Advertisement
ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ | ఎలిజిబిలిటీ, దరఖాస్తు, ఎగ్జామ్ ఫార్మేట్
Latest Jobs SSC

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ | ఎలిజిబిలిటీ, దరఖాస్తు, ఎగ్జామ్ ఫార్మేట్

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C & D నోటిఫికేషన్ 2022 వెలువడింది. ఈ నియామక ప్రకటన ద్వారా కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లో గ్రేడ్ ‘సి’ మరియు గ్రేడ్ ‘డి’ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం ఇంటర్మీడియట్ అర్హుతతో కేంద్ర ప్రభుత్వ కొలువు సాధించాలనుకునే వారికీ ఇదే మంచి అవకాశం. 18 నుండి 30 ఏళ్ళ మధ్య వయసు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్షా మరియు స్టెనోగ్రాఫీ స్కిల్ టెస్ట్ నిర్వహణ ద్వారా జరుగుతుంది.

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ షెడ్యూల్

నోటిఫికేషన్ నెంబర్ HQ-PPII03(1)/2/2022-PP_II
పోస్టుల సంఖ్యా -
దరఖాస్తు  ప్రారంభం 20.08.2022
దరఖాస్తు తుది గడువు 05.09.2022
పరీక్షా ఫీజు 100/-
పరీక్ష తేదీ నవంబర్ 2022
అడ్మిట్ కార్డు క్లిక్ చేయండి 
ఫలితాలు క్లిక్ చేయండి 

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ డిపార్టుమెంట్ కార్యాలయాలు మరియు కేంద్రప్రభుత్వ ఆర్గనైజషన్స్'లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ మరియు గ్రేడ్ ‘డి సిబ్బంది నియామకాలు జరిపేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ మరియు గ్రేడ్ ‘డి’ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ సిబ్బందికి నాన్ గెజిటెడ్ గ్రూపు B స్థాయి హోదా ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డి ’ సిబ్బంది గ్రూపు C ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాలు పొందుతారు.

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ ఎలిజిబిలిటీ

  • జాతీయత : ఇండియా/నేపాల్/భూటాన్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. 1 జనవరి 1962 ముందు భారత్ వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. భారతీయ మూలాలు కలిగి పాకిస్తాన్, బర్మా, శ్రీలంకా, తూర్పు ఆఫ్రికా దేశాలు కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ టాంజానియా (పూర్వం టాంగన్యికా మరియు జాంజిబార్), జాంబియా, మాలావి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం దేశాల నుండి శాశ్వతంగా భారత్ లో స్థిరపడేందుకు వచ్చే భారతీయ సంతతి కూడా అర్హులు.
  • వయోపరిమితి: వివిధ పోస్టులను అనుసరించి 18 నుండి 30 ఏళ్ళ మధ్య వయస్సు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చెయ్యొచ్చు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారికీ గరిష్టంగా 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు సడలింపు కల్పిస్తారు.
  • విద్య అర్హుత : ఇంటర్మీడియట్ /10+2 ఉత్తీర్ణతయినా అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ దరఖాస్తు ఫీజు

జనరల్ కేటగిరి అభ్యర్థులు 100/-
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వికలాంగులు, ESM అభ్యర్థులు దరఖాస్తు ఫీజు మినహాహించారు

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ దరఖాస్తు ప్రక్రియ

అర్హుత ఉన్న అభ్యర్థులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్'లో పొందిపర్చిన విదంగా కమిషన్ అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి. పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పోస్టు ఎంపిక, పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ సెంటర్లు

ఎగ్జామ్ సెంటర్ SSC రీజనల్ కేంద్రం సమాచారం (సౌత్ రీజియన్)
 గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం,
హైదరాబాద్, వరంగల్
Regional Director (SR), Staff Selection Commission, 2 nd Floor, EVK Sampath Building, DPI Campus, College Road, Chennai, Tamil Nadu-600006 (www.sscsr.gov.in)

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ నమూనా

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ మరియు గ్రేడ్ ‘డి’ నియామక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. రెండవ దశలో స్టెనోగ్రాఫీ స్కిల్ టెస్ట్ జరిపి ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టెస్ట్ 

ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 మార్కులకు జరుగుతుంది. జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్, జనరల్ అవెర్నెస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మూడు భాగాలుగా 200 ప్రశ్నలు ఇస్తారు. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు 0.25 మార్కులు తొలగిస్తారు.

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పరీక్షా సరళి
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం
జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ (పార్ట్ I) 50 50 120 నిముషాలు
జనరల్ అవెర్నెస్ (పార్ట్ II ) 50 50
ఇంగ్లీష్ లాంగ్వేజ్  (పార్ట్ III) 100 100

స్టెనోగ్రాఫీ స్కిల్ టెస్ట్ 

ఆబ్జెక్టివ్ సీబీటీ టెస్టులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు రెండవ దశలో స్టెనోగ్రాఫీ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాషలో ఈ నైపుణ్య పరీక్షా రాయాల్సి ఉంటుంది. అభ్యర్థికి అందుబాటులో ఉండే కమిషన్ రీజనల్ లేదా సబ్ రీజనల్ కేంద్రాలలో పరీక్షా నిర్వహిస్తారు. ఈ టెస్టులో భాగంగా అభ్యర్థులు ప్రతి నిమషానికి 100 పదాలు టైపు చేయాల్సి ఉంటుంది.

స్టెనోగ్రాఫీ స్కిల్ టెస్ట్
పోస్ట్ లాంగ్వేజ్ సమయం
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డి ’ ఇంగ్లీష్ 50 నిముషాలు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డి ’ హిందీ 65 నిముషాలు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ ఇంగ్లీష్ 40 నిముషాలు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి ’ హిందీ 55 నిముషాలు

డాక్యుమెంట్ వెరిఫికేషన్ & తుది ఎంపిక

ఆబ్జెక్టివ్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్లలో అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు రెండు ఫోటో కాపీలతో పాటుగా అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంతృప్తిపర్చని అభ్యర్థులను అనర్హులుగా పరిగణిస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తియ్యాక తుది షార్ట్ లిస్ట్ తయారీలో నిమగ్నమౌతారు. ఆబ్జెక్టివ్ పరీక్షా అర్హుత మార్కులు ప్రకటిస్తారు. కేటగిరి వారీగా మెరిట్ సాధించిన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. స్కిల్ టెస్టులో అందరు అభ్యర్థులు తప్పనిసరి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.

మార్కులు సమమయ్యేటప్పుడు ఆబ్జెక్టివ్ టెస్టులో పార్ట్ 1 లో మెరిట్ ను ప్రామాణికంగా తీసుకుంటారు. అప్పటికి సమమైతే ఆబ్జెక్టివ్ టెస్టులో పార్ట్ IIలో సాధించిన మొత్తం మార్కులను పరిగణలోకి తీసికుంటారు. అప్పటికి సమమైతే ఎక్కువ వయస్సు అభ్యర్థులకు ప్రాధన్యత ఇస్తారు. ఇంకా సమస్య పరిస్కారం కాకుంటే అభ్యర్థుల పేర్లలో ఆల్ఫాబెట్ అక్షరాలను ఆధారంగా చేసుకుని చోటు కల్పిస్తారు.

కేటగిరి క్వాలిఫైయింగ్ మార్కులు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 30%
ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ 25%
ఇతరులు 20%

Post Comment