కి సరితూగే బ్యాచిలర్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 55 శాతం మార్కులతో  మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుగా 10+2/ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి.
  • మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లతో పాటు కనీసం 5 సబ్జెక్టులతో నేషనల్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • AICTE లేదా రాష్టాల టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డుల నుండి 3 ఏళ్ళ డిప్లొమా పూర్తిచేసిన వారు కూడా అర్హులే
  • ఈ రెండు యూజీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ వెలువడే సమయానికి 23 ఏళ్ళు మించకూడదు.

నిఫ్ట్ పీజీ కోర్సుల ఎలిజిబిలిటీ 

  • M.Des (మాస్టర్ అఫ్ డిజైన్): మాస్టర్ అఫ్ డిజైన్ కోర్సులకు దరఖాస్తు చేసేవారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా మూడేళ్ళ నిఫ్ట్ బ్యాచిలర్ డిజైన్ కోర్సులు పూర్తిచేసి ఉండాలి.
  • M.Ftech (మాస్టర్  అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ): బీఈ/బీటెక్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కోర్సులలో ఉత్తీర్ణత అయినవారు ఈ కోర్సులలో చేరేందుకు అర్హులు 
  • డిజైనింగ్ పీజీ కోర్సులలో చేరేందుకు అభ్యర్థులకు ఎంటువంటి గరిష్ట వయో పరిమితి లేదు.

నిప్ట్ ఎగ్జామ్ 2024 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 05 డిసెంబర్ 2023
దరఖాస్తు తుది తేదీ 03 జనవరి 2023
జరిమానాతో చివరి తేదీ (5,000/-) 08 జనవరి 2023
హాల్ టికెట్ డౌన్‌లోడ్ 25 జనవరి 2024
పరీక్ష తేదీ 05 ఫిబ్రవరి 2024
ఫలితాలు మార్చి 2024
కౌన్సిలింగ్ ఏప్రిల్ 2024

దరఖాస్తు ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు

  • ఎస్సీ, ఎస్టీ మరియు పిడబ్ల్యుడి అభ్యర్థులకు 1,500/- రూపాయలు
  • ఇతర అన్ని కేటగిరి అభ్యర్థులకు 3,000/- రూపాయలు
  • రెండు ప్రోగ్రామ్స్ ఫీజు : 4,500/-

దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి

తెలుగు రాష్ట్రాలలో ఎగ్జామ్ సెంటర్లు

  • విశాఖపట్నం
  • హైదరాబాద్
  • చెన్నై
  • భువనేశ్వర్

దరఖాస్తు ప్రక్రియ

నిఫ్ట్ దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. నిఫ్ట్ కు చెందిన అధికారిక వెబ్‌సైట్ నుండి మాత్రమే దరఖాస్తు చేయండి. దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి.

దరఖాస్తు సమయంలో నింపే ప్రతి సమాచారం కు జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు స్టెప్ బై స్టెప్ పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి ఉంచుకోండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

నిఫ్ట్ ఎగ్జామ్ నమూనా

నిఫ్ట్ ప్రవేశ పరీక్ష అభ్యర్థి ఎంచుకున్న కోర్సు బట్టి ఒకటి నుండి మూడు అంచెలలో నిర్వహించబడుతుంది. వీటి గురించి మరింత సమాచారం కోర్సుల వారీగా తెలుసుకుందాం.

B.Des (బ్యాచిలర్ ఆఫ్ డిజైన్): బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులకు సంబంధించి ప్రవేశాలు మూడు అంచెల్లో జరుగుతాయి. మొదటి అంచెలో జెరిగే రాతపరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. మొదటి షిఫ్ట్ లో క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ (CAT), రెండవ షిఫ్ట్ లో జనరల్ ఎబిలిటీ టెస్ట్(GAT) నిర్వహిస్తారు. రెండు పరీక్షలకు నిర్దిష్టమైన వెయిటేజీ ఉంటుంది.

ఇందులో మెరిట్ సాధించిన వారు వ్యక్తిగత ముఖాముఖీ తో కూడిన సిట్యుయేషన్ టెస్ట్ కు హాజరవ్వవలసి ఉంటుంది. ఈ టెస్టులో భాగంగా అభ్యర్థి డిజైనింగ్ సంబంధించిన నమూనాలు మరియు మెటీరియల్స్ తో దగ్గరలో ఉండే నిఫ్ట్ ఇనిస్టిట్యూట్లో హాజరై వాటి నిర్మాణం, అమరిక మరియు డిజైనింగ్ కోసం వివరించవలసి ఉంటుంది.ఈ మూడింటిలో అభ్యర్థి సాధించిన మెరిట్ ఆధారంగా ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు.

M.Des (మాస్టర్ ఆఫ్ డిజైన్): ఈ కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులకు పై విధంగానే క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్(CAT) మరియు జనరల్ ఎబిలిటీ టెస్ట్ (GAT)తో పాటుగా వ్యక్తిగత ఇంటర్వ్యూ మరియు గ్రూపు డిస్కషన్(PI/GD) నిర్వహించి వీటిలో మెరిట్ సాధించిన వారికీ అడ్మిషన్ లు కల్పిస్తారు.

B.Ftech (బ్యాచిలర్ ఆఫ్ ఫాషన్ టెక్నాలజీ): ఈ కోర్సులలో ప్రవేశాలు కేవలం జనరల్ ఎబిలిటీ(GAT) లో సాధించిన మెరిట్ ఆధారంగా మాత్రమే జరుగుతాయి.

M.F.M (మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్): ఈ కోర్సులలో ప్రవేశాలు జనరల్ ఎబిలిటీ టెస్ట్(GAT) మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ మరియు గ్రూపు డిస్కషన్(PI/GD) నిర్వహించి వీటిలో మెరిట్ సాధించిన వారికీ అడ్మిషన్ లు కల్పిస్తారు.

M .FTech (మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ): ఈ కోర్సులలో ప్రవేశాలు జనరల్ ఎబిలిటీ టెస్ట్(GAT) మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ మరియు గ్రూపు డిస్కషన్(PI/GD) నిర్వహించి వీటిలో మెరిట్ సాధించిన వారికీ అడ్మిషన్ లు కల్పిస్తారు.

నిఫ్ట్ కోర్సు టెస్ట్ వెయిటేజీ
B.Des (బ్యాచిలర్ ఆఫ్ డిజైన్) CAT 50%
GAT 30%
Situation Test 20%
M.Des (మాస్టర్ ఆఫ్ డిజైన్)  CAT 40%
GAT 30%
PI / GD 30%
B.Ftech (బ్యాచిలర్ ఆఫ్ ఫాషన్ టెక్నాలజీ) GAT 100%
M .FTech (మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) GAT 70%
PI / GD 30%
M.F.M (మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్) GAT 70%
PI / GD 30%
యూజీ మరియు పీజీ డిజైనింగ్ కోర్సుల జనరల్ ఎబిలిటీ టెస్ట్ (GAT)
గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం యూజీ డిజైనింగ్ పీజీ డిజైనింగ్
పేపర్ పేరు GAT GAT
లాంగ్వేజ్ ఇంగ్లీష్/హిందీ ఇంగ్లీష్/హిందీ
పరీక్ష సమయం 2 గంటలు 2 గంటలు
సిలబస్ ప్రశ్నల సంఖ్యా ప్రశ్నల సంఖ్యా
క్వాంటిటేటివ్ ఎబిలిటీ 20 20
కమ్యూనికేషన్ ఎబిలిటీ 25 30
ఇంగ్లీష్ కంప్రెహెన్షన్ 25 30
అనలిటికల్ ఎబిలిటీ 15 25
జీకే మరియు కరెంటు అఫైర్స్ 15 15
మొత్తం 100 120
యూజీ మరియు పీజీ ఫ్యాషన్ టెక్నాలజీ  కోర్సుల జనరల్ ఎబిలిటీ టెస్ట్ (GAT)
గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం యూజీ F.Tech పీజీ F.Tech F మేనేజ్‌మెంట్
పేపర్ పేరు GAT GAT GAT
లాంగ్వేజ్ ఇంగ్లీష్/హిందీ ఇంగ్లీష్/హిందీ ఇంగ్లీష్/హిందీ
పరీక్ష సమయం 3 గంటలు 3 గంటలు 3 గంటలు
సిలబస్ ప్రశ్నల సంఖ్యా ప్రశ్నల సంఖ్యా ప్రశ్నల సంఖ్యా
క్వాంటిటేటివ్ ఎబిలిటీ 30 30 10
కమ్యూనికేషన్ & ఇంగ్లీష్ కంప్రెహెన్షన్ 45 45 50
అనలాటికల్ & లాజికల్ ఎబిలిటీ 25 25 25
జీకే మరియు కరెంటు అఫైర్స్ 25 25 25
కేసు స్టడీ 25 25 40
మొత్తం 150 150 150

యూజీ మరియు పీజీ డిజైనింగ్ కోర్సుల క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ (CAT):

యూజీ మరియు పీజీ డిజైనింగ్ కోర్సులకు సంబంధించి జరిపే క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థి యొక్క మానిసిక మరియు సుజనాత్మకత సామర్ధ్యాలను అంచనా వేస్తారు. క్షణానికో ట్రెండ్ మారిపోయే ఈ ఆధునిక ప్రపంచంతో పోటీపడాలంటే డిజైనింగ్ విద్యార్థులు ప్రతి క్షణం ఎంతో విన్నూతంగా ఆలోచించగలగాలి.

ఈ టెస్ట్ ద్వారా అభ్యర్థి యొక్క నూతన ఆలోచన దృక్పధాన్ని, లోతైన పరిశీలన తీరుని, విషయ సంగ్రహణ సామర్ధ్యాన్ని, కాన్సెప్ట్ రూపకల్పన తీరుని అలానే డిజైనింగ్ రూపకల్పనలో అభ్యర్థి ప్రదర్శించే విన్నూత ఆలోచనలను అంచనా వేస్తారు.

యూజీ మరియు పీజీ డిజైనింగ్ కోర్సుల సిట్యుయేషన్ టెస్ట్ (ST)

యూజీ మరియు పీజీ డిజైనింగ్ కోర్సులకు సంబంధించి జరిపే సిట్యుయేషన్ టెస్ట్ ద్వారా అభ్యర్థి రూపొందించిన డిజైన్ ల తీరును వాటి రూపకల్పనలో ఉపయోగించిన పదార్దాలు మరియు నమూనాలను అంచనావేస్తారు. ఈ టెస్టులో భాగంగా అభ్యర్థి డిజైనింగ్ సంబంధించిన నమూనాలు మరియు మెటీరియల్స్ తో దగ్గరలో ఉండే నిఫ్ట్ ఇనిస్టిట్యూట్లో హాజరై వాటి నిర్మాణం, అమరిక మరియు డిజైనింగ్ కు సంబంధించిన వివిధ అంశాల కోసం డెమో ఇవ్వాల్సి ఉంటుంది

గ్రూప్ డిస్కషన్ (GD)

గ్రూప్ డిస్కషన్ ద్వారా అభ్యర్థి యొక్క వివిధ కాన్సెప్ట్ లపై ఉన్న అవగాహన తీరును, వాటిలో పై పరిజ్ఙానంను, నూతన ఐడియా ల రూపకల్పన విధానాన్ని, అంతర్గత శక్తిసామర్ద్యాలను, సమస్యలను అధిగమించే వరవడిని, ప్రభావంతమైన  మాటతీరుని మరియు నాయకత్వ లక్షలను అంచనా వేస్తారు.

వ్యక్తిగత ఇంటర్వ్యూ(PI)

వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థికి డిజైనింగ్ రంగం పై ఉన్న మక్కువను, ఈ కోర్సుల యందు ఉన్న అభిరుచిని, ఈ రంగంపై ఉన్న ఆవాహన తీరును, కెరీర్ లక్ష్యాలను, అభ్యర్థి కమ్యూనికేషన్ స్కిల్స్ ను, ఫ్యాషన్ ట్రెండ్స్ పై తాజా అవగాహన సామర్ధ్యాన్ని, అభ్యర్థి ఆలోచనలలో ఉన్న విన్నూత సుజనాత్మకతను అంచనా వేస్తారు

రిజర్వేషన్ల కోటా మరియు ప్రవేశాలు

రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ వంటి అన్ని అంచెలు పూర్తిఅయ్యాక, వాటన్నింటిలో అభ్యర్థి సాధించిన స్కోర్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. వీటికి తీరిగి రాజ్యాంగ నియమాలనుసారం రిజర్వేషన్ హక్కులు జోడించి వివిధ నిఫ్ట్ ఇనిస్టిట్యూట్లలో ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు.

జనరల్ కోటాలో వెనకబడిన విభాగం (EWS) 10%
షెడ్యూల్డ్ కాస్ట్ (SC) 15%
షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) 7.5%
ఇతర వెనకబడిన తరగతులు (OBC) 27%
శారీరిక వైకల్యం (PWD) 5%