కోర్సెరా కోర్సులు : ఆన్‌లైన్ యూనివర్శిటీ డిగ్రీలు
Online Education Useful websites

కోర్సెరా కోర్సులు : ఆన్‌లైన్ యూనివర్శిటీ డిగ్రీలు

ఆన్‌లైన్ కోర్సులకు సంబంధించి ఉన్నతమైన ప్రమాణాలు పాటిస్తున్న సంస్థల్లో కోర్సెరా ఒకటి. కోర్సెరా కాలిఫోర్నియా కేంద్రంగా 2012లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్లు ఆండ్రూ ఎన్జీ మరియు డాఫ్నే కొల్లెర్లు స్థాపించారు. కోర్సెరా ప్రస్తుతం స్టాన్ఫోర్డ్, గూగుల్, అమెజాన్, ఐబీఎం వంటి 200+ పైగా యూనివర్సిటీలు మరియు సంస్థలతో అనుసంధానమై పనిస్తుంది.

Advertisement

కోర్సెరా ప్రస్తుతం 4500 పైగా కోర్సులు, 570పైగా ప్రాజెక్టులు, 30+ సర్టిఫికేటెడ్ కోర్సులు 20 పైగా యూనివర్సిటీ డిగ్రీలను అందిస్తుంది. కోర్సెరాలో 70 నుండి 80 మిలియన్ల మంది సభ్యులు వివిధ కోర్సులకు ఎన్రోల్ చేసుకుని ఉన్నారు. కోర్సెరా కోర్సులకు దాదాపు 40 భాషల్లో సబ్ టైటిల్స్ అందిస్తున్నారు.

కోర్సెరా అందిస్తున్న పాపులర్ ఆన్‌లైన్ కోర్సులు

ఆర్ట్స్ & హ్యుమానిటీస్
బిజినెస్
కంప్యూటర్ సైన్స్
డేటా సైన్స్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
హెల్త్
మాథ్స్ & లాజిక్
పెర్సనాల్ డెవలప్మెంట్
ఫీజికల్ సైన్స్ & ఇంజినీరింగ్
సోషల్ సైన్సెస్
లాంగ్వేజ్ లెర్నింగ్
ఆన్లైన్ డిగ్రీస్
సర్టిఫికేటెడ్ కోర్సెస్

కోర్సెరా కోర్సులు

కోర్సెరా కోర్సులు కొత్తగా ఏదైనా నేర్చుకోండి అనే పిలుపుతో 100 శాతం ఆన్‌లైన్ వేదికగా నిర్వహించబడుతున్నాయి. ఈ కోర్సులన్నీ  ప్రపంచ వ్యాప్తంగా ఉండే 200 పైగా ప్రముఖ యూనివర్సిటీలు మరియు సంస్థలకు చెందిన నిపుణులచే రూపొందించబడ్డాయి. కోర్సెరా ప్రీమియం కోర్సులతో పాటుగా వందల కొలది ఫ్రీ కోర్సులను అందిస్తుంది.

ప్రీమియం కోర్సులకు కమ్యూనిటీ ఫారం సపోర్టు, క్విజెస్ మరియు ప్రాక్టికల్ ప్రాజెక్టులను అందజేస్తారు. పూర్తిచేసిన కోర్సులకు సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. ప్రీమియం కోర్సులు 49$ కనీస రుసుముతో 4 నుండి 6 వారాల్లో పూర్తిచేసే విధంగా రూపొందించారు.

కోర్సెరా గైడెడ్ ప్రాజెక్ట్స్

ఉద్యోగ సంబంధిత నైపుణ్యాలు మరియు ఇండిస్ట్రియల్ టూల్స్ సంబంధించి 2 గంటల నిడివితో గైడెడ్ ప్రాజెక్ట్ కోర్సులు అందిస్తున్నారు. ఈ కోర్సులకుఎన్రోల్ చేసుకున్న సభ్యులకు సంబంధిత అంశాల్లో నిపుణులైన వారు ఆన్‌లైన్ ద్వారా స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అందిస్తారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికీ ఆ సంబంధిత అంశానికి సంబంధించి ప్రాజెక్ట్ గైడెడ్ సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ కోర్సులు 9$ కనీస రుసుముతో అందుబాటులో ఉన్నాయి.

కోర్సెరా స్పెషలైజషన్లు

కోర్సెరా 4 నుండి 6 నెలల నిడివితో స్పెషలైజషన్స్ కోర్సులు అందిస్తుంది. ఈ కోర్సులో భాగంగా అభ్యర్థులు ఎంపిక చేసుకున్న అంశానికి సంబంధించి పూర్తిచేసి ప్రాక్టికల్  ప్రొఫిషినల్ నైపుణ్యాన్ని అందజేస్తారు.కోర్సు పూర్తిచేసుకున్న వారికీ సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి స్పెషలైజషన్ సర్టిఫికెట్ అంజేస్తారు. ఈ కోర్సులు 49$ కనీస రుసుముతో అందుబాటులో ఉన్నాయి.

కోర్సెరా ప్రొఫిషినల్ సర్టిఫికెట్స్

కెరీర్ కొత్తగా ప్రారంభించే వారికీ, వృత్తి జీవితంలో ఎదగాలనుకునే వారికీ కోర్సెరా ప్రొఫిషినల్ సర్టిఫికెట్ కోర్సులు తమ వంతు సహాయాన్ని అందిస్తాయి. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సంబంధిత రంగంలో పూర్తిస్థాయి ప్రోఫిసినల్ నైపుణ్యాన్ని ఇవి అందిస్తాయి.

సదురు అభ్యర్థి ఏడాదిలోపు ఆయా రంగాల్లో ఉన్నతంగా స్థిరపడేందుకు లేదా కొత్త కెరీర్ ప్రారంభించేందుకు ఈ కోర్సులు ఉపకరిస్తాయి. ఈ కోర్సులు 49$ కనీస ఫీజుతో అందుబాటులో ఉంటాయి. శిక్షణ పూర్తి ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది.

కోర్సెరా మాస్టర్ ట్రాక్ సర్టిఫికెట్స్

ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల నుండి ఆన్‌లైన్ ద్వారా మాస్టర్ డిగ్రీ చేయాలనుకునే వారికీ మాస్టర్ ట్రాక్ సర్టిఫికెట్ కోర్సులు ఉపకరిస్తాయి. ఈ కోర్సులు ఇంటరాక్టివ్ ఫార్మాట్ లో, అనుభవవిజ్ఞులైన నిపుణుల తో నేరుగా సలహాలు అందిస్తూ, రియల్ టైమ్ ప్రాజెక్టులతో పూర్తిస్థాయి యూనివర్సిటీ పీజీ డిగ్రీని ఈ కోర్సులు అందిస్తాయి. కోర్సులు పూర్తిచేసిన వారికి వారు ముందుగా ఎంపిక చేసుకున్న యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ అందిస్తారు. ఈ కోర్సులు 2000$ కనీస రుసుముతో ప్రారంభమౌతాయి.

కోర్సెరా ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు

ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల నుండి ఆన్‌లైన్ విధానంలో ఓపెన్ డిగ్రీ చేసే అవకాశం ఈ కోర్సులు కల్పిస్తాయి. ఈ కోర్సులకు ఎన్రోల్ చేసుకున్న అభ్యర్థులు 1 నుండి 4 ఏళ్ళ నిడివితో ఈ కోర్సులు పూర్తిచేసే అవకాశం కల్పిస్తారు.

ఈ కోర్సులు విజయవంతంగా పూర్తిచేసిన వారు ముందుగా ఎంపిక చేసుకున్న యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ అందజేస్తారు. ఈ కోర్సులు పూర్తి ఆన్‌లైన్ విధానంలో సబ్జెక్టు నిపుణుల పరివేక్షణలో అందజేస్తారు. ఈ కోర్సులు 9000$ కనీస రుసుముతో ప్రారంభమౌతాయి. కోర్సు ఫీజు వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం కల్పిస్తారు.

కోర్సెరా కీ పాయింట్స్

  • కోర్సెరా కొన్ని కోర్సులను ఉచితంగా అందిస్తుంది
  • కోర్సెరా కోర్సులు 200 పైగా అంతర్జాతీయ ప్రఖ్యాత యూనివెర్సిటీలచే అందించబడుతున్నాయి
  • కోర్సెరా కోర్సులు నిర్దిష్ట నిడివితో పూర్తిచేసే అవకాశం కల్పిస్తారు
  • కోర్సెరా కోర్సుల ఎన్రోల్మెంట్ రుసుములు మిగతా రెగ్యులర్ అకాడమిక్ ఇనిస్టిట్యూట్లతో పోల్చుకుంటే చాలా తక్కువ
  • కోర్సెరా యూనివర్సిటీ స్థాయి యూజీ, పీజీ కోర్సులను అందిస్తుంది
  • కోర్సెరా కోర్సు పూర్తిచేసిన వారికీ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్ అందజేస్తారు
  • కోర్సెరా కోర్సులు క్వాలిటీ పరంగా అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉంటాయి

కోర్సెరా కోర్సుల ప్రతికూలతలు

  • కోర్సెరా కోర్సులు అన్ని దాదాపు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి
  • కోర్సెరా కోర్సులు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే అందజేస్తారు
  • కోర్సెరాలో ఒక్కొక్క కోర్సు వేరువేరు ఎన్రోల్మెంట్ ఫీజులు కలిగిఉంటాయి
  • కోర్సెరా అందించే కొన్ని కోర్సులు నూతన పాఠ్యంశాల నవీకరణకు నోచుకోవడం లేదు

కోర్సెరా కోర్సుల ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు కొంచెపు పక్కన పెడితే, ఆన్‌లైన్ ద్వారా ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికీ, కొత్త నైపుణ్యాలు నేర్చుకునే ఆలోచన ఉన్నవారికి కోర్సెరా విస్తృతమైన కోర్సుల ఎంపికను అందిస్తుంది.

దాదాపు 200 లకు పైగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల నుండి ఆన్‌లైన్ ఓపెన్ డిగ్రీలను అందిస్తుంది.ఇది విద్యార్థులకు, ఉద్యోగస్తులకు మరియు ఉన్నత విద్యకు దూరమయ్యే మహిళలకు యెంతగానో ఉపయోగపడుతుంది.

Advertisement