జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (జిప్‌మర్) లలో ఎండీ, ఎంఎస్ మరియు ఎండీఎస్ మెడికల్ పీజీ కోర్సులలో అడ్మిషన్లు కల్పించేందుకు జిప్‌మర్ పీజీ పరీక్షను నిర్వహిస్తారు.
జిప్‌మర్ దేశంలో ఉన్న ప్రముఖ వైద్య సంస్థలలో ఒకటి. దీన్ని 1956లో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జాతీయ అవసరాల ప్రాతిపదికన స్థాపించారు. ఎయిమ్స్ తర్వాత అంతే పోటీ జిప్‌మర్ ప్రవేశాలకు ఉంటుంది. జిప్‌మర్ ప్రస్తుతం యూజీ, పీజీ, పీజీ డిప్లొమా మరియు సూపర్ స్పెషలిటీ కోర్సులను అందిస్తుంది.
Exam Name | JIPMER PG 2023 |
Exam Type | Entrance Exam |
Admission For | Md, MS & MDS |
Exam Date | N/A |
Exam Duration | 3.00 Hours |
Exam Level | National Level |
జిప్‌మర్ ఆఫర్ చేస్తున్న ఎండీ, ఎంఎస్ & ఎండీఎస్ కోర్సులు
ఎండీ కోర్సులు (3 ఏళ్ళు) | |
---|---|
అనస్థీషియాలజీ (8 సీట్లు) అనాటమీ (2 సీట్లు) బయోకెమిస్ట్రీ (2 సీట్లు) కమ్యూనిటీ మెడిసిన్ (3 సీట్లు) డెర్మటాలజీ, వెనిరాలజీ & లెప్రాలజీ (4 సీట్లు) ఎమర్జెన్సీ మెడిసిన్ (5 సీట్లు) ఫోరెన్సిక్ మెడిసిన్ (2 సీట్లు) జనరల్ మెడిసిన్ (13 సీట్లు) ఇమ్యునో హెమటాలజీ & బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ (1 సీటు) |
మైక్రోబయాలజీ (2 సీట్లు ) న్యూక్లియర్ మెడిసిన్ (3 సీట్లు) పాథాలజీ (4 సీట్లు ) పీడియాట్రిక్స్ (9 సీట్లు) ఫార్మకాలజీ (4 సీట్లు) ఫిజియాలజీ (2 సీట్లు) సైకియాట్రీ (2 సీట్లు) పల్మనరీ మెడిసిన్ (3 సీట్లు) రేడియో డయాగ్నోసిస్ (7 సీట్లు) రేడియేషన్ ఆంకోలాగ్ (5 సీట్లు) |
ఎంఎస్ కోర్సులు (3 ఏళ్ళు) | |
జనరల్ సర్జరీ (11 సీట్లు) ఒబెస్ట్ట్రిక్స్ & గైనకాజీ (11 సీట్లు) ఆప్తాల్మాలజీ (4 సీట్లు) |
ఆర్థోపెడిక్ సర్జరీ (4 సీట్లు) ఓటో-రినో లారింగాలజీ (ENT) (4 సీట్లు) |
ఎండీఎస్ కోర్సులు (3 ఏళ్ళు) | |
ఆర్థోడాంటిక్స్ & డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్ (1 Unreserved seat) | ఓరల్ & మాక్సిల్లోఫేషియల్ సర్జరీ (1 Unreserved seat) |
జిప్‌మర్ పీజీ సెట్ ఎలిజిబిలిటీ
- ఎండీ, ఎంఎస్ కోర్సులకు భారతీయలు, విదేశీ భారతీయులు మరియు విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎండీఎస్ కోర్సుకు భారతీయులు విదేశీ భారతీయులు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు.
- ఎండీ, ఎంఎస్ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఎంబీబీఎస్ తో పాటుగా ఏడాది ఇంటెర్షిప్ పూర్తిచేసి ఉండాలి.
- ఎండీఎస్ కోర్సుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 55 శాతం మార్కులతో బీడీఎస్ పాటుగా ఏడాది ఇంటెర్షిప్ పూర్తిచేసి ఉండాలి.
- ఎండీ, ఎంఎస్ & ఎండీఎస్ పూర్తిచేసిన వారు మరోమారు దరఖాస్తు చేసేందుకు అనర్హులు.
జిప్‌మర్ పీజీ సెట్ 2023 ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం | NA |
దరఖాస్తు గడువు | NA |
ఎగ్జామ్ తేదీ | NA |
ఫలితాలు | NA |
జిప్‌మర్ పీజీ సెట్ రిజిస్ట్రేషన్
జిప్‌మర్ పీజీ పరీక్షకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు జిప్‌మర్ (www.jipmer.edu.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జిప్మెర్ ఎగ్జామ్ బోర్డు నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి.
వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి. అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.
ఎగ్జామ్ ఫీజు & పరీక్ష కేంద్రాలు
దరఖాస్తు ఫీజు | జనరల్ అభ్యర్థులు - 1600/- ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ - 1200/- |
---|---|
ఎగ్జామ్ సెంటర్లు | హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై, భువనేశ్వర్ |
జిప్‌మర్ పీజీ సెట్ ఎగ్జామ్ నమూనా
జిప్‌మర్ పీజీ సెట్ సీబీటీ విధానంలో జరుగుతుంది. ఎండీ, ఎంఎస్ కోర్సుల పరీక్ష వ్యవధి 3 గంటలు. ఎండీఎస్ పరీక్ష నిడివి 1.30 నిముషాలు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఎండీ, ఎంఎస్ ప్రశ్నపత్రంలో మొత్తం 250 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు రెండు భాగాలుగా ఇవ్వబడతాయి.
ఎండీ/ఎంఎస్ పేపర్లలో ఎంబీబీఎస్ లెవెల్ సిలబస్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. ఎండీఎస్ పేపరులో బీడీఎస్ లెవెల్ సిలబస్ సంబంధిత ప్రశ్నలు ఇవ్వబడతయి. ఎండీఎస్ ప్రశ్నపత్రంలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు రెండు భాగాలుగా ఇవ్వబడతాయి. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది.
ఎండీ, ఎంఎస్ ఎగ్జామ్ నమూనా | |||
---|---|---|---|
పేపర్/సిలబస్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
బేసిక్ క్లినికల్ సైన్సెస్ & బయో స్టాట్టిస్టిక్స్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ అండ్ ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ & బయోస్టాటిస్టిక్స్. |
100 ప్రశ్నలు | 100 మార్కులు | 180 నిముషాలు |
క్లినికల్ సైన్సెస్ మెడిసిన్, సర్జరీ, ఒబెస్ట్ట్రిక్స్ మరియు గైనకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, ENT, అనస్థీషియాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, రేడియో-డయాగ్నోసిస్, రేడియేషన్-ఆంకాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, న్యూక్లియర్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్ మరియు ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్. |
150 ప్రశ్నలు | 150 మార్కులు |
ఎండీఎస్ ఎగ్జామ్ నమూనా | |||
---|---|---|---|
పేపర్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
బేసిక్ క్లినికల్ సైన్సెస్ & బయో స్టాట్టిస్టిక్స్ ఎంబ్రియోలజీ మరియు హిస్టాలజీ / జనరల్ హ్యూమన్ ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ / డెంటల్ అనాటమీ, ఎంబ్రియాలజీ & ఓరల్ హిస్టాలజీ / జనరల్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ / జనరల్ అండ్ డెంటల్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ / బయోస్టాటిస్టిక్స్ |
30 ప్రశ్నలు | 30 మార్కులు | 90 నిముషాలు |
డెంటల్ సైన్స్ డెంటల్ మెటీరియల్స్ / ఓరల్ పాథాలజీ అండ్ ఓరల్ మైక్రోబయాలజీ / ఓరల్ మెడిసిన్ మరియు రేడియాలజీ / పెడోడోంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ / ఆర్థోడాంటిక్స్ & డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్ / పీరియాడోంటాలజీ / ప్రోస్టోడోంటిక్స్ మరియు క్రౌన్ & వంతెన / కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ మరియు ఎండోడొంటిక్స్ / ఓరల్ మరియు మాక్సిల్లోఫేషియల్ శస్త్రచికిత్స |
70 ప్రశ్నలు | 70 మార్కులు |
జిప్‌మర్ పీజీ సెట్ రిజర్వేషన్లు & ప్రవేశాలు
జిప్‌మర్ పీజీ సెట్ అడ్మిషన్ ప్రక్రియ జిప్మెర్ పీజీ సెట్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. సీబీటీ పరీక్షలో 50 పెర్సెంటైల్ మార్కులు సాధించిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటిస్తారు. అందుబాటులో ఉండే సీట్లలో 57% శాతం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తారు.
మిగిలిన సీట్లు విదేశీ విద్యార్థులకు ఇతర కేటగిరి విద్యారులకు కేటయిస్తారు. రిజర్వేషన్ పరమైన సీట్ల కేటాయింపు 2006 సంబంధించిన అడ్మిషన్ చట్టం నియమాలకు అనుగుణంగా జరుగుతుంది. వివిధ కేటగిర్లకు సంబందించిన రిజర్వేషన్ కోటా ఈ క్రింది విదంగా ఉంటుంది.
రిజర్వేషన్ కేటగిరి | రిజర్వేషన్ కోటా |
---|---|
ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ |
27% 15% 7.5% 10% 5% |