క్రాఫ్ట్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ ఎలిజిబిలిటీ మరియు రిజిస్ట్రేషన్
Skill development schemes

క్రాఫ్ట్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ ఎలిజిబిలిటీ మరియు రిజిస్ట్రేషన్

స్థానిక ట్రేడ్ వ్యాపారాల్లో నైపుణ్యం కలిగిన ఇంజనీరింగ్ ట్రేడ్స్ & నాన్-ఇంజనీరింగ్ ట్రేడ్స్ కార్మికులను, దేశీయ పరిశ్రమ కోసం క్రమబద్ధమైన శిక్షణ అందించి, పారిశ్రామిక ఉత్పత్తిని పరిమాణాత్మకంగా మరియు గుణాత్మకంగా పెంచడానికి మరియు నిరుద్యోగాన్ని తగ్గించేందుకు గాను భారత ప్రభుత్వం 1950 లో క్రాఫ్ట్‌మెన్స్ ట్రైనింగ్ స్కీమ్ ప్రవేశపెట్టింది.

Advertisement

చదువుకున్న యువతకు ఉపాధి నైపుణ్యాలను అందించడం ద్వారా వారిలో సాంకేతిక మరియు పారిశ్రామిక వైఖరిని పెంపొందించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తృతంగా ఉన్న ఐటీఐల నెట్‌వర్క్ ద్వారా దేశీయ అవసరాలకు ఉపయోగపడే మానవ వనరులను కొన్ని దశాబ్దాలుగా ఈ స్కీమ్ అందిస్తుంది.

భారత రాజ్యాంగం ప్రకారం, ఒకేషనల్ శిక్షణ అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి విషయం. జాతీయ స్థాయిలో శిక్షణా పథకాల అభివృద్ధి, విధాన నిర్ణయాలు, శిక్షణ ప్రమాణాలు, పరీక్షల నిర్వహణ, ధృవీకరణ మొదలైన బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తుంది. అయితే ప్రవేశాలు, శిక్షణ పథకాల అమలు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది. ఏటా దాదాపు 22 లక్షలకు పైగావ ఒకేషనల్ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఐటీఐలలో శిక్షణ పొందుతున్నారు.

ఈ పథకం ప్రధానంగా ఉన్నత విద్యకు నోచుకోని గ్రామీణ విద్యార్థుల కోసం రూపొందించబడింది. స్వల్పకాలిక నైపుణ్య కోర్సులలో శిక్షణ ఇవ్వడం ద్వారా, వారు కెరీర్ యందు త్వరగా స్థిరపడేందుకు లేదా స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 15,042 ఐటీఐల (గవర్నమెంట్ 2,738 + ప్రైవేట్ 12,304) నెట్‌వర్క్ ల ద్వారా దాదాపు 140 రకాల ఒకేషనల్ ట్రేడ్స్ యందు ఆరు నెలల వ్యవధి నుండి రెండేళ్ల నిడివితో శిక్షణ అందిస్తున్నారు. కనీస విద్యా అర్హుత 8 నుండి ఈ ట్రేడ్స్ ప్రారంభమౌతాయి.

సీటీఎస్ రిజిస్ట్రేషన్ & ఎలిజిబిలిటీ

  • ట్రేడ్‌ల శిక్షణ వ్యవధి ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది
  • ట్రేడ్ కోసం నిర్దేశించిన విద్యా అర్హత క్లాస్ VIII పాస్ నుండి క్లాస్ XII పాస్ వరకు ట్రేడ్‌ని బట్టి మారుతుంది.
  • కొత్త కోర్సులకు అడ్మిషన్ ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో నిర్వహిస్తారు.
  • కనీస వయస్సు 14 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి లేదు.
  • ప్రవేశ ప్రకటన స్థానిక ఐటీఐల ద్వారా వెలువడుతుంది.
  • ప్రవేశాలు NCVT అడ్మిషన్ సిఫారసు ప్రకారం వ్యక్తిగత ట్రేడ్ కొరకు నిర్దేశించిన కనీస అర్హత యొక్క పబ్లిక్ పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా / రాత పరీక్ష ఆధారంగా కల్పిస్తారు.

సీటీఎస్ ముఖ్యమైన వివరాలు

  • ప్రస్తుతం దేశంలో ఉన్న 15,042  ఐటీఐ లలో 140 పైగా ఒకేషనల్ ట్రేడ్స్ అందుబాటులో ఉన్నాయి.
  • నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) నిర్దేశించిన పాఠ్యాంశాల ప్రకారం ఈ సంస్థలు శిక్షణా కోర్సులను అందిస్తాయి.
  • శిక్షణ కాలం పూర్తయిన తర్వాత ట్రైనీలు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో హాజరు కావాలి.
  • నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) సంవత్సరానికి రెండుసార్లు (అక్టోబర్/ నవంబర్ మరియు ఏప్రిల్/ మే) ట్రేడ్ అప్రెంటీస్‌ల కోసం ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లు (AITT) నిర్వహిస్తారు.
  • ట్రేడ్ టెస్ట్‌లో విజయవంతమైన ట్రైనీలకు జాతీయ ట్రేడ్ సర్టిఫికేట్ ప్రదానం చేయబడుతుంది.
  • ట్రేడ్ సర్టిఫికేట్ కేంద్ర ప్రభుత్వ సబార్డినేట్ పోస్టులు మరియు ఇతర నియామకలకు దరఖాస్తు చేసేందుకు ఉపయోగపడుతుంది.
  • శిక్షణ కాలంలో దాదాపు 70% ప్రాక్టికల్ ట్రైనింగ్, మరియు మిగిలినవి థియరీ ఉంటుంది.
  • వీటితో పాటుగా వర్క్‌షాప్ కాలిక్యులేషన్ & సైన్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, పర్యావరణ శాస్త్రం & కుటుంబ సంక్షేమంతో సహా సామాజిక అంశాలు కూడా ఉంటాయి.
  • ప్రభుత్వ ITI లలో నామమాత్రపు రుసుముతో శిక్షణ అందిస్తారు. వారికి లైబ్రరీ, క్రీడలు మరియు వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • శిక్షణ సమయంలో ట్రైనీలకు నామమాత్రపు స్టైపెండ్ అందిస్తారు.
  • శిక్షణలో మెరిట్ కనబర్చిన తరగతిలో 4% మంది ట్రైనీలకు నెలకు 125 రూపాయలు చెప్పున మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తారు.

Advertisement

Post Comment