టీఎస్‌పీఎస్సీ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ 2023
Telangana

టీఎస్‌పీఎస్సీ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ 2023

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలయ్యే ప్రతీసారి, అభ్యర్థి తమ పూర్తి వివరాలు నమోదుచేయాల్సిన బెడద లేకుండా, వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రకియ ద్వారా, అభ్యర్థి ఒకసారి టీఎస్‌పీఎస్సీ పోర్టల్ యందు తమ వ్యక్తిగత, విద్య, చిరునామా వివరాలు పొందుపరిస్తే, భవిష్యత్తులో టీఎస్‌పీఎస్సీ భర్తీచేసే ఉద్యోగాలకు ఒక క్లిక్ లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం అభ్యర్థి పొందుతారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం.

ఓటీపీఆర్ దరఖాస్తు కోసం కావాల్సిన డాక్యూమెంట్స్

  • ఆధార్ కార్డు
  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
  • అడ్రెస్స్ ఐడీ
  • ఆల్ ఎడ్యుకేషన్ పాస్ సర్టిఫికెట్స్
  • క్లాస్ 1st నుండి చివరి క్వాలిఫికేషన్ వరకు స్టడీ సర్టిఫికెట్స్
  • NCC వంటి ఇతర ధ్రువపత్రాలు
  • మొబైల్ నెంబర్
  • ఇమెయిల్ ఐడీ
  • Jpg/Jpeg ఫార్మెట్లో మీ డిజిటల్ సిగ్నేచర్
  • Jpg / Jpeg ఫార్మెట్లో మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటో

టీఎస్‌పీఎస్సీ ఓటీపీఆర్ దరఖాస్తు ప్రక్రియ

ఓటీపీఆర్ నమోదు ప్రక్రియ అధికారిక టీఎస్‌పీఎస్సీ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో కొనసాగే ఈ ఓటీపీఆర్ ప్రక్రియ నాలుగు దశలలో ఉంటుంది. మొదటి దశలో అభ్యర్థి ఆధార్ నెంబరును ఎంటర్ చేయాలి. అలానే ఆధార్ మరియు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ యందు వున్నా ఫార్మెట్లో పూర్తి పేరును పొందుపర్చాలి. ఇదే క్రమంలో అభ్యర్థి డేట్ ఆఫ్ బర్త్, జండర్ వివరాలను పొందుపర్చాలి.

రెండవ దశలో అభ్యర్థి తల్లిదండ్రుల వివరాలు, జన్మించిన జిల్లా, మండలం, ప్రాంతం వంటి పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి. అలానే అభ్యర్థి మాతృబాష, మతం, టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ యందు ఉన్న ఐడెంటిఫికేషన్ మర్క్స్ వివరాలు కూడా నమోదు చేయాలి. ఇదే క్రమంలో అభ్యర్థి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అడ్రెస్స్ వివరాలు లేదా శాశ్వత చిరునామా వివరాలు పొందుపర్చాలి. వీటితో పాటుగా మొబైల్ నంబరు, ఇమెయిల్ ఐడీ వివరాలు కూడా నమోదు చేయాలి.

మూడవ దశలో 1వ తరగతి నుండి విద్యార్థి చివరి విద్యా ఉత్తీర్ణత వరకు, జాయిన్ అయినా కోర్సు, స్కూల్/కాలేజీ/యూనివర్సిటీ, ఆయా కోర్సులలో జాయిన్ అయినా మరియు ఉత్తీర్ణత పొందిన ఏడాది, చదివిన జిల్లా, హాల్ టికెట్ వంటి వివరాలను పొందుపర్చాలి. ఇక చివరిగా నాల్గువ దశలో జెపిజి/జేపీఈజీ ఫోర్మెట్లో మీ డిజిటల్ సంతకం మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటో అప్‌లోడ్  చేయడం ద్వారా ఓటీపీఆర్ నమోదు ప్రక్రియ పూర్తి అవుతుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశాక మీకు ఓటీపీఆర్ రిజిస్టర్ ఐడీ వస్తుంది. తర్వాత దశలో టీఎస్‌పీఎస్సీ పోర్టల్ ద్వారా ఈ ఓటీపీఆర్ ఐడీ మరియు మొబైల్ నెంబర్ ఉపయోగించి మీ టీఎస్‌పీఎస్సీ ప్రొఫైల్ అకౌంటుకు పాస్‌వర్డ్‌ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనితో మీ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసినట్లు భావించాలి.

ఈ ప్రక్రియ పూర్తియిన తర్వాత మీ మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీకి ఓటీపీఆర్ ఐడీ నంబరుతో పాటుగా లాగిన్ వివరాలు పంపబడతాయి. ఈ ఓటీపీఆర్ నెంబర్ జాగ్రత్తగా భద్రపర్చుకోండి. ఈ వివరాలతో భవిష్యత్తులో టీఎస్‌పీఎస్సీ నుండి వచ్చే ఉద్యోగ ప్రకటనలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. పైన పొందుపర్చిన వివరాలు పదేపదే నమోదు చేయాల్సిన బెడద ఉండదు.

మీ టీఎస్‌పీఎస్సీ ఓటీపీఆర్ ఐడీ మర్చిపోతే ?

ఓటీపీఆర్ యూజర్ నేమ్ లేదా పాస్‌వర్డ్‌ వివరాలు మర్చిపోయిన అభ్యర్థులు గాబరా పడాల్సిన అవసరం లేదు. టీఎస్‌పీఎస్సీ పోర్టల్ యందు ఉన్న నో యువర్  టీఎస్‌పీఎస్సీ ఐడి లింక్ ద్వారా మీ ఆధార్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయడం ద్వారా ఆ వివరాలను తిరిగి పొందొచ్చు. దీనికి సంబందించిన లింక్ వివరాలు ఈ ఆర్టికల్ దిగువున అందుబాటులో ఉంది. సరైన వివరాలు పొందుపర్చి మీ ఓటీపీఆర్ సమాచారం పొందండి. వాటిని పొందాక, మరోసారి ఈ పరిస్థితి తెలెత్తకుండా భద్రపర్చుకోండి.

ఓటీపీఆర్ దరఖాస్తు

EDIT YOUR OTPR DETAIL

Know Your OTPR ID

Post Comment