సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, 8 నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం 'సైన్స్ ఛాలెంజ్'ని నిర్వహిస్తోంది. సీబీఎస్ఈ తో పాటుగా అన్ని బోర్డులకు చెందిన 8 నుండి 10వ తరగతి విద్యార్థులు జనవరి 17 నుండి ఫిబ్రవరి 28, 2022 వరకు అధికారిక దీక్షా ప్లాట్‌ఫారమ్ ద్వారా ఛాలెంజ్'లో పాల్గునవచ్చును. మానవుని జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో అనునిత్యం దోహద పడుతున్న శాస్త్రీయ మరియు సాంకేతిక అంశాల యందు విద్యార్థులలో ఉత్సుకత మరియు అవగాహనా కల్పించడం ద్వారా వారిలో ఉన్నత శ్రేణి ఆలోచనను రూపొందించడానికి ఒక చొరవగా ఈ 'సైన్స్ ఛాలెంజ్'ని ఏర్పాటు చేస్తున్నారు.
విజయవంతంగా సైన్స్ ఛాలెంజ్ పూర్తిచేసి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పొందిన పాఠశాలలు, తమ పాఠశాల నుండి 5 మంది విద్యార్థులను నేరుగా రామన్ యంగ్ సైన్స్ ఇన్నోవేటర్ అవార్డ్స్ రెండవ దశకు లేదా నేషనల్ క్వాలిఫైయర్‌లకు నామినేట్ చేయవచ్చు. సైన్స్ ఛాలెంజ్‌కు హాజరు కావడానికి ఎటువంటి పార్టిసిపేషన్ ఫీజులు అవసరం లేదు. ఆసక్తి ఉండే విద్యార్థులు గడువులోపు నమోదు చేసుకోండి.
సైన్స్ ఛాలెంజ్ రిజిష్ట్రేషన్ విధానం
సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో చదివే విద్యార్థులు నేరుగా తమ పాఠశాలల ద్వారా తమ సీబీఎస్ఈ రిజిస్ట్రేషన్ ఐడీ ఉపయోగించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సైన్స్ ఛాలెంజ్ కోసం దరఖాస్తు చేయడానికి, సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలు, తమ అధికారిక వెబ్‌సైట్‌ను (cbse.gov.in) సందర్శించి, వారి విద్యార్థులను నమోదు చేసుకోవాలి. పాఠశాలలు విద్యార్థులను నమోదు చేసిన వెంటనే, రిజిస్ట్రేషన్ ఐడీలు రూపొందించబడతాయి, అవి సంబంధిత విద్యార్థులకు అందించబడతాయి. విద్యార్థులు ఆ తర్వాత దీక్షా పోర్టల్‌ని తెరిచి, క్విజ్‌కు హాజరు కావడానికి తమ పూర్తి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది.
సీబీఎస్ఈతో అనుబంధం లేని పాఠశాలల విద్యార్థులు నేరుగా దీక్ష ప్లాట్‌ఫారమ్ ద్వారా తమ ప్రొఫైల్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియలో సీబీఎస్ఈ రిజిస్ట్రేషన్ ఐడీ ఆప్షన్'ను వీరు ఖాళీగా వదిలేయాలి. నమోదు ప్రక్రియ పూర్తియ్యాక వీరు నేరుగా కోర్సును యాక్సెస్ చేయవచ్చు.
నియమ నిబంధనలు & సైన్స్ ఛాలెంజ్ వివరాలు
- దీక్ష పోర్టల్ ఉపయోగించేందుకు విద్యార్థులు వ్యక్తిగత కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ కలిగివుండాలి.
- దీక్ష అకౌంట్ లేని విద్యార్థులు కొత్తగా తమ ప్రొఫైల్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. వివరాలు అన్ని ఖచ్చితంగా ఉండాలి.
- సైన్స్ ఛాలెంజ్ కోర్సు హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
- దీక్ష ప్రొఫైల్ ద్వారా లాగిన్ అయినా తర్వాత హోమ్ పేజీ యందు కోర్సు లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే కోర్సుకు చెందిన వివిధ మాడ్యూల్స్ కనిపిస్తాయి.
- మొదటి మాడ్యూల్ యందు సైన్స్ ఛాలెంజ్ చెందిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.
- రెండవ మాడ్యూల్ యందు సైన్స్ ఛాలెంజ్ కోర్సు మరియు వివిధ టాస్కులు ఉంటాయి.
- సైన్స్ ఛాలెంజ్ కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు దీక్ష పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందిస్తుంది.