Advertisement
ఎస్‌ఎస్‌సి జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ | ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ఫార్మేట్
Latest Jobs SSC

ఎస్‌ఎస్‌సి జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ | ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ఫార్మేట్

ఎస్‌ఎస్‌సి తాజాగా జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రకటన ద్వారా 104 మంది జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ మరియు హిందీ ప్రాధ్యాపక్ సిబ్బందిని భర్తీ చేయున్నారు. హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్షా మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది.

నియామక బోర్డు స్టాఫ్ సెలక్షన్ కమిషన్
నియామక పరీక్షా జూనియర్ ట్రాన్సలేటర్ ఎగ్జామినేషన్
ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ మాస్టర్ డిగ్రీ (హిందీ & ఇంగ్లీష్)
వయో పరిమితి 22 - 30 ఏళ్ళ మధ్య

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ డిపార్టుమెంట్ కార్యాలయాలు మరియు కేంద్రప్రభుత్వ ఆర్గనైజషన్స్ యందు జూనియర్ హిందీ ట్రాన్సలేటర్, జూనియర్ ట్రాన్సలేటర్, సీనియర్ హిందీ ట్రాన్సలేటర్ మరియు హిందీ ప్రాధ్యాపక్ సిబ్బందిని నియమించేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు 7th పే స్కేల్ అనుచరించి లెవెల్ 6,7,8 పరిధిలో ప్రారంభ వేతనం అందిస్తారు.

పోస్టు పేరు వేతన స్కేల్ లెవెల్
 జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ Level-6 (Rs.35400- 112400)
సీనియర్ హిందీ ట్రాన్సలేటర్ Level-7 (Rs.44900- 142400)
హిందీ ప్రాధ్యాపక్ Level-8 (Rs.47600- 151100)

జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ ఎలిజిబిలిటీ

  • జాతీయత : ఇండియా/నేపాల్/భూటాన్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. 1 జనవరి 1962 ముందు భారత్ వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. భారతీయ మూలాలు కలిగి పాకిస్తాన్, బర్మా, శ్రీలంకా, తూర్పు ఆఫ్రికా దేశాలు కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ టాంజానియా (పూర్వం టాంగన్యికా మరియు జాంజిబార్), జాంబియా, మాలావి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం దేశాల నుండి శాశ్వతంగా భారత్ లో స్థిరపడేందుకు వచ్చే భారతీయ సంతతి కూడా అర్హులు.
  • వయోపరిమితి: వివిధ పోస్టులను అనుసరించి 23 నుండి 30 ఏళ్ళ మధ్య వయస్సు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చెయ్యొచ్చు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారికీ గరిష్టంగా 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు సడలింపు కల్పిస్తారు.
  • విద్య అర్హుత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 60% శాతం మార్కులతో హిందీ & ఇంగ్లీష్ భాషల్లో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ దరఖాస్తు ప్రక్రియ

అర్హుత ఉన్న అభ్యర్థులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్'లో పొందిపర్చిన విదంగా కమిషన్ అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి. పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి.

పోస్టు ఎంపిక, పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.

తెలుగు రాష్ట్రాలలో అందుబాటులో ఉండే పరీక్షా కేంద్రాలు
ఎగ్జామ్ సెంటర్ SSC రీజనల్ కేంద్రం సమాచారం (సౌత్ రీజియన్)
విజయవాడ, హైదరాబాద్, చెన్నై Regional Director (SR), Staff Selection Commission, 2 nd Floor, EVK Sampath Building, DPI Campus, College Road, Chennai, Tamil Nadu-600006 (www.sscsr.gov.in)
దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 100/-
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వికలాంగులు, ESM అభ్యర్థులు దరఖాస్తు ఫీజు మినహాహించారు

ఎస్‌ఎస్‌సి జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ పరీక్ష విధానం

పరీక్ష రెండు పేపర్లుగా జరుగుతుంది. పేపర్ I ఆబ్జెక్టివ్ మోడ్ లో పూర్తి ఆన్‌లైన్ విధానం ద్వారా నిర్వహిస్తారు. జనరల్ హిందీ మరియు జనరల్ ఇంగ్లీష్ సంబంధిత అంశాలతో జరిగే ఈ పరీక్షలో మొత్తం 200 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇందులో 100 ప్రశ్నలు జనరల్ హిందీ నుండి మరో 100 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్టుల నుండి ఇవ్వబడతాయి. పరీక్షా 2 గంటల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది. సరైన సమాధనం గుర్తించిన ప్రశ్నలకు 1 మార్కు ఇవ్వబడుతుంది. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 0.25 మార్కు తొలగించబడుతుంది.

జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ పేపర్ I పరీక్షా సరళి
ఎగ్జామ్ మోడ్ సిలబస్ ప్రశ్నలు /మార్కులు సమయం
CBT (ఆబ్జెక్టివ్ ) జనరల్ హిందీ & జనరల్ ఇంగ్లీష్ 200/200 2 గంటలు

పేపర్ II డిస్క్రిప్టివ్ పద్దతిలో జరుగుతుంది. 2 గంటల వ్యవధితో 200 మార్కులకు జరిగే ఈ పరీక్షలో ఇచ్చిన రెండు పాసజీలలో ఒకటి హిందీ నుండి ఇంగ్లీష్ భాషలోకి మరొకటి ఇంగ్లీష్ నుండి హిందీ భాషలోకి ట్రాన్సలేషన్ చేయాల్సి ఉంటుంది & అలానే హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చెరో ఎస్సయ్ రాయాల్సి ఉంటుంది.

జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ పేపర్ II పరీక్షా సరళి
ఎగ్జామ్ మోడ్ సిలబస్ మార్కులు సమయం
డిస్క్రిప్టివ్ (పెన్ & పేపర్) ట్రాన్సలేషన్ & ఎస్సయ్ 200 2 గంటలు

ఎస్‌ఎస్‌సి జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ సిలబస్

Paper-I (Computer Based Examination)
Paper-I questions will be designed to test the candidates‟ understanding of the languages and literature, correct use of words, phrases and idioms and ability to write the languages correctly, precisely and effectively. The questions will be of degree level.
Paper-II: Translation and Essay : 200 Marks (Conventional Type)
paper-II will contain two passages for translation-one passage for translation from Hindi to English and one passage for translation from English to Hindi, and an Essay each in Hindi and English, to test the candidates‟ translation skills and their ability to write as well as comprehend the two languages correctly, precisely and effectively. The level of the paper will be consistent with the educational qualifications prescribed.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ & తుది ఎంపిక

పేపర్ I, పేపర్ II లలో అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు రెండు ఫోటో కాపీలతో పాటుగా అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకు సంబంధించి ఎంపికను మార్చుకునేందుకు చివరిసారి అవకాశం కల్పిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంతృప్తిపర్చని అభ్యర్థులను అనర్హులుగా పరిగణిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తియ్యాక తుది షార్ట్ లిస్ట్ తయారీలో నిమగ్నమౌతారు. పేపర్ I, పేపర్ II లకు విడివిగా అర్హుత మార్కులు ప్రకటిస్తారు. కేటగిరి వారీగా రెండు పేపర్లలో మెరిట్ సాధించిన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు.  పేపర్ I & II అందరు అభ్యర్థులు 30% మార్కులతో తప్పనిసరి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మార్కులు సమమయ్యేటప్పుడు పేపర్ II  మెరిట్ ను ప్రామాణికంగా తీసుకుంటారు. అప్పటికి సమమైతే పేపర్ I లో సాధించిన మొత్తం మార్కులను పరిగణలోకి తీసికుంటారు. అప్పటికి సమమైతే ఎక్కువ వయస్సు అభ్యర్థులకు ప్రాధన్యత ఇస్తారు. ఇంకా సమస్య పరిస్కారం కాకుంటే అభ్యర్థుల పేర్లలో ఆల్ఫాబెట్ అక్షరాలను ఆధారంగా చేసుకుని చోటు కల్పిస్తారు.

కేటగిరి పేపర్ I & II క్వాలిఫైయింగ్ మార్కులు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 30%
ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ 25%
ఇతరులు 20%