ఈపాఠశాల 2023 : ఉచిత ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు
Online Education Useful websites

ఈపాఠశాల 2023 : ఉచిత ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు

ఈపాఠశాల ఎన్‌సిఈఆర్‌టి సంబంధించిన క్లాస్ I నుండి క్లాస్ XII కు చెందిన డిజిటల్ పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచుతుంది. ఈ పోర్టల్‌ను సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సీఐఈటీ) మరియు ఎన్‌సిఈఆర్‌టి సంయుక్తంగా 2015లో ప్రారంభించాయి. దీనిని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పరిశోధకులు మరియు అధ్యాపకుల కోసం అకాడమిక్ పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో రూపొందించారు.

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఈఆర్‌టి) సంస్థను 1961 లో స్వయంప్రత్తి హోదాతో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాఠశాల విద్యలో గుణాత్మక మెరుగుదల కోసం మరియు పాఠశాల విద్యకు సంబంధించి విధి విధానాలు రూపొందించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇచ్చేందుకు గాను ఆనాడు దీన్ని స్థాపించారు.

ఎన్‌సిఈఆర్‌టి పాఠశాల విద్యకు సంబంధించిన రంగాల్లో పరిశోధనలు చేపట్టడం, ప్రోత్సహించడం మరియు సమన్వయం చేయడం వంటి విధులు నిర్వహిస్తుంది. అలానే పాఠశాల విద్యకు సంబంధించిన మోడల్ పాఠ్యపుస్తకాలు, సప్లమెంటరీ మెటీరియల్స్, న్యూస్ ఆర్టికల్స్, జర్నల్స్ మరియు ఎడ్యుకేషనల్ కిట్స్, డిజిటల్ మల్టీమీడియా వస్తుసామాగ్రిని తయారు చేసి అందజేస్తుంది. అదే విదంగా ఉపాధ్యాయ శిక్షణ సంబంధిత కార్యకలాపాను కూడా రూపొందిస్తుంది.ncert text books

దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి ఎన్‌సిఈఆర్‌టి ప్రధానభూమిక పోషిస్తుంది. పాఠశాల విద్యకు చెందిన 1 వ తరగతి నుండి 12వ తరగతి వరకు 504 రకాల  పాఠ్యపుస్తకాలు రూపొందించిస్తుంది. వీటిని ఆడియో మరియు వీడియో ఫార్మేట్ లలో మొబైల్ మరియు వెబ్సైటు ద్వారా విద్యార్థుల నుండి టీచర్స్ వరకు అందరికి అందుబాటులో ఉంచుతుంది.

ఎన్‌సిఈఆర్‌టి ఈ బుక్స్ దాదాపు అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి ఉచితంగా వెబ్ పోర్టల్ లేదా యాప్ నుండి విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు మరియు విద్యా నిపుణులు ఉపయోగించుకోవచ్చు. డౌన్‌లోడ్‌లపై పరిమితులు లేదు. ఆఫ్‌లైన్ ఉపయోగం కోసం ఈ మెటీరియల్‌లను వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈపాఠశాల మరింత వాస్తవిక అనుభవాన్ని అందించడానికి ఫ్లిప్ బుక్ ఫార్మాట్‌కు మద్దతు ఇస్తుంది. ఎన్‌సిఈఆర్‌టి వెబ్సైటు లేదా యాప్ యందు మీరు చదువుతున్న క్లాస్, సబ్జెక్టు మరియు పాఠ్య పుస్తకం పేరును సెలెక్ట్ చేసుకోవడం ద్వారా సంబంధిత డిజిటల్ ఈ పుస్తకంను మీరు పొందవచ్చు. నిరుపేద విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న విద్యార్థులకు ఈ సేవలు ఉపయోగపడతాయి. ఈ సేవలు పూర్తి ఉచితం.

ncert text books 2