12 Tenses in Telugu with examples | తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్
Spoken English

12 Tenses in Telugu with examples | తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్

12 బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ టెన్సెస్ యొక్క నిర్వచనం, వాటిని ఎప్పుడు ఉపయోగించాలి మరియు సంబంధిత ఉదాహరణలను తెలుసుకోండి. కొత్త భాష నేర్చుకునే ప్రక్రియలో, రెండు అంశాలు మనల్ని ఎక్కువ ఇబ్బంది పెడతాయి. అందులో ఒకటి vocabulary (పదజాలం) అయితే, ఇంకోటి టెన్సెస్ (కాలాలు). ఈ రెండు అంశాలు యెంత గొప్పగా నేర్చుకుంటే, భాష అంత గొప్పగా అలవడుతుంది.

Advertisement

Tense అంటే తెలుగులో కాలం అని అర్ధం. టెన్సెస్ మనం మాట్లాడే కాలం గురించి పని జరిగే కాలం గురించి తెలియజేస్తాయి. మనకు తెలుగులో  వర్తమాన, భూత మరియు భవిష్యత్ కాలాలు ఉన్నట్లు, ఇంగ్లీషు భాషలో కూడా మూడు కాలాలు ఉన్నాయి. అవి,

12 బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ టెన్సెస్

నిర్దిష్ట సమయ సందర్భంను అనుచరించి ఈ మూడు కాలాలలో తిరిగి ఒక్కోదాన్ని నాలుగు కాలాలుగా విభజించారు. అంటే ఇంగ్లీష్ భాషలో మొత్తం 12 రకాల కాలాలు ఉన్నాయి. ఈ విభజన తెలుగు భాషలో ఉండదు. కానీ ఇంగ్లీష్ భాషలో ఉంటుంది. అవి

  1. Simple Tense (indefinite tense)
  2. Continuous Tense
  3. Perfect Tense
  4. Perfect Continuous Tense

1. Present Tense in Telugu

The present tense is a verb tense used to describe a current activity or state of being. However, somewhat unusually, the present tense can also be used to describe past and future activities.

వర్తమాన కాలంలో జరిగే పనులు లేదా స్థితి గురించి తెలిపేందుకు Present Tense ఉపయోగిస్తాం. పని జరిగిన సంధర్భంను అనుచరించి దీన్ని తిరిగి నాలుగు tenses గా విభజించారు.

  1. Simple Present Tense
  2. Present Continuous Tense
  3. Present Perfect Tense
  4. Present Perfect Continuous

2. Past Tense in Telugu

The past tense is a verb tense used for a past activity or a past state of being. For example.
Ex : I jumped in the well (This is a past activity), I was sad (This is a past state of being)

గతంలో జరిగిన చర్యను లేదా అంతకుముందు ఉన్న స్థితిని వ్యక్తపరిచే కాలంను Past Tense అంటారు. తెలుగులో దీన్ని భూత కాలం అంటారు. భూత కాలంలో వివిధ సమయ అంశాల యందు జరిగే పనుల ఆధారంగా Past Tense నీ తిరిగి నాలుగు కాలాలుగా విభజించారు. అవి..

  1. Simple past Tense
  2. Past continuous Tense
  3. Past perfect Tense
  4. Past perfect Continuous Tense

3. Future Tense in Telugu

The future tense is a verb tense used for a future activity or a future state of being.
భవిష్యత్ కాలంలో జరిగే పనులు లేదా స్థితి గురించి తెలిపేందుకు Future Tense ఉపయోగిస్తాం. ఈ కాలంలో ఉండే వివిధ Aspects అనుచరించి దీన్ని తిరిగి నాలుగు tenses గా విభజించారు.

  1. Simple future Tense
  2. Future continuous Tense
  3. Future perfect Tense
  4. Future perfect Continuous Tense

నాలుగు కాలాల వారీగా వాఖ్య నిర్మాణం

1. Simple Tense in Telugu

ఒక కాలానికి సంబంధించి నిర్దిష్ట సమయం తెలపకుండా మాట్లాడే కాలాన్ని Simple లేదా Indefinite Tense అంటారు. అది వర్తమాన కాలం అయితే simple present tense అని, భూతకాలం అయితే simple past tense అని, భవిష్యత్ లో జరిగితే simple feture tense అని అంటారు.simple tense

2. Continuous Tense in Telugu

మాట్లాడే సంధర్భంలో లేదా పలానా నిర్దిష్ట సమయంలో జరుగుతున్న పనుల గురించి తెలిపే కాలాన్ని Continuous Tense అంటారు. పని జరిగే కాలాన్ని బట్టి దీన్ని present Continuous Tense, past Continuous Tense మరియు future Continuous Tense గా చెప్పుకుంటాం.continuous tense

3. Perfect Tense in Telugu

తాజాగా పూర్తియైన (Recent Past  actions) లేదా గతంలో నిర్దిష్ట సమయానికి పూర్తియిన పనుల గురించే మాట్లాడే కాలాన్ని perfect tense అంటారు. ఇది కూడా, మాటలే కాలాన్ని బట్టి present perfect tense, past perfect tense, future perfect tense గా చెప్పుకుంటాం.Perfect Tense

4. Perfect Continuous Tense in Telugu

ఇదివరకే మొదలై, ప్రస్తుత సమయానికి కూడా కొనసాగుతున్న లేదా పలానా సమయం నుండి పలానా సమయం వరకు "జరుగుతున్న" లేదా "జరిగిన" లేదా "జరిగే" పనుల గురించి మాట్లాడే కాలాన్ని Perfect Continuous Tense అంటారు. పని జరిగే కాలాన్ని బట్టి దీన్ని present perfect continuous, past perfect continuous మరియు future perfect continuous Tense గా చెప్పుకుంటాం.perfect continuous tense

క్రియా రూపాల మార్పు గమనించండి

Tenses నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా మూడు అంశాల యందు మనం దృష్టి సారించాలి. అందులో మొదటిది subject (కర్త), రెండవది Adverb (సహాయక క్రియ) ఇక చివరిది Verb Form (క్రియా రూపం). మనం ముందుగా చెప్పినట్లు, ఇంగ్లీష్ భాష యందు ఉన్న 12 కాలాలలో, Verb రూపం ఏ విధంగా మారుతుంతో గమనించాలి. అలానే సబ్జెక్టు మరియు కాలాన్ని అనుచరించి ఎటువంటి సహాయక క్రియను ఉపయోగించాలో తెలుసుకుని తీరాలి. ప్రధానంగా ఏ క్రింది 5 నియమాలు గుర్తుపెట్టుకోండి.

  • మనకు ఇంగ్లీషులో 12 కాలాలు ఉన్నప్పటికీ, మనం మూడు రకాల క్రియా రూపాలను మాత్రమే ఉపయోగిస్తాం. అవి V1 (Base Form), V2 (Past Simple), V3 (Past Participle).
  • V1 (Base Form) కేవలం Present simple tense & Future simple tense లో మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం.
  • V1 (Base Form) + ing ను కాలంతో సంబంధం లేకుండా continuous & perfect continuous Tense లో మాట్లాడేటప్పుడు  ఉపయోగించాలి.
  • V2 (Past Simple) కేవలం Past simple tense లో మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం.
  • V3 (Past Participle) ని కాలంతో సంబంధం లేకుండా Perfect Tense వచ్చే ప్రతీ సందర్భంలో ఉపయోగించాలి.

Advertisement

One Comment

Post Comment