ఢిల్లీ కానిస్టేబుల్ డ్రైవర్ నోటిఫికేషన్ 2022 – మొత్తం పోస్టులు 1411
Latest Jobs SSC

ఢిల్లీ కానిస్టేబుల్ డ్రైవర్ నోటిఫికేషన్ 2022 – మొత్తం పోస్టులు 1411

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సి), ఢిల్లీ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ - డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10 అర్హుతతో భర్తీ చేసే ఈ పోస్టులకు 29 జులై 2022 లోపు దరఖాస్తు చేసుకోండి. ఈ నియామక ప్రకటన ద్వారా మొత్తం 1411 కానిస్టేబుల్ (డ్రైవర్) భర్తీ చేస్తున్నారు. ఎంపిక అభ్యర్థులకు 21700/- నుండి గరిష్టంగా 69100/- (పే లెవెల్ 3)ల జీతం అందిస్తారు.

ఢిల్లీ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ - పోస్టుల ఖాళీలు

Category Open Ex-S Total 
Gen/UR 543 61 604
EWS 128 14 142
OBC 318 35 353
SC 236 26 262
ST 45 05 50
Total 1270 141 1411

ఎస్ఎస్‌సి ఢిల్లీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 08 జులై 2022
దరఖాస్తు తుది గడువు 29 జులై 2022
అడ్మిట్ కార్డు అక్టోబర్ 2022
ఎస్ఎస్‌సి ఢిల్లీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 2022
ఎస్ఎస్‌సి ఢిల్లీ కానిస్టేబుల్ ఫలితాలు నవంబర్/డిసెంబర్ 2022

ఎస్ఎస్‌సి ఢిల్లీ కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులయి ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు 21 నుండి గరిష్టంగా 30 ఏళ్ళు మించకూడదు.
  • వివిధ రిజర్వేషన్ కోటా అభ్యర్థులకు కనిష్టంగా 3 ఏళ్ళ నుండి గరిష్టంగా 45 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది.
  • అభ్యర్థులు బౌతికంగా & మానసికంగా ఆరోగ్యాంగా ఉండాలి.
  • అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.

ఎస్ఎస్‌సి ఢిల్లీ కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ

ఎస్ఎస్‌సి ఢిల్లీ కానిస్టేబుల్ పోస్టులకు అర్హుత ఉన్న అభ్యర్థులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ యందు పొందిపర్చిన విదంగా కమిషన్ అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి.

దరఖాస్తు యందు సమర్పించే పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పోస్టు ఎంపిక, పరీక్ష కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి.

అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.

ఎస్ఎస్‌సి ఢిల్లీ కానిస్టేబుల్ దరఖాస్తు ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు

  • జనరల్ కేటగిరి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100/- నిర్ణహించారు.
  • ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ కేటగిరి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు కల్పించారు.
తెలుగు రాష్ట్రాలలో అందుబాటులో ఉండే పరీక్షా కేంద్రాలు
ఎగ్జామ్ సెంటర్ SSC రీజనల్ కేంద్రం సమాచారం (సౌత్ రీజియన్)
చీరాల, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం,
హైదరాబాద్, వరంగల్. కరీంనగర్
Regional Director (SR), Staff Selection Commission, 2 nd Floor, EVK Sampath Building, DPI Campus, College Road, Chennai, Tamil Nadu-600006 (www.sscsr.gov.in)

ఎస్ఎస్‌సి ఢిల్లీ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ

ఎస్ఎస్‌సి ఢిల్లీ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ మొత్తం నాలుగు దశలలో నిర్వహిస్తారు. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికి రెండవ దశలో శారీరక దారుఢ్య మరియు కొలత పరీక్షను నిర్వహిస్తారు. మూడవ దశలో ట్రేడ్ టెస్ట్ (డ్రైవింగ్) నిర్వహిస్తారు. చివరిగా మెడికల్ పరీక్షలు జరిపి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష 90 నిముషాల నిడివితో ఉంటుంది. ప్రశ్నలు నాలుగు పార్టులుగా జనరల్ అవెర్నెస్, జనరల్ ఇంటిలిజెన్స్, న్యూమరికాల్ ఎబిలిటీ మరియు డ్రైవింగ్ ట్రేడ్ సంబంధించి ఉంటాయి. ప్రశ్నలు పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. సరైన ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానాలకు 0.25 మార్కులు తొలగిస్తారు.

పార్ట్ సిలబస్ ప్రశ్నలు /మార్కులు సమయం & మార్కులు 
పార్ట్ A జనరల్ అవెర్నెస్ 20/20 1.30 గంటలు

100 మార్కులు

పార్ట్ B జనరల్ ఇంటిలిజెన్స్ 20/20
పార్ట్ C న్యూమరికాల్ ఎబిలిటీ 10/10
పార్ట్ D రోడ్ సెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ నియమాలు/ సిగ్నల్స్  & పర్యావరణ కాలుష్యం, పెట్రోల్ మరియు డీజిల్ వాహనం, సీఎన్జీ నడిచే వాహనం, శబ్ద కాలుష్యం 50/50

ఫీజికల్ ఎండ్యూరెన్సు & ఫీజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PE & MT)

Ssc Conastable

Physical Measurement Test
Category of candidates Height (in cm) Chest (in cm)
Unexpanded Expanded
For male candidates only (UR) 170 81 85

డ్రైవింగ్ ట్రేడ్ టెస్ట్

ఫీజికల్ ఎండ్యూరెన్సు & ఫీజికల్ మెజర్మెంట్ టెస్ట్ యందు అర్హుత పొందిన అభ్యర్థులకు మూడవ దశలో డ్రైవింగ్ ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. డ్రైవింగ్ ట్రేడ్ టెస్టుకు హాజరయ్యే వారు చెల్లిబాటు అయ్యే హెవీ వెహికల్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని అభ్యర్థులకు ఈ టెస్టుకు హాజరయ్యేందుకు అనుమతి ఉండదు.

Driving trade test

మెడికల్ టెస్ట్

డ్రైవింగ్ ట్రేడ్ టెస్ట్ యందు అర్హుత పొందిన అభ్యర్థులకు చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు అభ్యర్థుల కంటి చూపు, మోకాలి సమస్యలు మరియు ఇతర వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు గురించి వాకబు చేస్తారు.

అభ్యర్థుల కంటి చూపు సమీప దృష్టి N6 (ఆరోగ్యవంతమైన కన్ను) , N9 (సమస్య ఉన్న కన్ను) ఉండాలి. అభ్యర్థుల మినిమం డిస్టెన్స్ విజన్ 6/6 (ఆరోగ్యవంతమైన కన్ను) , 6/12 (సమస్య ఉన్న కన్ను) ఉండాలి. అభ్యర్థులకు మోకాలి సమస్యలు, ఫ్లాట్ ఫుట్, కళ్ళల్లో స్క్యింట్ సమస్య ఉండకూడదు. అభ్యర్థులు భౌతికంగా మానసికంగా ఆరోగ్యాంగా ఉండాలి. పై అన్ని దశలను పూర్తి చేసిన అభ్యర్థులకు వివిధ సామజిక రిజర్వేషన్ కోటా పరిధిలో షార్ట్ లిస్టు రూపొందించి తుది ఎంపికను పూర్తి చేస్తారు.

Post Comment