బీఆర్‌ఏఓయూ ఎంబీఏ ప్రోగ్రామ్స్ – డిస్టెన్స్ ఎడ్యుకేషన్
Distance Education

బీఆర్‌ఏఓయూ ఎంబీఏ ప్రోగ్రామ్స్ – డిస్టెన్స్ ఎడ్యుకేషన్

బీఆర్‌ఏఓయూ దూరవిద్య ద్వారా బిజినెస్ మానేజ్మెంట్ మరియు హాస్పిటల్ & హెల్త్ కేర్ మానేజ్మెంట్ విభాగాల్లో మానేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది. ఎంబీఏ ప్రోగ్రాం కనిష్టంగా రెండేళ్ల నిడివితో, గరిష్టంగా నాలుగేళ్ళ లోపు  పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అస్తక్తి

ఎంబీఏ అడ్మిషన్లు ఏపీ మరియు తెలంగాణ ఐసెట్ పరీక్ష మెరిట్ ద్వారా భర్తీ చేస్తారు. హాస్పిటల్ & హెల్త్ కేర్ మానేజ్మెంట్ అడ్మిషన్ కోసం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జులై/ఆగష్టు నెలలలో విడుదల చేస్తారు.

మాస్టర్ డిగ్రీ ఇన్ బిజినెస్ మానేజ్మెంట్ (ఎంబీఏ)
ఎలిజిబిలిటీ బ్యాచిలర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 20,150/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్

ఎంబీఏ హాస్పిటల్ & హెల్త్ కేర్ మానేజ్మెంట్ కోర్సును అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్, కిమ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మరియు డిపార్టుమెంట్ ఆఫ్ హాస్పిటల్ మానేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతుంది. ఒక్కో ఇనిస్టిట్యూట్ యందు 78 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

ఎంబీఏ హాస్పిటల్ & హెల్త్ కేర్ మానేజ్మెంట్ కోర్సు థియరీ, ప్రాక్టీకల్ మరియు ఇంటెర్షిప్ విధానంలో నిర్వహిస్తారు. కోర్సు మొత్తం 8 సెమిస్టర్లుగా విభజించి, ప్రతి 6 నెలలకు ఒకసారి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మధ్యలో హాస్పిటల్ ఇంటెర్షిప్, ప్రాజెక్ట్ వర్కును అభ్యర్థులు పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఎంబీఏ - హాస్పిటల్  & హెల్త్ కేర్ మానేజ్మెంట్
ఎలిజిబిలిటీ మాస్టర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 1,25,000/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్

The Director, Apollo Institute of Health Care Management (AIHCM), Apollo Health
City Campus, Jubilee Hills, Hyderabad – 500096 (Ph. Nos. 040 – 23556850 / 23543269
/ + 91 9441885258)

The Principal, KIMS Institute of Management, KIMS Hospitals, Minister Rd,
Secunderabad – 500003 (Ph. Nos. 040 – 71225255/ 5704 /
+ 91 9848277591)

The Principal, Department of Hospital Management, Dar-Us-Salam Educational Trust,
Deccan College of Medical Sciences, P.O. Kanchanbagh, DMRL 'X' Road, Santhosh
Nagar, Hyderabad – 500058 (Ph. Nos. 040-24802632/ +91 9704009232)

Post Comment