10వ తరగతి తర్వాత ఐటీఐ కోర్సులు మరియు ఉపాధి అవకాశాలు
Career Guidance Career Options

10వ తరగతి తర్వాత ఐటీఐ కోర్సులు మరియు ఉపాధి అవకాశాలు

10వ తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాల్లో ఐటీఐ కోర్సులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. టెన్త్ పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ తర్వాత ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తారు. దీనికి గల ప్రధానమైన కారణాలలో ఒకటి కోర్సుల నిడివి తక్కువ ఉండటం అయితే, మరొకటి త్వరగా వృత్తి జీవితంలో స్థిరపడే అవకాశం ఉండటం.

Advertisement

ఉత్తమ ఐటీఐ కోర్సులు

ఐటీఐ అనగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అని అర్ధం. ఐటీఐ కోర్సులను ట్రేడ్స్ అంటారు. టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ కేటగిరీలలో ఉండే ఈ ట్రేడ్లను ఉన్నత విద్య చదివే అవకాశం లేని మద్య తరగతి, గ్రామీణ నిరుపేద విద్యార్థులు ఎంపిక చేసుకోవడం వలన త్వరగా స్థిరపడే అవకాశం లభిస్తుంది.

ఐటీఐ కోర్సులు స్వయం ఉపాధికి కేర్ ఆఫ్ అడ్రసుగా చెప్పొచ్చు. కేవలం 6 నెలల నుండి రెండేళ్ల లోపు నిడివి ఉండే ఈ కోర్సులను పూర్తి చేయడం ద్వారా సంబంధిత పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలను దక్కించుకోవచ్చు లేదా స్వయం ఉపాధి మార్గాన్ని అనుచరించ వచ్చు.

పరిశ్రమకు అవసరమైన మానవ వనరుల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) క్రాఫ్ట్ మ్యాన్ ట్రైనింగ్ స్కీం ద్వారా 1950 లో ఐటీఐలను స్థాపించింది. నిరుద్యోగాన్ని తగ్గిస్తూ, మానవ వనరుల నైపుణ్యాలను మెరుగుపర్చే లక్ష్యంతో అన్ని ప్రభుత్వాలు పనిచేయటంతో వీటికి గిరాకీ పెరిగింది. ఐటీఐ ట్రైనీలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రోత్సాకాలు అందిస్తున్నాయి.

విద్యార్థుల ఆసక్తి, అభిరుచి మరియు దేశీయ పరిశ్రమల అవసరం మేరకు దేశ వ్యాప్తంగా 150 కి పైగా ఐటీఐ ట్రేడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల ఐటీఐలు 50 కి పైగా ట్రేడ్స్ విద్యార్థులకు ఆఫర్ చేస్తున్నాయి. వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యందు 450 ఐటీఐలు, తెలంగాణాలో 280కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు అందుబాటులో ఉన్నాయి.

ఐటీఐ కోర్సుల స్వరూపం & అడ్మిషన్లు

ట్రేడ్స్'గా పిలుచుకునే ఐటీఐ ట్రైనింగ్ కోర్సుల కనీస నిడివి ఆరు నెలల నుండి రెండేళ్ల మధ్య ఉంటుంది. ట్రేడ్స్ కేటగిరి అనుచరించి కనీస విద్య అర్హుత 8వ తరగతి నుండి ఇంటర్ లేదా అంతకు మించిన అర్హుత ఉండే అభ్యర్థులు ప్రవేశాలు పొందొచ్చు. ఇండస్ట్రీ అవసరాల దృష్ట్యా దాదాపు 50+ ట్రేడ్స్ మన తెలుగు రాష్ట్రాలలో  అందుబాటులో ఉన్నాయి.

ఏడాది లేదా అంతకి మించే నిడివి ఉండే కోర్సులను సెమిస్టరు పద్దతిలో నిర్వహిస్తారు. ఐటీఐ కోర్సులు వర్క్‌షాప్ సంబంధిత ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. కోర్సుల బోధన అకాడమిక్ మరియు ట్రైనింగ్ పద్దతిలో ఉంటుంది. టైనింగ్ పూర్తిచేసుకున్న ట్రైనీలకు చివరిలో ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (AITT) నిర్వహిస్తారు,  ఇందులో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC) ని అందజేస్తారు.

నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ పొందిన ట్రైనీలకు ఏడాది నిడివితో వివిధ ఇండస్ట్రీలలో అప్రెంటిస్‌గా చేసే అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో ప్రతి నెల స్టైపండ్ కూడా అందజేస్తారు. అప్రెంటిస్‌షిప్ పూర్తిచేసిన వారు అదే ప్రరిశ్రమలలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఇతర ఉద్యోగ, ఉపాధి మరియు ఉన్నత విద్య అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు.

ఐటీఐ ప్రవేశాలు రాష్ట్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ పరిధిలో నిర్వహిస్తారు. అడ్మిషన్ నోటిఫికేషన్ స్థానిక వార్త పత్రికల ద్వారా విడుదల చేస్తారు. అలానే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ పోర్టల్ యందు కూడా అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అదే పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశాలు అకాడమిక్ మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు.

ఐటీఐ టెక్నికల్ ట్రేడ్స్ లిస్ట్

ఐటీఐ ఇంజనీరింగ్ సంబంధిత ట్రేడులను టెక్నికల్ ట్రేడులుగా పరిగణిస్తారు. నాన్ ఇంజనీరింగ్ ట్రేడులను నాన్ టెక్నికల్ ఐటీఐ ట్రేడులుగా పరిగణిస్తారు. టెక్నికల్ ట్రేడులు ఎక్కువ ఉద్యోగ అవకాశాలను అందిస్తే, నాన్ టెక్నికల్ ట్రేడులు ఎక్కువ స్వయం ఉపాధి అవకాశాలకు అనువుగా ఉంటాయి. ట్రేడ్స్ అన్ని నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్ ( NSQF ) ఆధారితంగా నిర్వహించబడతాయి.

Trade Name Trade Type Qualification Duration
Carpenter (NSQF) Engineering 8th Passed 1 Year
Draughtsman (Civil) Engineering 10th Passed 2 Years
Draughtsman (Mechanical) Engineering 10th Passed 2 Years
Electrician Engineering 10th Passed 2 Years
Electronics Mechanic Engineering 10th Passed 2 Years
Fitter Engineering 10th Passed 2 Years
Foundryman Engineering 10th Passed 1 Year
Instrument Mechanic Engineering 10th Passed 2 Years
Laboratory Assistant Engineering 10th Passed 2 Years
Machinist Engineering 10th Passed 2 Years
Mechanic (Motor Vehicle) Engineering 10th Passed 2 Years
Plastic Processing Operator Engineering 10th Passed 1 Year
Plumber Engineering 8th Passed 1 Year
Refrigeration and Ac Technician Engineering 10th Passed 2 Years
Sheet Metal Worker Engineering 8th Passed 1 Year
Turner Engineering 10th Passed 2 Years
Welder Engineering 8th Passed 1 Year
Wireman Engineering 8th Passed 2 Years
Mechanic Auto Body Painting Engineering 10th Passed 1 Year
Mechanic Auto Body Repair Engineering 10th Passed 1 Year
Mechanic Diesel Engineering 10th Passed 1 Year

ఐటీఐ నాన్ టెక్నికల్ ట్రేడ్స్ లిస్ట్

Trade Name Trade Type Qualification Duration
Computer Operator and Programming Assistant Non Engineering 10th Passed 1 Year
Dress Making Non Engineering 8th Passed 1 Year
Driver Cum Mechanic Non Engineering 8th Passed 6 Months
Health Sanitary Inspector Non Engineering 10th Passed 1 Year
Sewing Technology Non Engineering 8th Passed 1 Year
Stenographer & Secretarial Assistant Non Engineering 10th Passed 1 Year

ఐటీఐ ఉపాధి అవకాశాలు

ఐటీఐల ప్రధాన కర్తవ్యం పారిశ్రామిక అవసరాలకు సరితూగే మానవ వనరులను తీర్చిదిద్దడం. దీని అర్ధం ఐటీఐ ట్రైనీల ఉపాధి అవకాశాలు పరిశ్రమలు, ఉత్పాదక, తయారీ సంస్థలలో ఉంటాయి. ఇందులో ప్రధానంగా రైల్వేలు, కేంద్రస్థాయి సంస్థలు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో వీరికి పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలు లభ్యమౌతాయి.

పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో టెక్నికల్ అసిస్టెంట్లకు సంబంధించి మెజారిటీ ఉద్యోగాలు ఐటీఐ అభ్యర్థుల ద్వారా భర్తీ చేస్తారు. అలానే భారతీయ రైల్వే భర్తీ చేసే అసిస్టెంట్ లోకో పైలట్, ఎలెక్ట్రిషియన్, మెకానిక్, ఫిట్టర్, టర్నర్, వైర్ మాన్ వంటి వేల కొలది పోస్టులకు ఐటీఐ టెక్నికల్ అభ్యర్థులు అర్హులు. ఈ పోస్టుల భర్తీలో వీరికి ప్రాధాన్యత ఉంటుంది.

డిఫెన్సె రంగంలో త్రివిదలలో భర్తీ చేసే టెక్నికల్, మెకానికల్ ఉద్యోగాలకు వీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ నేవీలో వీరి కోసమే ప్రత్యేక పోస్టులు కేటాయించబడి ఉటాయి. అదే విధంగా ఫార్మా ఇండస్ట్రీ, స్టీల్ ప్లాంట్, నేవల్ డాక్ యార్డ్, పోర్టులు, నౌకలు, ప్రజారవాణా రవాణా సంస్థలు ఇంకా చెప్పాలంటే యంత్రాలతో నడిచే అన్ని పరిశ్రమలలో వీరికి ఉపాధి అవకాశాలు ఉంటాయి.

విదేశాల్లో భారత ఐటీఐ ట్రైనీలకు మంచి డిమాండ్ ఉంది. వీటికి సంబంధించి తెలుగు రాష్ట్రాలలో ఓవర్సీస్  మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్, ఓవర్సీస్  మ్యాన్ పవర్ కంపెనీ తెలంగాణ లిమిటెడ్లు విదేశీ ఉద్యోగాలకు దారి చూపుతున్నాయి. ఇవి ఐటీఐ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ అందించి సర్టిఫికేట్లు మంజూరు చేస్తున్నాయి. వీటిని పొందిన వారు కేంద్రంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా విదేశీ ఉద్యోగాల కోసం ప్రయాణించవచ్చు. సౌదీ అరేబియా, సింగపూర్, మలేసియా వంటి దేశాలలో వీరికి మంచి అవకాశాలు ఉంటాయి.

ప్లంబర్, కార్పెంటర్, ఎలెక్ట్రిషియన్, ఫ్రీజ్ & ఏసీ మెకానిక్, డ్రైవింగ్, ఆటోమొబైల్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, డ్రెస్ మేకింగ్ వంటి ట్రేడ్స్ ద్వారా స్వయం ఉపాధిని పొందొచ్చు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆయా రంగాల్లో ఉపాధిని పొందొచ్చు, మరో పది మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పించొచ్చు.

ఐటీఐ తర్వాత ఉన్నత విద్య అవకాశాలు

ఐటీఐ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య వైపు వెళ్ళాలి అనుకునే వారికి ఎన్నో ఉన్నత విద్య అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఐటీఐ తర్వాత ఉన్నత విద్యలో భాగంగా డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని డిప్లొమా కోర్సులలో లాటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా రెండవ ఏడాదిలో చేరే సౌలభ్యం కూడా ఉంటుంది.

డిప్లొమా పూర్తియ్యాక ఈసెట్ ద్వారా బీటెక్ ఇంజనీరింగ్ కోర్సుల యందు ప్రవేశం పొందొచ్చు. అదే విధంగా జనరల్ డిగ్రీ కోర్సులు కూడా చేయొచ్చు. అలానే నాన్ టెక్నికల్ ఐటీఐ అభ్యర్థులు ఐటీఐ తరువాత బీఏ వంటి బ్యాచిలర్ డిగ్రీల యందు చేరొచ్చు. అదే విధంగా కరస్పాండెన్స్ ద్వారా ఇతర ఓపెన్ డిగ్రీలను కూడా పొందొచ్చు.

ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ పథకాలు

ఐటీఐ విద్యార్థులకు ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో నైపుణ్య అభివృద్ధి పథకాలను అందిస్తున్నాయి. వీటి ద్వారా విద్యార్థులు విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింతా మెరుగుపర్చుకోవచ్చు అలానే వీటి ద్వారా అందించే ఆర్థిక సాయంతో స్వయం ఉపాధిని పొందొచ్చు లేదా చిన్నస్థాయి వ్యవస్థాపకులుగా మారొచ్చు.

Advertisement

Post Comment