తెలంగాణ గురుకుల సైనిక్ స్కూల్’లో క్లాస్ 6 & ఇంటర్ ప్రవేశాలు 2022-23
Telangana

తెలంగాణ గురుకుల సైనిక్ స్కూల్’లో క్లాస్ 6 & ఇంటర్ ప్రవేశాలు 2022-23

తెలంగాణ గురుకుల సైనిక్ స్కూల్'లో క్లాస్ 6th & ఇంటర్ ప్రవేశాలు

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TTWREIS) కి చెందిన వరంగల్ సైనిక్ స్కూల్ యందు 2022 - 23 విద్య ఏడాదికి సంబంధించి క్లాస్ 6th మరియు జూనియర్ ఇంటర్ అడ్మిషన్లు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు, గురుకులం విద్య ఫార్మేట్'లో నాణ్యమైన స్కూల్ మరియు కాలేజీ విద్యతో పాటుగా NDA/SSB పరీక్షలలో అర్హుత పొందేలా శిక్షణ అందిస్తారు.

రాష్ట్రంలో ఏకైక గురుకుల సైనిక్ పాఠశాల వరంగల్ లోని అశోక్ నగర్ యందు ఉంది. ఇందు పురుష విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. క్లాస్ 6 యందు మొత్తం 80 సీట్లు, ఇంటర్ మొదటి ఏడాది యందు 80 సీట్లు అడ్మిషన్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఎంపిక ప్రవేశ పరీక్ష ద్వారా ఉంటుంది. మెజారిటీ సీట్లు ఎస్టీ విద్యార్థుల ద్వారా భర్తీ చేస్తారు.

పరీక్ష షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 20 జనవరి 2022
దరఖాస్తు తుది గడువు 15 ఫిబ్రవరి 2022
పరీక్ష తేదీ 13 మార్చి 2022

ఎలిజిబిలిటీ

  • ఇంటర్ మొదటి ఏడాది కోర్సుల కోసం దరఖాస్తు చేసేవారు గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలలో 2021-22 మార్చి పబ్లిక్ పరీక్షల్లో పది ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • క్లాస్ 6 కోసం దరఖాస్తు చేసేవారు గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలలో 2021-22 ఏప్రిల్ పరీక్షల్లో క్లాస్ 5 ఉత్తీర్ణత పొంది
  • విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి లక్ష ఏభైవేలు (రూరల్), రెండు లక్షలు (అర్బన్) రూపాలకు మించకూడదు.
  • తెలుగు మరియు ఇంగ్లీష్  మీడియంలో పది చదువుకున్న విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు.
  • 31/08/2022 నాటికీ విద్యార్థి వయస్సు 17 ఏళ్ళు మించకూడదు.
  • సీటు సాధించిన విద్యార్థులు అడ్మిషన్ సమయంలో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.
  • మెజారిటీ సీట్లు ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం

దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. అర్హుత కలిగిన విద్యార్థులు www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి.

వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు. మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు. ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-100 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి. అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి. పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి. నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

దరఖాస్తు రుసుము : 200/- (దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.)

పరీక్ష విధానం

ఇంటర్మీడియట్ కోర్సులకు

ప్రవేశ పరీక్ష ఓఎంఆర్ షీట్ ఆధారంగా ఆఫ్‌లైన్ యందు నిర్వహిస్తుంది. పరీక్ష రెండు గంటల నిడివితో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు పదివ తరగతి స్థాయి సిలబస్'తో గణితం, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ గ్రామర్ అంశాల నుండి ఇవ్వబడతాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రవేశాలు అర్హుత పరీక్షలో పొందిన మెరిట్ మరియు వివిధ కుల, లోకల్ రిజర్వేషన్ సమీకరణాల ఆధారంగా నిర్వహిస్తారు.

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
గణితం  40 ప్రశ్నలు 40 మార్కులు
ఫిజిక్స్  20 ప్రశ్నలు 20 మార్కులు
కెమిస్ట్రీ 15 ప్రశ్నలు 15 మార్కులు
బయాలజీ 05 ప్రశ్నలు 05 మార్కులు
ఇంగ్లీష్ గ్రామర్ & కంప్రహెన్షన్ 20 ప్రశ్నలు 20 మార్కులు

క్లాస్ 6

ప్రవేశ పరీక్ష ఓఎంఆర్ షీట్ ఆధారంగా ఆఫ్‌లైన్ యందు నిర్వహిస్తుంది. పరీక్ష రెండు గంటల నిడివితో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు క్లాస్ 5 స్థాయి సిలబస్'తో గణితం, సోషల్ స్టడీస్, జనరల్ సైన్స్, తెలుగు మరియు ఇంగ్లీష్ గ్రామర్ అంశాల నుండి ఇవ్వబడతాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రవేశాలు అర్హుత పరీక్షలో పొందిన మెరిట్ మరియు వివిధ కుల, లోకల్ రిజర్వేషన్ సమీకరణాల ఆధారంగా నిర్వహిస్తారు.

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
గణితం  30 ప్రశ్నలు 30 మార్కులు
జనరల్ సైన్స్  10 ప్రశ్నలు 10 మార్కులు
సోషల్ స్టడీస్ 10 ప్రశ్నలు 10 మార్కులు
తెలుగు 20 ప్రశ్నలు 20 మార్కులు
ఇంగ్లీష్ గ్రామర్ & కంప్రహెన్షన్ 30 ప్రశ్నలు 30 మార్కులు

ఫీజికల్ టెస్టులు

రాతపరీక్షలో అర్హుత పొందిన విద్యార్థులకు ఫీజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 11 నిముషాల్లో రెండు కిలోమీటర్ల గమ్యాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. అలానే 15 సిట్అప్స్ తీయాలి, నాలుగు అడుగుల ఎత్తు నుండి బ్రాడ్ జంప్ చేయగలగాలి. అలానే నిముషానికి పన్నెండుసార్లు అయిదు మీటర్ల షటిల్, పద్దెనిమిది సెకండ్లలో వందమీటర్ల స్ప్రింట్ పూర్తిచేయాలి. ఒక్కో దానికి 2 మార్కులు కేటాయిస్తారు. వీటన్నింటిని కలిపి మొత్తమీద కనీసం 5 మార్కులు సాధించాల్సి ఉంటుంది.

మెడికల్ ఫిట్నెస్ టెస్టులో అర్హుత పొందిన విద్యార్థులకు మెడికల్ బోర్డు నిర్ణయం మేరకు తుది జాబితా రూపొందిస్తారు. ప్రవేశపరీక్షకు 100 మార్కులు, ఫీజికల్ ఫిట్నెస్ టెస్టుకు 25 మార్కులు, పర్సనాలిటీ టెస్టుకు 25 మార్కుల వెయిటేజీ ఇస్తారు.

Post Comment