Advertisement
యూపీఎస్‌సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మరియు ఓటీఆర్ ప్రయోజనాలు
Latest Jobs UPSC

యూపీఎస్‌సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మరియు ఓటీఆర్ ప్రయోజనాలు

యూపీఎస్‌సీ కొత్తగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూపీఎస్‌సీ ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలయ్యే ప్రతీసారి, అభ్యర్థి తమ పూర్తి వివరాలు నమోదుచేయాల్సిన బెడద లేకుండా, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీసుకొచ్చింది. ఇక మీదట యూపీఎస్‌సీ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది.

వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రకియ ద్వారా, అభ్యర్థి ఒకసారి యూపీఎస్‌సీ పోర్టల్ యందు తమ వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందుపరిస్తే, భవిష్యత్తులో యూపీఎస్‌సీ భర్తీచేసే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు ఒక క్లిక్‌తో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం అభ్యర్థి పొందుతారు. దీని ద్వారా దాదాపు 70% శాతం సమాచారం పొందుపరిచే పని అభ్యర్థికి తప్పుతుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం.

యూపీఎస్‌సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన సర్టిఫికెట్లు

  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
  • అడ్రెస్స్ ఐడీ
  • టెన్త్ క్లాస్ హాల్ టికెట్
  • మొబైల్ నెంబర్
  • ఇమెయిల్ ఐడీ

యూపీఎస్‌సీ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రయోజనాలు

  • దరఖాస్తుదారుడు ఒకసారి వ్యక్తిగత వివరాలను పొందుపరిస్తే జీవితాంతం ఉపయోగించుకోవచ్చు.
  • దరఖాస్తు చేసే ప్రతీసారి అభ్యర్థి ప్రాథమిక సమాచారం నింపాల్సిన బెడద తప్పుతుంది.
  • దరఖాస్తు చేసే ప్రతీసారి వ్యక్తిగత డాక్యూమెంట్లను అప్లోడ్ చేయాల్సి పని తప్పుతుంది.
  • ఇది భవిష్యత్ నియామక పరీక్షల దరఖాస్తు సమయాన్ని తగ్గిస్తుంది.
  • ఓటీఆర్ సమాచారం డిజిటల్‌గా ఎప్పుడైనా ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది.
  • ఓటీఆర్ సమాచారం ఎప్పుడైనా నవీకరించుకునే వీలు ఉంటుంది.
  • యూపీఎస్‌సీ యొక్క వివిధ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

యూపీఎస్‌సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయండి

యూపీఎస్‌సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం యూపీఎస్‌సీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తులో అభ్యర్ది ప్రాథమిక సమాచారం అందించడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేయొచ్చు. ఇందులో మొదటిగా అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వివరాలు, క్యాస్ట్ వివరాలు, టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ వంటి వివరాలు పొందు పరచడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

విజయవంతమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత అభ్యర్థి మెయిల్ మరియు మొబైల్ నెంబరుకు ఓటీఆర్ ఐడీతో కూడిన వివరాలు పంపబడతాయి. రెండవ దశలో ఓటీపీఆర్ పేజీ ద్వారా లోగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యేందుకు ఇమెయిల్ ఐడీ లేదా, మొబైల్ నెంబర్ లేదా ఓటీఆర్ ఐడీని ఉపయోగించాల్సి ఉంటుంది.

లాగిన్ అయ్యాక ఇది వరకు పొందుపర్చిన వివరాలు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మీ ప్రొఫైల్ కోసం పాసువర్డ్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తియ్యాక ఓటీఆర్ నెంబర్ జాగ్రత్తగా భద్రపర్చుకోండి. ఈ వివరాలతో భవిష్యత్తులో యూపీఎస్సీ నుండి వచ్చే ఉద్యోగ ప్రకటనలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

యూపీఎస్సీ ఓటీఆర్ ఐడీ/ పాస్‌వర్డ్ మర్చిపోతే

యూపీఎస్సీ ఓటీఆర్ నెంబర్ లేదా పాస్‌వర్డ్‌ వివరాలు మర్చిపోయిన అభ్యర్థులు గాబరా పడాల్సిన అవసరం లేదు. మీరు ఇదివరకు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ వివరాలను పొందుపర్చడం ద్వారా వాటిని తిరిగి పొందొచ్చు.

వీటికి సంబందించిన లింక్ వివరాలు మీకు యూపీఎస్సీ లాగిన్ పేజీలో అందుబాటులో ఉంటాయి. సరైన వివరాలు పొందుపర్చి మీ ఓటీఆర్ ఐడీ/పాస్‌వర్డ్‌ సమాచారం పొందండి. వాటిని పొందాక, మరోసారి ఈ పరిస్థితి తెలెత్తకుండా భద్రపర్చుకోండి.

Post Comment