Advertisement
ఏపీ 10th టైమ్ టేబుల్ 2023 | ఏప్రిల్ 3 నుండి పరీక్షలు
Andhra Pradesh

ఏపీ 10th టైమ్ టేబుల్ 2023 | ఏప్రిల్ 3 నుండి పరీక్షలు

ఆంధ్ర ప్రదేశ్ టెన్త్ క్లాస్ 2023 పరీక్షల టైమ్ టేబుల్ వెలువడింది. పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ 03 నుండి ఏప్రిల్ 18 మధ్య నిర్వహిస్తున్నారు. ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 15తో పూర్తికానున్నాయి. ఆయా తేదీల్లో పరీక్షలు ఉదయం 9.30 నుండి 12.45 మధ్య జరుగనున్నాయి. కోవిడ్ కారణంగా గత మూడేళ్ళలో కుదింపు సిలబసుతో నిర్వహించిన పరీక్షలను, ఈ ఏడాది పూర్తి సిలబసుతో జరుపుతున్నారు. ఈ ఏడాది పరీక్షలు రోజు విడిచి రోజు చెప్పున నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం టెన్త్ పరీక్షలలో నూతన మార్పులు తీసుకొచ్చింది. గతంలో మాదిరిగా 6 సబ్జెక్టులకు 11 పేపర్లుగా కాకుండా కేవలం ఆరు పరీక్షలను మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బయోలాజికల్  సైన్స్, ఫీజికల్ సైన్స్ సబ్జెక్టులను ఒకే పేపరుగా పరీక్ష జరుపుతున్నారు. అలానే గతంలో మాదిరిగా ఇంటెర్నెల్ మార్కులు బెడద లేకుండా మొత్తం 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రధాన పరీక్షల ప్రశ్న పత్రాలలో వ్యాసరూప ప్రశ్నల విభాగానికి 70 మార్కులు కేటాయించగా, పార్ట్ బి లో మిగతా 30 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ఇవ్వనున్నారు. పార్ట్ బి ప్రశ్నలను చివరి 30 నిముషాల్లో మాత్రమే పూర్తిచేయాల్సి ఉంటుంది. బయోలాజికల్  సైన్స్, ఫీజికల్ సైన్స్ సబ్జెక్టుల సంబంధించి ఈ ఏడాది ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టు నుండి గరిష్టంగా 50 మార్కులకు ప్రశ్నలు ఇవ్వబడతయి.

ఏపీ ఎస్‌ఎస్‌సి టైమ్ టేబుల్ 2023

సబ్జెక్టు మార్కులు షెడ్యూల్ 2023
ఫస్ట్ లాంగ్వేజ్
కాంపోజిట్ కోర్సు
100 మార్కులు
70  మార్కులు
03 ఏప్రిల్ 2023
సెకండ్ లాంగ్వేజ్ 100 మార్కులు 06 ఏప్రిల్ 2023
ఇంగ్లీష్  100 మార్కులు 08 ఏప్రిల్ 2023
గణితం  100 మార్కులు 10 ఏప్రిల్ 2023
సైన్స్ (ఫీజికల్  + బయాలజీ)  100 మార్కులు 13 ఏప్రిల్ 2023
సోషల్ స్టడీస్  100 మార్కులు 15 ఏప్రిల్ 2023
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I
(సంస్కృతం, అరబిక్)
 100 మార్కులు 17 ఏప్రిల్ 2023
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ II
(సంస్కృతం, అరబిక్)
 100 మార్కులు 18 ఏప్రిల్ 2023
ఒకేషనల్ కోర్సు (థియరీ)  70 మార్కులు 18 ఏప్రిల్ 2023

Post Comment