Advertisement
యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ | ఐఈఎస్ ప్రిలిమినరీ 2022
Latest Jobs UPSC

యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ | ఐఈఎస్ ప్రిలిమినరీ 2022

కేంద్రప్రభుత్వ ఇంజనీరింగ్ సర్వీసెస్ నియామకాలకు సంబంధించి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ 2022 ను యూపీఎస్‌సి విడుదల చేసింది. తాజా నియామక ప్రకటన ద్వారా దాదాపు 327 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానంలో ఉంటుంది. ఈ నియామక పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెల్సుకుందాం.

నోటిఫికేషన్ నెంబర్ 01/2023-ENGG
పోస్టుల సంఖ్యా 327
దరఖాస్తు ప్రారంభ తేదీ 14.09.2022
దరఖాస్తు తుది గడువు 04.10.2022
పరీక్షా ఫీజు 200/-
పరీక్షా తేదీ 19/02/2023

ఐఈఎస్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు

యూపీఎస్సి నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా నాలుగు కేటగిరీలలో దాదాపు 40 రకాల గ్రూపు ఏ, గ్రూపు బి ఇంజనీరింగ్ అధికారులను నియమిస్తారు.

ఐఈఎస్ సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు (గ్రూపు ఏ & బి)
ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ ఎఈఈ సివిల్ (బోర్డర్ రోడ్డు ఇంజనీరింగ్ సర్వీస్)
ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (సివిల్ ఇంజనీరింగ్) ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్
సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎఈఈ (QS & C) ఇన్ ఏంఈఎస్ సర్వేయర్ క్యాడర్
సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్  (రోడ్డులు) గ్రూపు ఏ సెంట్రల్ వాటర్ సర్వీస్ ఇంజనీరింగ్ గ్రూపు ఏ
సర్వే ఆఫ్ ఇండియా గ్రూపు ఏ సర్వీస్ ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్ (సివిల్ & మెకానికల్ )
ఐఈఎస్ మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు (గ్రూపు ఏ & బి)
ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ అసిస్టెంట్ నావెల్ స్టోర్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ఇండియన్ నేవీ
ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (మెకానికల్ ఇంజనీరింగ్) ఏఈఈ ఇన్ బోర్డర్ రోడ్డు ఇంజనీరింగ్ సర్వీస్ (మెకానికల్)
ఏఈఈ ఇన్ జిఎస్ఐ ఇంజనీరింగ్ సర్వీస్ గ్రూపు ఏ సెంట్రల్ వాటర్ సర్వీస్ ఇంజనీరింగ్ గ్రూపు ఏ
ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్ గ్రూపు ఏ
ఇండియన్ నావెల్ ఆర్మమెంట్ సర్వీస్ (మెకానికల్ ఇంజనీర్స్) సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్ గ్రూపు బి
ఐఈఎస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు (గ్రూపు ఏ & బి)
ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్ గ్రూపు బి
ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్
ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్సురెన్సు సర్వీస్
అసిస్టెంట్ నావెల్ స్టోర్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ఇండియన్ నేవీ సెంట్రల్ ఎలక్ట్రికల్ & మెకానికల్ ఇంజనీరింగ్ సర్వీస్
సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్ గ్రూపు ఏ
ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పోస్టులు (గ్రూపు ఏ & బి)
ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్ గ్రూపు ఏ
ఇండియా రేడియో రెగ్యూలేటరీ సర్వీస్ గ్రూపు ఏ సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్ గ్రూపు బి
ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ గ్రూపు ఏ ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్
ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (టెలి & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్) అసిస్టెంట్ నావెల్ స్టోర్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ఇండియన్ నేవీ
ఇండియన్ నావెల్ ఆర్మమెంట్ సర్వీస్ జూనియర్ టెలికమ్యూనికేషన్ ఆఫీసర్ గ్రూపు బి

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రభుత్వరంగ ఇంజనీరింగ్ విభాగాలలో  గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇంజనీరింగ్ అధికారులను నియమించేందుకు నిర్వహించబడుతుంది. మూడు ఫేజ్ లలో జరిగే ఈ జాతీయస్థాయి ఇంజనీరింగ్ పోటీపరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది.

ఈ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులు రైల్వే, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, రోడ్స్, సప్లయ్, ఇన్స్పెక్షన్, పవర్, టెలికమ్యూనికేషన్, పబ్లిక్ వర్క్స్ వంటి ప్రభుత్వరంగ విభాగాలలో సాంకేతిక, కార్యనిర్వాహక అధికారులుగా విధులు నిర్వర్తిస్తారు. యూపీఎస్సీ ఎంపిక చేసిన గ్రూపు ఏ ఇంజనీరింగ్ అధికారులను రాష్ట్రపతి అపాయంట్ చేస్తారు. గ్రూపు బి కేడర్ అధికారులు సంబంధిత డిపార్టుమెంట్ సీనియర్ అధికారులచే అపాయంట్ చేయబడతారు.

ఐఈఎస్ ఎలిజిబిలిటీ

  • జాతీయత: అభ్యర్థులు ఇండియా లేదా నేపాల్, భూటాన్ పౌరులయి ఉండాలి
  • 1962కు ముందు భారతదేశంకు వలస వచ్చిన టిబెటన్ అభ్యర్థులు కూడా అర్హులు.
  • విద్య అర్హుత: ఎఐసిటిఇ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉండాలి
  • వయోపరిమితి: దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 21 నుండి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు కేటగిరి వారీగా 3 నుండి 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది.
  • ఫీజికల్ ప్రమాణాలు:  కొన్ని ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టులకు మెడికల్ టెస్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది.
  • అభ్యర్డులు శారీరక ఆరోగ్యంతో పాటుగా ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ లో పొందుపర్చిన భౌతికప్రమాణాలు కలిగివుండాలి.

ఐఈఎస్ దరఖాస్తు ఫీజు

కేటగిరి దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 200/-
ఎస్సి, ఎస్టి, మహిళలు, వికలాంగులు ఎటువంటి ఫీజు లేదు

ఐఈఎస్ దరఖాస్తు ప్రక్రియ

ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షకు పోటీపడే అభ్యర్థులు యుపిఎస్‌సి అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి అభ్యర్థి గరిష్టంగా ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలి. దరఖాస్తు సమయంలో ఖచ్చితమైన వ్యక్తిగత, విద్య వివరాలు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు ద్వారా అందించే తప్పుడు సమాచారంకు పూర్తి బాధ్యత మీరే వహించాలి.

దరఖాస్తు సమయంలో చేసే చిన్న తప్పిదాలు రేపు నియామక సమయంలో అనర్హుతకు దారితీసే అవకాశం ఉంటుంది. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, రిజర్వేషన్ కేటగిరి ఎంపిక, వయోపరిమితి ఎంపిక, పరీక్షా కేందం, ఆప్షనల్ సబ్జెక్టుల నమోదు సమయంలో పలుమార్లు పునఃపరిశీలించండి.

తెలుగు రాష్ట్రాలలో ఎగ్జామ్ సెంటర్లు (ప్రిలిమ్స్ )
హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం
తెలుగు రాష్ట్రాలలో ఎగ్జామ్ సెంటర్లు (మెయిన్స్)
విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) హైదరాబాద్ (తెలంగాణ) చెన్నై (తమిళనాడు)

ఐఈఎస్ ఎగ్జామ్ నమూనా

ఇంజనీరింగ్ ఎగ్జామినేషను యుపిఎస్‌సి మూడు దశల్లో నిర్వహిస్తుంది. మొదటి దశలో ఆబ్జెక్టివ్ పద్దతిలో ప్రిలిమినరీ పరీక్ష జరుపుతారు. రెండవ దశలో డిస్క్రిప్టివ్ పద్దతిలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మూడవ దశలో వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాసేందుకు అర్హుత సాధిస్తారు. మెయిన్స్ లో అర్హుత పొందిన అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ కు ఆహ్వానిస్తారు.

ఐఈఎస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నమూనా

ప్రిలిమ్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండూ పేపర్లు ఆబ్జెక్టివ్ పద్దతిలో 500 (200+300) మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 1 గా జనరల్ స్టడీస్ మరియు ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. పేపర్ 2 లో అభ్యర్థి దరఖాస్తు చేసిన పోస్టు సంబంధిత ఇంజనీరింగ్ అంశాలు ఉంటాయి.

ఎగ్జామినేషన్ టైపు సమయం మార్కులు
స్టేజ్ 1 జనరల్ స్టడీస్ & ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ పేపర్ 1 2 గంటలు 200
ఇంజనీరింగ్ (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్ & టెలికమ్యూనికేషన్ ) పేపర్ 2 3 గంటలు 300

ఐఈఎస్ మెయిన్స్ పరీక్ష నమూనా

మెయిన్స్ పరీక్ష రెండు పేపర్లలో 600 (300+300) మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 1, పేపర్ 2 గా జరిగే ఈ పరీక్ష పూర్తి డిస్క్రిప్టివ్ పద్దతిలో నిర్వహించబడుతుంది. ఒక్కో పేపర్ 3 గంటల కాలవ్యవధితో 300 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్స్ లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు 200 మార్కులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ లో అభ్యర్థి చూపించిన ప్రతిభ ఆధారంగా తుది ఫలితాలు విడుదల చేస్తారు.

ఎగ్జామినేషన్ టైపు సమయం మార్కులు
స్టేజ్ 2 ఇంజనీరింగ్ (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్ & టెలికమ్యూనికేషన్ ) పేపర్ 1 3 గంటలు 300
ఇంజనీరింగ్ (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్ & టెలికమ్యూనికేషన్ ) పేపర్ 2 3 గంటలు 300
స్టేజ్ 3 వ్యక్తిగత ఇంటర్వ్యూ 200 మార్కులు

Post Comment