కరెంట్ అఫైర్స్ క్విజ్ జులై 2022 – 30 ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు
Current Affairs Bits 2022

కరెంట్ అఫైర్స్ క్విజ్ జులై 2022 – 30 ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు

జులై నెలలో చోటు చేసుకున్న వివిధ కరెంట్ అఫైర్స్ సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలకు జవాబు చేయండి. అలానే జులై 2022 నెలకు సంబంధించి 10 విభాగాల వారీగా కరెంటు అఫైర్స్ పొందండి.

Advertisement

1. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదించిన మొదటి దేశం ఏది ?

  1. ఇండియా
  2. కెనడా
  3. బంగ్లాదేశ్
  4. న్యూజిలాండ్

సమాధానం
3. బంగ్లాదేశ్

2. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఎందుకు జరుపుతున్నారు ?

  1. ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించాలనే లక్ష్యం కోసం
  2. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవపు పురస్కరించుకుని
  3. అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి గౌరవార్దంగా
  4. పింగళి వెంకయ్య జన్మదిన జ్ఞాపకార్దంగా

సమాధానం
2. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవపు పురస్కరించుకుని

3. టిహాన్ సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?

  1. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్
  2. టిహాన్ హైదరాబాద్ ఐఐటీలో ప్రారంభించబడింది
  3. భారతదేశపు తొలి అటానమస్ నావిగేషన్
  4. పైవి అన్ని సరైనవి

సమాధానం
4. పైవి అన్ని సరైనవి

4. ఇండియా ఫస్ట్ యానిమల్ హెల్త్ సమ్మిట్ ఏ నగరంలో నిర్వహించారు ?

  1. హైదరాబాద్
  2. బెంగుళూరు
  3. న్యూఢిల్లీ
  4. ముంబై

సమాధానం
3. న్యూఢిల్లీ

5. డియోఘర్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. కేరళ
  2. బీహార్
  3. జార్ఖండ్‌
  4. గుజరాత్

సమాధానం
3. జార్ఖండ్‌

6. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ఏ రాష్ట్రంలో నిర్మించారు ?

  1. ఉత్తరప్రదేశ్
  2. హిమాచల్ ప్రదేశ్
  3. అరుణాచల్ ప్రదేశ్
  4. ఆంధ్రప్రదేశ్

సమాధానం
1. ఉత్తరప్రదేశ్

7. క్రింది వాటిలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యదేశాలు కానివి ?

  1. ఇండియా & చైనా
  2. పాకిస్తాన్ & ఆఫ్ఘనిస్తాన్
  3. ఇరాన్ & రష్యా
  4. కిర్గిజ్‌స్థాన్‌ & ఉజ్బెకిస్తాన్

సమాధానం
2. పాకిస్తాన్ & ఆఫ్ఘనిస్తాన్

8. ద్రౌపది ముర్ము సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?

  1. ద్రౌపది ముర్ము భారత రెండవ మహిళా రాష్ట్రపతి
  2. ద్రౌపది ముర్ము ఒడిశా రాష్ట్రానికి చెందిన సంతాలీ తెగకు చెందిన వారు
  3. ద్రౌపది ముర్ము జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్‌
  4. పైవి అన్ని సరైనవి

సమాధానం
4. పైవి అన్ని సరైనవి

9. యూఎస్ సుప్రీంకోర్టు తోలి నల్లజాతీయ జడ్జి ఎవరు ?

  1. సాండ్రా డే ఓ'కానర్
  2. జెనీవీవ్ రోజ్ క్లైన్
  3. కాథరిన్ సెల్లెర్స్
  4. కేతంజీ బ్రౌన్ జాక్సన్

సమాధానం
4. కేతంజీ బ్రౌన్ జాక్సన్

10. ఇటీవలే హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని ఎవరు ?

  1. యోషిహికో నోడా
  2. నోబుసుకే కిషి
  3. షింజో అబే
  4. ఈసాకు సాటో

సమాధానం
3. షింజో అబే

11. ప్రస్తుత శ్రీలంక ప్రధాని మంత్రి ఎవరు ?

  1. దినేష్ గుణవర్దన
  2. రణిల్ విక్రమసింఘే
  3. మహింద రాజపక్స
  4. మైత్రిపాల సిరిసేన

సమాధానం
1. దినేష్ గుణవర్దన

12. 2022 లో గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించిన వ్యాధి ఏది ?

  1. కోవిడ్ 19
  2. మంకీ ఫాక్స్
  3. హాంకాంగ్ ఫ్లూ
  4. రష్యన్ ఫ్లూ

సమాధానం
2. మంకీ ఫాక్స్

13. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరు ?

  1. దేవేంద్ర ఫడ్నవీస్
  2. ఉద్ధవ్ థాకరే
  3. ఏక్‌నాథ్ షిండే
  4. భగత్ సింగ్ కోష్యారీ

సమాధానం
3. ఏక్‌నాథ్ షిండే

14. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 విజేత ?

  1. రూబల్ షెకావత్
  2. షినతా చౌహాన్
  3. సినీ శెట్టి
  4. మానస వారణాసి

సమాధానం
3. సినీ శెట్టి

15. రాష్ట్రపతి కోటాలో ఎంత మందిని రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేయొచ్చు ?

  1. 12 సభ్యులు
  2. 4 సభ్యులు
  3. 1 సభ్యుడు
  4. 8 సభ్యులు

సమాధానం
1. 12 సభ్యులు

16. ఇటీవలే గుజరాత్ వ్యక్తిలో గుర్తించిన బ్లడ్ గ్రూప్ ?

  1. HH బ్లడ్ గ్రూప్
  2. Rh జీరో బ్లడ్ గ్రూప్
  3. EMM నెగిటివ్
  4. AB నెగిటివ్

సమాధానం
3. EMM నెగిటివ్

17. పరీక్ష సంగం పోర్టల్ కింది వాటిలో దేనికి సంబంధించింది ?

  1. సీబీఎస్ఈ
  2. యూజీసీ
  3. యూపీఎస్సీ
  4. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

సమాధానం
1. సీబీఎస్ఈ

18. క్రింది వాటిలో విదేశీ విరాళాలకు సంబంధించిన భారతీయ చట్టం ఏది ?

  1. విదేశీ రిక్రూటింగ్ చట్టం
  2. ఇండియన్ ట్రస్ట్ చట్టం
  3. విదేశీయుల నమోదు చట్టం
  4. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్

సమాధానం
4. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్

19. 2022 రూర్బన్ మిషన్ డెల్టా ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ?

  1. జార్ఖండ్
  2. ఒడిశా
  3. తెలంగాణ
  4. గుజరాత్

సమాధానం
1. జార్ఖండ్

20. డిజిటల్ లోక్ అదాలత్‌ ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది ?

  1. రాజస్థాన్
  2. కర్ణాటక
  3. మహారాష్ట్ర
  4. గోవా

సమాధానం
1. రాజస్థాన్

21. భారతదేశపు తొలి ప్యాసింజర్ డ్రోన్‌ పేరు ఏంటి ?

  1. గంగా
  2. మేఘ్
  3. వరుణ
  4. హనుమాన్

సమాధానం
3. వరుణ

22. యూఎన్ ఫోర్స్ కమాండర్‌గా నియమింపబడ్డ భారతీయ జనరల్ ఎవరు ?

  1. అమర్‌దీప్ సింగ్ భిండర్
  2. మోహన్ సుబ్రమణియన్‌
  3. మనోజ్ ముకుంద్ నరవాణే
  4. జస్వీందర్ సింగ్ సంధు

సమాధానం
2. జనరల్ మోహన్ సుబ్రమణియన్‌

23. దేశంలో మొదటి హర్ ఘర్ జల్  సర్టిఫైడ్ జిల్లా ఏది ?

  1. ముజఫర్‌పూర్ (బీహార్)
  2. బుర్హాన్‌పూర్ (మధ్యప్రదేశ్)
  3. ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్)
  4. తిరువళ్లూరు (తమిళనాడు)

సమాధానం
2. బుర్హాన్‌పూర్ (మధ్యప్రదేశ్)

24. 2020 గాను ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న చిత్రం ?

  1. నాట్యం
  2. కలర్ ఫోటో
  3. అలా వైకుంఠపురం
  4. ఆకాశమే నీ హద్దురా

సమాధానం
2. కలర్ ఫోటో

25. డా. రాజేంద్ర ప్రసాద్ స్మారక అవార్డు ఎవరికి ఇవ్వనున్నారు ?

  1. ఉత్తమ రాజకీయ నాయకులకు
  2. ఉత్తమ సాహిత్యకారులకు
  3. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో అకడమిక్ ఎక్సలెన్స్
  4. ఉత్తమ సామాజిక కార్యకర్తలకు

సమాధానం
3. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో అకడమిక్ ఎక్సలెన్స్

26. 2022 లో పీవీ సింధు గెలుచుకున్న బ్యాడ్మింటన్ టైటిల్ ఏది ?

  1. సింగపూర్ ఓపెన్
  2. స్విస్ ఓపెన్
  3. సయీద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్
  4. పైవి అన్నీ

సమాధానం
4. పైవి అన్నీ

27. 2022 కామన్వెల్త్ క్రీడలకు ఆతిధ్యం ఇచ్చిన నగరం ఏది ?

  1. టోక్యో (జపాన్)
  2. ఢిల్లీ (ఇండియా)
  3. బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా)
  4. బర్మింగ్‌హామ్‌ (ఇంగ్లాండ్)

సమాధానం
4. బర్మింగ్‌హామ్‌ (ఇంగ్లాండ్)

28. వింబుల్డన్ 2022 పురుషుల సింగిల్స్ విజేత ?

  1. రఫెల్ నాదల్
  2. నొవాక్ జొకోవిచ్
  3. నిక్ కిర్గియోస్‌
  4. ఎలెనా రిబాకినా

సమాధానం
2. నొవాక్ జొకోవిచ్

29. జీఎస్‌టీ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు ?

  1. జులై 01
  2. జులై 11
  3. జులై 21
  4. జులై 31

సమాధానం
1. జులై 01

30. కింది వాటిలో సరైన జతను గుర్తించండి ?

  1. ప్రపంచ మలాలా దినోత్సవం - జులై 12
  2. మండేలా అంతర్జాతీయ దినోత్సవం - జులై 1
  3. ఇండియా ఫ్లాగ్ అడాప్షన్ డే - జులై 22
  4. పైవి అన్నీ సరైనవి

సమాధానం
4. పైవి అన్నీ సరైనవి

Advertisement

Post Comment