Advertisement
10వ తరగతి తర్వాత ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలు
Career Guidance Career Options

10వ తరగతి తర్వాత ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలు

కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా అందరికి  ఉన్నత చదువులు చదివే అవకాశం ఉండకపోవచ్చు. ఇలాంటి వారికీ పది తర్వాతే ఉద్యోగం అనివార్యం కావొచ్చు . అలాఅని వీరు నిరుత్సాహపడే అవసరంలేదు, ఇలాంటివారు నెలల్లో పూర్తిఅయ్యే  స్వయంఉపాది కోర్సులు నేర్చుకుని అటువైపుగా కెరీర్ నిర్మించుకోవచ్చు అలానే కుటుంబానికి భారంకాకుండా మీ డబ్బుతో మీరు ఉన్నత చదువుల్లో కూడా చేరొచ్చు. అంతేకాకుండా పది అర్హుతతో గౌరవపరమైన కేంద్రప్రభుత్వ ఉద్యోగాలలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగం పొందేక ఇందులో కూడా  అంచెల అంచెలగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉంటుంది.

1.డిఫన్స్ ఉద్యోగాలు

త్రివిధ దళాలు: కేంద్ర రక్షణశాఖ పరిధిలో  ఉండే త్రివిధ దళాలు పది అర్హుతలో కూడిన వివిధరకాల ఉద్యోగుల భర్తీ నిమిత్తం ప్రకటనలుజారీ చేస్తూ ఉంటాయి . కొన్ని సమయాలలో జిల్లా, పట్టణ ప్రధానకేంద్రాలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా కూడా భర్తీ చేస్తుంటాయి.

ఇండియన్ ఆర్మీ

ఇండియన్ ఆర్మీ సోల్జర్ క్లార్క్స్  ఎగ్జామినేషన్
ఇండియన్ ఆర్మీ సోల్జర్ జనరల్ డ్యూటీ ఎగ్జామినేషన్ (NER)
ఇండియన్ ఆర్మీ సోల్జర్ టెక్నికల్ ఎగ్జామినేషన్ (MER)
ఇండియన్ ఆర్మీ సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ (MER)

ఇండియన్ నేవీ

ఇండియన్ నేవీ డాక్ యార్డ్ అప్రెంటిస్ ఎగ్జామినేషన్
ఇండియన్ నేవీ సైలెర్స్ మెట్రిక్ ఎంట్రీ రెక్యూప్మెంట్ ఎగ్జామినేషన్
ఇండియన్ నేవీ ఆర్టిఫీసర్ అప్రెంటిస్ ఎగ్జామినేషన్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్

IAF ఎయిర్ మ్యాన్ నాన్-టెక్నికల్ ట్రేడ్స్ ఎగ్జామినేషన్

ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కానిస్టేబుల్స్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF ) కానిస్టేబుల్ రెక్యూప్మెంట్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్: మల్టీ టాస్క్ స్టాఫ్ రెక్యూప్మెంట్ - వెబ్సైటు
అటవీ శాఖ : ఫారెస్ట్ బీట్ గార్డ్స్ వెబ్సైటు: APPSC
RRB కానిస్టేబుల్ రెక్యూప్మెంట్ -వెబ్సైట్: ఇండియన్ రైల్వే సికింద్రాబాద్
7. గ్రూప్ 4 ఉద్యోగాలు వెబ్సైటు: APPSC , TSPSC

Post Comment