ఏపీ డీఈఈసెట్ 2023 పరీక్షను ఆంధ్రప్రదేశ్ డైట్ కాలేజీల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.EI.ED) మరియు డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (DPSE) కోర్సులలో ప్రవేశాలు జరిపేందుకు నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఏపీ డిపార్టుమెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తుంది.
Exam Name | AP DEECET 2023 |
Exam Type | Admission |
Admission For | D.EI.ED |
Exam Date | 12 & 13 June 2023 |
Exam Duration | 2.30 Hours |
Exam Level | State Level (AP) |
ఏపీ డీఈఈసెట్ ఎలిజిబిలిటీ
- అభ్యర్థులు భారతీయ పౌరులయి ఉండాలి.
- అభ్యర్థి 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణతాయి ఉండాలి.
- అభ్యర్థి కనీస వయస్సు 17 నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి అవధి లేదు.
- అభ్యర్థి అడ్మిషన్ పొందేందుకు డీఈఈసెట్ కనీస అర్హుత మార్కులు సాదించాలి.
- యూనివర్సిటీ అడ్మిషన్ చట్టంకు అనుగుణంగా లోకల్ లేదా నాన్ లోకల్ నియమాలు సంతృప్తపర్చాలి.
ఏపీ డీఈఈసెట్ 2023 ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం | 11 మే 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 28 మే 2023 |
హాల్ టికెట్ డౌన్లోడ్ | 05 జూన్ 2023 |
ఎగ్జామ్ తేదీ | 12 & 13 జూన్ 2023 |
ఫలితాలు | 19 జూన్ 2023 |
కౌన్సిలింగ్ | జూన్/జులై 2023 |
ఏపీ డీఈఈసెట్ ఎగ్జామ్ ఫీజు
- దరఖాస్తు ఫీజు 750/- రూపాయలు
- పరీక్షా కేంద్రాలు అన్ని పాత జిల్లాల పరిధిలో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు సమయంలో మీకు అందుబాటులో ఉండే జిల్లాను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది
- ఎంపిక చేసుకున్న జిల్లాలో పరీక్షా కేంద్రం గరిష్ట పరిమితి మించితే అభ్యర్థికి దగ్గరలో ఉండే జిల్లాలో కేటాయిస్తారు
ఏపీ డీఈఈసెట్ దరఖాస్తు విధానం
ఏపీ డీఈఈసెట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. డీసెట్ అధికారిక వెబ్సైట్ (www.apdeecet.apcfss.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో విద్యార్థి వ్యక్తిగత, విద్య, చిరునామా వివరాలు పొందుపరచడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రెండవ దశలో ఎగ్జామ్ ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.
దరఖాస్తులో నింపే విద్య, వ్యక్తిగత వివరాలలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక రెండు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.
ఏపీ డీఈఈసెట్ ఎగ్జామ్ నమూనా
ఏపీ డీఈఈసెట్ పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్ష 2 గంటల నిడివితో 100 మార్కులకు జరుగుతుంది. ప్రశ్న పత్రం రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్ A లో 60 ప్రశ్నలు, పార్ట్ B లో 40 ప్రశ్నలు ఇవ్వబడతాయి. పార్ట్ A లో ప్రశ్నలు 6 నుండి 10 తరగతుల సిలబస్ నుండి ఇవ్వబడతాయి.
పార్ట్ B లో ప్రశ్నలు సంబంధిత ఇంటర్మీడియట్ సిలబస్ నుండి ఇవ్వబడతయి. ప్రశ్నలు అన్ని ఆబ్జెక్టివ్ పద్దతిలో ఉంటాయి. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు ఒక మార్కు ఇవ్వబడుతుంది. ఋణాత్మక మార్కులు లేవు.
పార్ట్ A లో టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, తెలుగు, ఆప్షనల్ లాంగ్వేజ్ ఆప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, జనరల్ సైన్స్ సంబంధిత అంశాల నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి. పార్ట్ B లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్టు నుండి 40 ప్రశ్నలు ఇవ్వబడతాయి.
ఏపీ డీఈఈసెట్ పార్ట్ A మోడల్
సిలబస్ | ప్రశ్నలు | క్వశ్చన్ నంబర్స్ | మార్కులు |
---|---|---|---|
టీచింగ్ ఆప్టిట్యూడ్ | 5 | 1-5 | 5 |
జనరల్ నాలెడ్జ్ | 5 | 6-10 | 5 |
ఇంగ్లీష్ | 5 | 11-15 | 5 |
తెలుగు | 5 | 16-20 | 5 |
ఆప్షనల్ లాంగ్వేజ్ ఆప్టిట్యూడ్ | 10 | 21-30 | 10 |
మ్యాథమెటిక్స్ | 10 | 31-40 | 10 |
సోషల్ స్టడీస్ | 10 | 41-50 | 10 |
జనరల్ సైన్స్ | 10 | 51-60 | 10 |
ఏపీ డీఈఈసెట్ పార్ట్ B మోడల్
సిలబస్ | ప్రశ్నలు | క్వశ్చన్ నంబర్స్ | మార్కులు |
---|---|---|---|
మ్యాథమెటిక్స్ | 40 | 61-100 | 40 |
ఫీజికల్ సైన్స్ (ఫీజిక్స్ -20 + కెమిస్ట్రీ-20) | 40 | 61-80 & 81-100 | 40 |
బయోలాజికల్ సైన్స్ (బోటనీ-20 + జువాలజీ -20) | 40 | 61-80 & 81-100 | 40 |
సోషల్ స్టడీస్ | 40 | 61-100 | 40 |
ఏపీ డీఈఈసెట్ అడ్మిషన్ విధానం
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అడ్మిషన్ ఏపీ డీఈఈసెట్ యందు సాధించిన మెరిట్ ఆధారంగా కల్పిస్తారు. డీఈఈసెట్ పార్ట్ A మరియు పార్ట్ B లలో 50 శాతం కనీస మార్కులు సాధించిన అభ్యర్థులను ర్యాంకింగ్ కోసం పరిగణలోకి తీసుకుంటారు.
టెన్త్, ఇంటర్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియా సీట్లు మాత్రమే కేటాయిస్తారు. తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళంలో చదువుకునే వారిని అవకాసం ఆయా భాషల్లో అడ్మిషన్ కల్పిస్తారు.
అందుబాటులో ఉండే సీట్లలో 80% సీట్లు గవర్నమెంట్ డైట్ కాలేజీలలో మరియు అన్ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజీలలో A కేటగిరి క్రింద లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగతా సీట్లు కన్వినర్ కోటా క్రింద ఓపెన్ కేటగిరిలో డీఈఈసెట్ మెరిట్ వారీగా భర్తీచేస్తారు.
డీఈఈసెట్ రిజర్వేషన్ వారీగా సీట్ల కోటా
ప్రతి కోర్సులో అందుబాటులో ఉండే సీట్లలో వివిధ కేటగిర్ల వారీగా సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అందుబాటులో ఉన్న సీట్లలో 85% శాతం సీట్లు ఆంధ్ర ప్రదేశ్ పరిధికి చెందిన అభ్యర్థులకు కేటాయిస్తారు. రేజర్వేషన్ల పరంగా ఎస్సీ అభ్యర్థులకు 15%, ఎస్టీ అభ్యర్థులకు 6%, బీసీ అభ్యర్థులకు 29%, NCC అభ్యర్థులకు 1%, క్రీడాకులకు 0.5% మరియు మహిళకు 33% సీట్లు కేటాయిస్తారు.
ఎస్సీ అభ్యర్థులు | 15% శాతం |
ఎస్టీ అభ్యర్థులు | 8 శాతం |
బీసీ కులాలు | 29 శాతం |
మహిళలు | 33% శాతం |
NCC, Sports | 1 శాతం, 0.5 శాతం |