రోజువారీ కరెంట్ అఫైర్స్ 19 నవంబర్ 2023 | Current affairs in Telugu
Telugu Current Affairs

రోజువారీ కరెంట్ అఫైర్స్ 19 నవంబర్ 2023 | Current affairs in Telugu

తెలుగు ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ 19 నవంబర్ 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌ 2023 విజేతగా ఆస్ట్రేలియా

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌  2023 ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించి రికార్డు స్థాయిలో ఆరో క్రికెట్ ప్రపంచకప్‌ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఈ టోర్నమెంట్‌ను భారత్ మరియు దక్షిణాఫ్రికాతో వరుసగా పరాజయాలతో ప్రారంభించి, తర్వాత వరుసగా తొమ్మిది వరుస విజయాలతో టైటిల్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా ఇది వరకు 1987, 1999, 2003, 2007, 2015 లలో కప్ గెలుచుకుంది.

ఈ టోర్నమెంట్ విజేతకు 33 కోట్ల నగదు బహుమతి, రన్నర్స్-అప్ జట్టు 16 కోట్లు అందజేశారు. అలానే ఓడిన సెమీ-ఫైనలిస్టులు, న్యూజిలాండ్ మరియు దక్షిణాఫ్రికా ఒక్కొక్కరు 6.5 కోట్లు అందుకున్నారు. భారత్ మరియు ఆస్ట్రేలియా జట్లు చివరిగా 2003లో ప్రపంచ కప్ ఫైనల్ యందు పోటీపడ్డారు. నాడు రికీ పాంటింగ్ సారథ్యంలో 125 పరుగుల తేడాతో భారత్ జట్టుపై విజయం సాధించారు.

భారత్ గత పదేళ్లలో 2014 ప్రపంచ టీ20 ఫైనల్, 2016 ప్రపంచ టీ20 సెమీఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 ఒన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్, 2022 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ పరాజయాలతో బ్యాక్-టు-బ్యాక్ రన్నర్-అప్ జట్టుగా మిగిలిపోతుంది. 2021 మరియు 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ యందు కూడా భారత్ రెండు సార్లు ఫైనల్ చేరి రన్నర్-అప్ జట్టుగా నిలిచింది.

  • 2023 ప్రపంచ కప్పులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటరుగా విరాట్ కోహ్లి నిలిచాడు. కోహ్లి 11 మ్యాచ్లు ఆడి 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 765 పరుగులు సాధించాడు.
  • 2023 ప్రపంచ కప్పులో అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగా భారత పేసర్ మొహమ్మద్ షమీ నిలిచాడు. షమీ 7 మ్యాచ్లు ఆడి మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు. షమీ మొత్తం 48.5 ఓవర్లు వేసి 257 పరుగులు ఇచ్చాడు.
  • ప్రపంచ కప్పులో అత్యధిక టీమ్ స్కోరు ఈ టోర్నమెంటులో నమోదు అయ్యింది. నే నమోదైంది. శ్రీలంక జట్టు, ఈ ప్రపంచ న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికాతో  మ్యాచులో 5 వికెట్లకు 428 పరుగులు సాధించింది.
  • ధర్మశాలలో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచులో రికార్డు స్థాయిలో 771 పరుగులు నమోదు అయ్యాయి. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులు, న్యూజిలాండ్ 50 ఓవర్లలో 383 పరుగులు నమోదు చేసాయి. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధికం.
  • 2023 ప్రపంచకపులో అత్యధిక వ్యక్తిగత నమోదు చేసిన బ్యాటరుగా ఆస్ట్రేలియా క్రికెటరుగా మాక్స్‌వెల్ నిలిచాడు. మాక్స్‌వెల్ కేవలం 128 బంతుల్లో 201 పరుగులు చేసిన నాటౌటూగా ఉన్నాడు 21 ఫోర్లు, 10 సిక్సులు) అజేయ డబుల్ సెంచరీ సాధించాడు.
  • 2023 ప్రపంచకప్పులో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలరుగా భారత పేసర్ మొహమ్మద్ షమీ నిలిచాడు. ముంబైలో జరిగిన సెమీఫైనల్లో షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు.
  • 2023 ప్రపంచకప్పులో ఒకే ఇన్నింగ్స్ యందు 400 అంతకంటే ఎక్కువ స్కోర్లు మూడు సార్లు నమోదయ్యాయి. అందులో శ్రీలంకపై దక్షిణాఫ్రికా (428/5), నెదర్లాం డ్స్ జట్టుపై భారత్ (410/4), పాకిస్తాన్ జట్టుపై న్యూజిలాండ్ (401/6) సాధించాయి.
  • 2023 ప్రపంచకప్పులో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయరుగా దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ నిలిచాడు. డికాక్ 10 మ్యాచ్లు ఆడి 4 సెంచరీలతో కలిపి 594 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి, రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) 3 సెంచరీల చొప్పున సాధించారు. డరైల్ మిచెల్ (న్యూజిలాండ్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), శ్రేయస్ అయ్యర్ (భారత్), డసెన్ (దక్షిణాఫ్రికా), మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా), మ్యాక్స్ వెల్ (ఆస్ట్రేలియా), ట్రవిస్ హెడ్ (ఆస్ట్రేలియా) 2 సెంచరీల చొప్పున చేశారు.
  • ఒకే ప్రపంచకప్ యందు అత్యధిక పరుగులు చేసిన కెప్టెనుగా భారత సారథి రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. రోహిత్ 11 మ్యాచ్లు ఆడి ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో కలిపి 597 పరుగులు సాధించాడు. కేన్ విలియమ్సన్ (2019లో 578 పరుగులు) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.
  • ప్రపంచ కప్ ఫైనల్లో సెంచరీ సాధించిన ఏడో క్రికె టరుగా ట్రవిస్ హెడ్ (ఆస్ట్రేలియా) నిలిచాడు. గతం లో క్లయివ్ లాయిడ్ (వెస్టిండీస్), వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్), అరవింద డిసిల్వా (శ్రీలంక), రికీ పాంటిం గ్ (ఆస్ట్రేలియా), ఆడమ్ గిల్ క్రిస్ట్ (ఆస్ట్రేలియా), జయవర్ధనే (శ్రీలంక) ఈ జాబితాలో ఉన్నారు.
  • ప్రపంచ కప్పులో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డు గెల్చుకున్న మూడో భారతీయ క్రికెటరుగా విరాట్ కోహ్లి గుర్తింపు పొందాడు. గతంలో సచిన్ టెండూల్కర్ (2003లో), యువరాజ్ సింగ్ (2011లో) ఈ ఘనత సాధించారు.

2023 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్, క్రికెట్ ప్రపంచ కప్ యొక్క 13వ ఎడిషన్. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమిచ్చింది. ఇది 5 అక్టోబర్‌న ప్రారంభమై 19 నవంబర్ 2023న ముగిసింది. ఈ టోర్నమెంటులో ఆతిధ్య భారత్ జట్టుతో పాటుగా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మరియు శ్రీలంక జట్టులు పాల్గొన్నాయి. రెండు సార్లు ప్రపంచ కప్పు విజేత వెస్ట్ ఇండీస్ చరిత్రలో తొలిసారి ఈ టోర్నమెంటుకు అర్హత సాధించలేకపోయింది.

ఈ టోర్నమెంట్ భారతదేశంలోని పది వేర్వేరు నగరాల్లో పది వేర్వేరు స్టేడియాల్లో జరిగింది. మొదటి మరియు రెండవ సెమీ -ఫైనల్‌లు వరుసగా ముంబైలోని వాంఖడే స్టేడియం మరియు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగగా, ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది.

ప్రఖ్యాత కళా చరిత్రకారుడు బిఎన్ గోస్వామి కన్నుమూశారు

ప్రఖ్యాత కళా చరిత్రకారుడు మరియు రచయిత బ్రిజేందర్ నాథ్ గోస్వామి 90 ఏళ్ళ వయసులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో కన్నుమూశారు. గోస్వామి భారతీయ సూక్ష్మ చిత్రాలపై, ముఖ్యంగా పహారీ స్కూల్‌లో ప్రముఖ నిపుణుడుగా ప్రసిద్ధి చెందాడు. ఆయన కళ మరియు సంస్కృతిపై 20కి పైగా పుస్తకాలను రచించారు. వీటిలో "నైన్‌సుఖ్ ఆఫ్ గులేర్: ఎ గ్రేట్ ఇండియన్ పెయింటర్ ఫ్రమ్ ఎ స్మాల్ హిల్-స్టేట్", "పహారీ మాస్టర్స్: కోర్ట్ పెయింటర్స్ ఆఫ్ నార్తర్న్ ఇండియా" మరియు "మాస్టర్స్ ఆఫ్ ఇండియన్ పెయింటింగ్ 1100- 1900. " వంటివి ఉన్నాయి.

గోస్వామి 1933లో పాకిస్తాన్‌లోని సర్గోధాలో జన్మించారు. చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో కళా చరిత్రను అభ్యసించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ మరియు చండీగఢ్ లలిత కళా అకాడమీ సభ్యుడుగా సేవలు అందించారు. అహ్మదాబాద్‌లోని కాలికో మ్యూజియం ఆఫ్ టెక్స్‌టైల్స్‌ను నిర్వహిస్తున్న సారాభాయ్ ఫౌండేషన్‌కు వైస్ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. భారతీయ సూక్ష్మ కళపై చేసిన పరిశోధనకు గాను భారత ప్రభుత్వం 1998లో పద్మశ్రీని ప్రదానం చేసింది. అలానే 2008లో మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ కూడా అందించింది.

సామాజిక ఐక్యత & ఒంటరితనంపై కమిషన్ ఏర్పాటు చేసిన డబ్యుహెచ్ఒ

ప్రపంచ ఆరోగ్య సంస్థ సామాజిక సంబంధాన్ని పెంపొందించడానికి మరియు ఒంటరితనాన్ని తీవ్రమైన ఆరోగ్య ముప్పుగా పరిష్కరించడానికి ఒక కమిషన్‌ను ప్రారంభించింది. ఈ కమిషన్‌కు యూఎస్ సర్జన్ జనరల్ డాక్టర్. వివేక్ మూర్తి మరియు ఆఫ్రికన్ యూనియన్ యూత్ ఎన్‌వోయ్ చిడో మ్పెంబా సహ-అధ్యక్షులుగా ఉంటారు. ఇందులో 11 మంది ప్రముఖ విధాన నిర్ణేతలు, ఇతర నాయకులు కూడా సభ్యులుగా ఉంటారు.

ఈ కమిషన్ మూడేళ్లపాటు అమలులో ఉంటుంది. ఇది అన్ని వయసుల ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సామాజిక అనుసంధానం పోషించే ప్రధాన పాత్రను విశ్లేషిస్తుంది. ఇది సామాజిక కనెక్షన్‌లను ఉన్నత స్థాయిలో నిర్మించడానికి పరిష్కారాలను కూడా వివరిస్తుంది. ఒంటరితనం అనేది పెరుగుతున్న ప్రజారోగ్య సమస్య, ఇది డిప్రెషన్, గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు చిత్తవైకల్యం వంటి అనేక ప్రతికూల ఆరోగ్య ఫలితాలతో ముడిపడి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు దీర్ఘకాలిక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారని అంచనా. దీని ద్వారా సామాజిక సంబంధాన్ని పెంపొందించడం మరియు ఒంటరితనాన్ని పరిష్కరించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన దశ. ఈ కమిషన్ పెరుగుతున్న సమస్యకు సమర్థవంతమైన పరిష్కారాలను గుర్తించి, వాటిని అమలు చేయడంలో సహాయపడుతుంది.

Advertisement

Post Comment