ఐటీఐ విద్యార్థులు మరియు ట్రైనర్ల కోసం భారత్ స్కిల్స్ ఆన్‌లైన్ లెర్నింగ్ పోర్టల్ ఏర్పాటు చేయబడింది. ఐటీఐ ట్రేడ్స్ సంబంధించి పూర్తిస్థాయి లెర్నింగ్ ఆన్‌లైన్ వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దీన్ని భారత నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ రూపొందించించి.
భారత్ స్కిల్స్ పోర్టల్ ద్వారా ఐటీఐ ట్రేడ్స్'కు సంబంధించి పూర్తి అకాడమిక్ ప్రణాళికతో వీడియో, ఆడియో లెర్నింగ్ ట్యుటోరియల్స్ అందిస్తుంది. అదే సమయంలో మెటీరియల్స్, క్వశ్చన్ బ్యాంక్స్ మరియు మాక్ టెస్టులను కూడా అందుబాటులో ఉంచుతుంది.
భారత్ స్కిల్స్ ఆన్‌లైన్ కోర్సులతో పాటుగా అప్రెంటీస్షిప్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తుంది. అంతే కాకుండా నేషనల్ ఇంస్ట్రక్షనల్ మీడియా ఇనిస్టిట్యూట్ (NIMI) ద్వారా ఐటిఐ బ్లెండెడ్ లెర్నింగ్ కోర్సులను అందిస్తుంది.
భారత్ స్కిల్ వేదిక ప్రస్తుతం క్రాఫ్ట్స్' మ్యాన్ ట్రైనింగ్ స్కీమ్ (CTS) మరియు క్రాఫ్ట్స్ ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ స్కీమ్ (CITS) పేర్లతో కోర్సులు అందిస్తుంది. సీఐటీ కేటగిరికి సంబందించి దాదాపు 120 కి పైగా కోర్సులు, సీఐటీఎస్ సంబంధించి 30 కి పైగా కోర్సులు అందుబాటులోఉన్నాయి.
ఈ కోర్సులను పూర్తి ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు మరియు సర్టిఫికెట్ పొందేందుకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధి లేదా ఉద్యోగం కల్పించే ఈ కోర్సులను నేర్చుకోవడం మధ్యతరగతి మరియు గ్రామీణ యువత తమకు నచ్చిన రంగాల్లో లేదా స్వయం ఉపాది పొందే అవకాశం ఉంటుంది.