ఒక లాంగ్వేజ్ మాట్లాడేందుకు దానికి అవసరమయ్యే పదజాలం (vocabulary) తెలిసి ఉండాలి. పదజాలం తెలియకుండా, ఎన్ని వ్యాకరణ సూత్రాలు కంఠస్థ పెట్టిన ఉపయోగం ఉండదు. ఒక వస్తువు పేరు పలానా అని తెలియకుండా ఒక భాషను మాట్లాడటం అసాధ్యం. ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకునే ముందు ఆ భాషకు సంబంధించిన వాడుక పదాలను మొదట తెలుసుకుని తీరాలి.
పదజాలం నేర్చుకునేందుకు సహజ అభ్యసన ఉత్తమం
మాతృ భాషకు చెందిన పదజాల అభ్యసన పుట్టిన రెండు మూడేళ్ల నుండి సహజంగా ప్రారంభమోతుంది. అమ్మ అది ఏంటి ?, డాడీ ఇది ఏంటి, తాతయ్య దానిని ఏమంటారు వంటి ప్రశ్నలతో మొదలైన ఈ నిరంతర అభ్యసన ప్రకియ, ఇప్పటికి కొనసాగుతూ ఉంటుంది.
ఒక స్వీట్ షాపులో ఈ స్వీటును ఏమంటారు అనే ప్రశ్న నుండి కొత్తగా డౌన్‌లోడు చేసే మొబైల్ యాప్ ఫీచర్స్ పేర్లు తెలుసుకునే వరకు సహజంగా జరిగిపోతుంటుంది.
ఇదే సూత్రాన్ని కొత్త లాంగ్వేజ్ నేర్చుకునే సమయంలో ఉపయోగించడం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు. అలా కాకుండా మార్కెటులో దొరికే ఆంగ్ల పదజాలానికి చెందిన పుస్తకం కొనుక్కొని, కంఠస్త చేస్తే వారం పదిరోజులల్లో వాటిని మర్చిపోతాం.
అదే సహజ అభ్యసన పక్రియను అనుసరించడం వలన నేర్చుకోవడం సులభమౌతుంది. మీ నిత్యజీవితంలో ప్రతి రోజు ఉపయోగించే మరియు తారసపడే వస్తువుల పేర్లను ఎప్పటికపుడు నేర్చుకోవడం వలన ఎక్కువ కాలం, ఆ సందర్భానికి చెందిన జ్ఞాపకాలతో గుర్తుండిపోతాయి .
ఈ టెక్నిక్ ఎప్పటికప్పుడు ఉపయోగించేందుకు గూగుల్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్ (Tel - Eng) లేదా అక్కడ ఉండే వారిని అడిగి తెలుసుకోవడం ద్వారా మీ అభ్యసన కొనసాగించవచ్చు. నిత్యజీవితంలో మీరు ఎక్కువ ఉపయోగించే కొన్ని తెలుగు పదాలకు సంబంధించిన ఆంగ్ల పదజాలాన్ని ఇక్కడ చూడొచ్చు.
Human Body Vocabulary (మానవ శరీరం)
Telugu Word | English Word | Telugu Word | English Word |
---|---|---|---|
చీలమండ | ANKLE | నాలుక | TONGUE |
చేయి (మడమ) | ARM | కన్ను | EYE |
ఛాతి / రొమ్ము | CHEST | చెవి | EAR |
పాదము | FOOT | మూత్రాశయం | BLADDER |
చేయి | HAND | గుండె | HEART |
మోకాళ్ళు | KNEE LEG | ఊపిరితిత్తులు | LUNGS |
మెడ | NECK | మూత్రపిండం | KIDNEY |
భుజము | SHOULDER | కాలేయం | LIVER |
వీపు | BACK | అస్థిపంజరం | SKELETON |
దంతం | TOOTH | ఎముక | BONE |
నోరు | MOUTH | వెన్నుముక | SPINE |
మోచేయి | ELBOW | మూత్రనాళం | URETHRA |
తల | HEAD | గర్భాశయం | UTERUS |
కాలి మడమ | HEEL | జుట్టు | HAIR |
తొడ | THIGH | పెదవులు | LIPS |
చిటికెన వేలు | LITTLE FINGER | దవడ ముందు భాగం & గడ్డం | CHIN & BEARD |
ఉంగరం వేలు | RING FINGER | చెంప | CHEEK |
మధ్య వేలు | MIDDLE FINGER | కనుబొమ్మ | EYEBROW |
చూపుడు వేలు | INDEX FINGER | తొడ ఎముక | FEMUR |
బొటను వేలు | THUMB | గ్రంథులు | GLANDS |
వేలు కణుపు | KNUCKLE | కనుపాప | IRIS |
మణికట్టు | WRIST | స్నాయువు (బందకం) | LIGAMENT |
గోటి వేలు | FINGER NAILS | కండలు | MUSCLE |
ఉదరం / పొత్తి కడుపు | ABDOMEN | క్లోమం | PANCREAS |
పిరుదులు | BUTTOCKS | గొంతు | THROAT |
Animal Vocabulary (జంతువులు)
Telugu Word | English Word | Telugu Word | English Word |
---|---|---|---|
కప్ప | Frog | ఏనుగు | Elephant |
తేలు | Scorpion | మేక | Goat |
సాలీడు | Spider | గుర్రం | Horse |
కాకి | Crow | సింహం | Lion |
కోకిల | Cuckoo | హైనా | Hyena |
పావురం | Dove | ఎలుక | Rat |
నెమలి | Pigeon | ఖడ్గమృగం | Rhinoceros |
బాతు | Duck | ఉడుము | Skunk |
డేగ | Eagle | గొర్రె | Sheep |
గుడ్లగూబ | Owl | తోడేలు | Wolf |
రామ చిలుక | Parrot | నత్త | Snail |
పిచ్చుక | Sparrow | మొసలి | Crocodile |
కొంగ | Stork | బల్లి | Lizard |
హంస | Swan | పాము | Snake |
రాబందు | Vulture | తాబేలు | Tortoise |
వడ్రంగి పిట్ట | Woodpecker | వాన పాము | Earthworm |
సీతాకోక చిలుక | Butterfly | జలగ | Leech |
చీమ | Ant | కొండా చిలువ | Python |
తేనిటీగా | Bee | తిమింగలం | Whale |
బొద్దింక | Cockroach | పులి | Tiger |
గబ్బిలం | Bat | ఉడుత | Squirrel |
ఎలుగు బంటి | Bear | పంది | Pig |
ఎద్దు | Bullock | జిరాఫీ | Giraffe |
ఒంటె | Camel | ఫ్లై | Fly |
జింక | Deer | తూనీగ | Dragonfly |
House-Related Vocabulary
Telugu Word | English Word | Telugu Word | English Word |
---|---|---|---|
ఉపకరణాలు | Appliances | లాండ్రీ గది | Laundry room |
పెరడు | Backyard | ఉత్తరాల పెట్టె | Mailbox |
స్నానం గది | Bathroom | గడ్డివాము | Loft |
చీపురు | Broom | తుడుపుకర్ర | Mop |
కార్పెట్ (తీవాచీ) | Carpet | అద్దం | Mirror |
పైకప్పు | Ceiling | చాప | Mat |
సెల్లార్ (భూగర్భ గది) | Celler | వంటగది | Pantry |
పొగ గొట్టం | Chimney | వరండా | Portico |
అల్మారా | Cupboard | కొలను | Pool |
భోజనాల గది | Dining room | మెత్తని బొంత | Quilt |
గిన్నెలు తోమేది | Dish washer | పిట్టగోడ (ఇనుప కంచె) | Railing |
ఆరబెట్టేది | Dryer | పైకప్పు | Roof |
వాకిలి | Driveway | మెట్ల మార్గం | Stairway |
ప్రవేశం | Entrance | మెట్లు | Stairs |
నేల | Floor | నీటి జల్లు | shower |
పునాది | Foundation | అర | Shelf |
ఫర్నిచర్ | Furniture | నిల్వగది | Storage shed |
చెత్తకుండీ | Garbage can | కాలకృత్యాల గది | Toilet |
తోట | Garden | మేడపైన | Upstairs |
పెద్ద గది | Hall | నీరుకారే తొట్టె | Sink |
వంటగది | Kitchen | నీళ్లు వేడిచేసేది | Water heater |
నిచ్చెన | Ladder | బట్టలు ఉతికే మిషన్ | Washing machine |
దీపం | Lamp | కిటికీ | Window |
గ్రంధాలయం | Library | ఖాళీ స్థలం | Yard |
సాధారణ గది | Living room | ఇంటిని శుభ్రంచేసేది | Vacuum cleaner |
Vegetables & Fruits Vocabulary
Telugu Word | English Word | Telugu Word | English Word |
---|---|---|---|
పుట్టగొడుగులు | Mushrooms | కమలాపండు | Orange |
నిమ్మకాయ | Lemon | బొప్పాయి | Papaya |
ఉల్లిపాయలు | Onions | ఎండు ద్రాక్ష | Raisins |
వెల్లుల్లి | Garlic | అరటిపండు | Banana |
అల్లము | Ginger | ద్రాక్షపళ్ళు | Grapes |
దోసకాయ | Cucumber | దానిమ్మ | Pomegranate |
టమాటో | Tomato | లిచీ | Lychee |
క్యారెట్ | Carrot | స్ట్రాబెర్రీ | Strawberry |
పాలకూర | Lettuce | చెర్రీ | Cherry |
వంకాయ | Aubergine | జామకాయ | Guava |
పుచ్చకాయ | Watermelon | సీతాఫలం | Custard apple |
క్యాబేజి | Cabbage | ఖర్జురం | Date fruit |
గుమ్మడి కాయ | Pumpkin | జీడీ పండు | Cashew fruit |
ముల్లంగి | Radish | నేరుడు పండు | Java Plum |
బచ్చల కూర | Spinach | కరివేపాకు | Curry leaves |
వైల్డ్ క్యాబేజీ | Broccoli | పుదీనా | Mint leaves |
బంగాళాదుంప | Potato | కొత్తిమీర | Coriander leaves |
కర్బుజా | Muskmelon | తోటకూర | Amaranth leaves |
కాలీఫ్లవర్ | Cauliflower | గోంగూర | Hibiscus cannabinus |
అనాస పండు | Pineapple | చుక్కకూర | Sorrel leaves |
మునగ కాడలు | Drumstick | బచ్చలికూర | Malabar spinach |
బీరకాయ | Ridge gourd | సపోటా | Manilkara zapota (sapota) |
కాకర కాయ | Bitter melon | ఆపిల్ | Apple |
గోరు చిక్కుడు | Green Beans | పనస | Jackfruit |
మామిడి | Mango | చిలగడదుంప | Sweet potato |
Pulses and Spices Vocabulary
Telugu Word | English Word | Telugu Word | English Word |
---|---|---|---|
పెసలు (Moong Dal) | Green Gram | ధనియాలు | Coriander seeds |
మినుములు (Urad Dal) | Urad bean | ఆవగింజలు | Mustard seeds |
కిడ్నీ బీన్స్ (Rajma) | kidney beans | జాజికాయ | Nutmeg |
కందిపప్పు (Toor dal) | Pigeon peas | జాపత్రి | Mace |
ఎరుపు కందిపప్పు (Masoor dal) | Red Lentil | మెంతులు | Fenugreek |
ఉలవలు | Horse gram | పసుపు | Turmeric Powder |
గోధుమ పిండి | Wheat powder | కుంకుమ పువ్వు | Saffron |
రాగులు (Ragi flour) | Finger millet | రోజ్మేరీ | Rosemary |
జొన్న పిండి (Jowar flour) | Sorghum bicolo | మిరపకాయ పొడి | Paprika powder |
కొర్రలు | Foxtail millet | కారపు మిరియాలు | Cayenne pepper |
వరిగలు | Proso millet | ఉప్పు | Salt |
సజ్జలు | Pearl millet | పంచదార | Sugar |
మొక్కజొన్న | Maize | గసగసాలు | khas khas |
బార్లీ గింజలు | Barley seeds | నల్ల జీలకర్ర | kalonji seeds |
వేరుశనగ గుళ్ళు | Groundnut (Peanuts) | సబ్జా గింజలు | Basil seeds |
వరి (బియ్యం) | Rice (Oryza sativa) | తులసి పొడి | Amla powder |
శనగపిండి (Channa dal) | chickpea flour | పిప్పలి (మిరియాలు) | Long pepper (Piper longum) |
సోయాబీన్ | Soybean | అవిసె గింజలు | flax seeds |
ఫాబా బీన్స్ | Broad bean | పచ్చి మామిడీ పొడి | Amchoor powder |
బఠాణి (గ్రీన్ పీస్) | Pisum sativum | వాము (అజ్వైన్) | Carom seeds |
యాలకులు | Cardamom | తేయాకు (Malabar leaf) | Cinnamomum tamala |
లవంగం | Clove | తేయాకు | Camellia sinensis |
కాసియా బెరడు (దాల్చినచెక్క) | Cinnamon | నువ్వులు (Gingelly) | Sesame Seeds |
నల్ల మిరియాలు | Black pepper | హింగ్ (అసఫోటిడా) | Asafoetida Powder |
జీలకర్ర | Cumin seeds | కారంపొడి | Chili Powder |
Professions & Occupations
Telugu Word | English Word | Telugu Word | English Word |
---|---|---|---|
అకౌంటెంట్ | Accountant | ఉత్తరాలు బట్వాడా చేసేవాడు | Postman |
నటుడు / నటి | Actor /Actress | శాస్త్రవేత్త | Scientist |
వాస్తు శిల్పి (ఆర్కిటెక్ట్) | Architect | సైనికుడు | Soldier |
ఖగోళ శాస్త్రవేత్త | Astronomer | అనువాది | Translator |
రచయిత | Author | జంతు వైద్యుడు | Veterinary doctor |
రొట్టెలు చేసేవాడు | Baker | వడ్రంగి | Carpenter |
వంట పని చేసేవారు | Chef/Cook | రైతు | Farmer |
దంత వైద్యుడు | Dentist | విమానం నడిపేవాడు | Pilot |
డిజైనర్ | Designer | మానసిక శాస్త్రవేత్త | Psychiatrist |
వైద్యుడు | Doctor | కుమ్మరి | Potter |
విద్యుత్ కార్మికుడు | Electrician | శాస్త్ర చికిత్స చేసేవాడు | Surgeon |
ఇంజనీర్ | Engineer | దర్జీ | Tailor |
అగ్నిమాపక కార్మికుడు | Fireman | వెల్డింగ్ చేసేవాడు | Welder |
జాలరి | Fisherman | మంగలి | Barber |
పూల వ్యాపారి | Florist | బ్యూటీషియన్ | Beautician |
తోటమాలి | Gardener | సంరక్షకుడు | Caretaker |
మంగళివాడు | Hairdresser | సామజిక కార్యకర్త | Social worker |
వార్తలు సేకరించేవాడు | Journalist | జంతు శాస్త్రవేత్త | zoologist |
న్యాయమూర్తి | Judge | గాయకుడు | vocalist |
న్యాయవాది | Lawyer | నావికుడు | Sailor |
భోధించేవాడు | Lecturer | వ్యాపారవేత్త | Business man |
గ్రంధాలయం నిర్వహించేవాడు | Librarian | వ్యవస్థాపకుడు | Entrepreneur |
మెకానిక్ | Mechanic | సంగీతకారుడు | Musicians |
పైపులు బిగించేవాడు | Plumber | నృత్యకారుడు | Dancer |
రాజకీయ నాయకుడు | Politician | బ్లాగర్ | Blogger |