ఇండియాలో టీచింగ్ ప్రవేశ పరీక్షలు మరియు టీచర్ అర్హుత పరీక్షలు
Admissions Teaching Entrance Exams

ఇండియాలో టీచింగ్ ప్రవేశ పరీక్షలు మరియు టీచర్ అర్హుత పరీక్షలు

ఉపాధ్యాయ విద్యా కోర్సులలో చేరేందుకు, ఉపాధ్యాయ వృత్తిలో చేరేందుకు నిర్వహించే వివిధ టీచింగ్ ఎలిజిబిలిటీ టెస్టులు మరియు టీచింగ్ అడ్మిషన్ టెస్టుల కోసం తెలుసుకోండి.ఈ జాబితాలో యూజీసీ నెట్, సీఎస్ఐఆర్ నెట్, సెట్,సీటెట్, ఏపీ టెట్, టీఎస్ టెట్, ఎడ్ సెట్, డీసెట్ వంటి పరీక్షల కోసం తాజా సమాచారం పొందండి.

యూజీసీ నెట్ ఎగ్జామ్

UGC NET Registration and Exam Dateయూజీసీ నెట్ పరీక్షను భారత విశ్వవిద్యాలయాలు మరియు ప్రభుత్వ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫిసర్షిప్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జెఆర్ఎఫ్) ప్రోగ్రాంలకు అర్హుత కల్పించేందుకు నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష  యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ ఆదేశాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  జరుపుతుంది. ఈ పరీక్ష దాదాపు 100కి పైగా లాంగ్వేజ్ మరియు హ్యుమానిటీస్ సబ్జెక్టులకు సంబంధించి నిర్వహిస్తారు.

ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లలో ప్రొఫిసరుగా చేరేందుకు యూజీసీ-నెట్ అర్హుతకు సంబంధించి పట్టింపు లేకపోయిన, ప్రభుత్వ యూనివర్సిటీలు, కళాశాలల్లో చేరేందుకు మాత్రం నెట్ ఎలిజిబిలిటీ తప్పనిసరి. రాష్ట ప్రభుత్వాలు భర్తీచేసే ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు ఉద్యోగాలకు కూడా యూజీసీ నెట్ అర్హుత తప్పనిసరి.

సీఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్

CSIR NET - Exam Date, Eligibility, Registrationసీఎస్ఐఆర్ నెట్ అనేది భారతీయ పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) ప్రోగ్రాంలో లేదా లెక్చరేషిప్(ఎల్ఎస్ఎఫ్)/ అసిస్టెంట్ ప్రొఫిసర్షిప్ అందించే అర్హుత పరీక్ష. దేశంలో ఒకానొక క్లిష్టమైన పరీక్షగా భావించే ఈ జాతీయ అర్హుత పరీక్షను ఏటా జూన్ మరియు డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు.

సీఎస్ఐఆర్ నెట్ అనేది భారతీయ పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) ప్రోగ్రాంలో లేదా లెక్చరేషిప్(ఎల్ఎస్ఎఫ్)/ అసిస్టెంట్ ప్రొఫిసర్షిప్ అందించే అర్హుత పరీక్ష. దేశంలో ఒకానొక క్లిష్టమైన పరీక్షగా భావించే ఈ జాతీయ అర్హుత పరీక్షను ఏటా జూన్ మరియు డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు.

సీఎస్ఐఆర్ నెట్ యందు టాప్ మెరిట్ సాధించిన విద్యార్థులకు అనుభవిజ్ఞులైన అధ్యాపకులు, శాస్త్రవేత్తల మార్గదర్శికంలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు, ఇనిస్టిట్యూట్లు, ఐఐటీలు, జాతీయ ప్రయోగశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఫార్మా కంపెనీల యందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రాం కింద ఆయా సైన్స్ డిపార్టుమెంటులలో పనిచేసే అవకాశం లభిస్తుంది.

లెక్చరేషిప్ (LS)/అసిస్టెంట్ ప్రొఫెసోర్షిప్‌కి అర్హుత సాధించిన వారు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇనిస్టిట్యూట్లు, పీజీ కాలేజీలు లలో లెక్చరరుగా లేదా ప్రొఫిసర్లుగా జాయిన్ అయ్యేందుకు అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీల్లో అధ్యాపకుల ఉద్యోగ భర్తీ ప్రక్రియ ద్వారా కొలువులు సాధించే అవకాశం ఉంటుంది. ఈ ఎల్ఎస్/ఏపీఎస్ కాలపరిమితి జీవితకాలం ఉంటుంది.

ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్)

APSET - Registration, Eligibility, Exam Dateఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు మరియు కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫసర్లుగా లేదా లెక్చరర్లుగా అర్హుత కల్పించేందుకు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హుత సాధించడం ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ మరియు ప్రైవేట్ యూనివర్సిటీలు & కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫసర్లుగా లేదా లెక్చరర్లుగా చేరేందుకు అర్హుత లభిస్తుంది. అలానే డిగ్రీ లెక్చరర్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లుగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.

ఏపీ సెట్ ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏడాదికోసారి నిర్వహించబడుతుంది. దాదాపు 30 స్పెషలైజ్డ్ సబ్జెక్టులలో సెట్ రాసేందుకు అవకాశం ఉంది. పరీక్షా రెండు పేపర్లుగా జరుగుతుంది. పేపర్ I జనరల్ స్టడీస్ సంబంధించి అందరికి కామన్ గా ఉంటుంది. పేపర్ II అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టుకు చెందినదై ఉంటుంది.

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్)

TSSET - Registration, Eligibility, Exam Dateతెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టును యూనివర్సిటీలు మరియు కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫసర్లుగా లేదా లెక్చరర్లుగా అర్హుత కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హుత సాధించడం ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ మరియు ప్రైవేట్ యూనివర్సిటీలు & కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫసర్లుగా లేదా లెక్చరర్లుగా చేరేందుకు అర్హుత లభిస్తుంది. అలానే జూనియర్, డిగ్రీ లెక్చరర్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లుగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.

టీఎస్ సెట్ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏడాదికోసారి నిర్వహించబడుతుంది. దాదాపు 29 స్పెషలైజ్డ్ సబ్జెక్టులలో ఈ సెట్ రాసేందుకు అవకాశం ఉంది. పరీక్ష రెండు పేపర్లుగా జరుగుతుంది. పేపర్ I జనరల్ స్టడీస్ సంబంధించి అందరికి కామనుగా ఉంటుంది. పేపర్ II, అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్టులకు చెందినదై ఉంటుంది.

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్ ఎగ్జామ్)

CTET Exam - Dates, Registration, Application, Eligibilityప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఆలోచనతో 2010 లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) ఈ సీటెట్ పరీక్షకు నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయాలు ఉండాలనే ఆలోచనతో, 1 నుండి 8 తరగతి వరకు విద్యను బోధించే ఉపాధ్యాయల నియామకాలకు సంబంధించి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలతో ఈ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహిస్తుంది.

సీటెట్ పరీక్షలో అర్హుత సాధిస్తే దేశ వ్యాప్తంగా ఉండే కేంద్ర ప్రభుత్వ మరియు అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లలో ఉపాధ్యాయాలుగా పనిచేసేందుకు అర్హుత లభిస్తుంది. ఈ సీటెట్ నమూనాతో దాదాపు అన్నిరాష్ట్రాలు తమ సొంత టెట్ పరీక్షను నిర్వహిస్తున్నప్పటికి ..ఏటా రెండు సార్లు క్రమం తప్పకుండ జరిగే సీటెట్ పరీక్షకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవలే సీటెట్ స్కోరు చెల్లుబాటును 7 సంవత్సరాల నుండి జీవితకాలానికి పొడిగించింది.

ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్ ఎగ్జామ్)

AP TET - Notification, Exam Date, Online Form, Syllabusసీటెట్ పరీక్షకు నమూనాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మండల పరిషిత్, జిల్లా పరిషిత్, మునసపాలిటీ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్  ఆన్ ఎయిడెడ్ స్కూళ్లలో జరిగే ఉపాధ్యాయల నియామకాలకు సంబంధించి టెట్ అర్హుత తప్పనిసరి చేసింది. 1 నుండి 8వ తరగతి ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి జరిగే భర్తీ ప్రక్రియలో ఏపీ టెట్ అర్హుత సాధించిన వారికీ 20 శాతం వెయిటేజీ అందిస్తుంది.

టెట్ అర్హుత పత్రం చెల్లుబాటు వ్యవధి గతంలో 7 ఏళ్ళు ఉండేది. ప్రస్తుతం లైఫ్‌టైమ్ వ్యవధితో చెల్లుబాటు కానుంది. అభ్యర్థి గరిష్ట వయోపరిమితి ఉన్నంతవరకు అన్ని టీచర్ నియామక ప్రక్రియలలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలానే  ఏటా జరిగే టెట్ పరీక్షలకు హాజరై టెట్ స్కోరును మరింత మెరుగుపర్చుకునే అవకాశం కూడా ఉంటుంది.

టెట్ అర్హుత పరీక్ష రెండు పేపర్లలో జరుగుతుంది. 1 నుండి 5 వ తరగతి ఉపాధ్యాయల కోసం పేపర్ 1 నిర్వహించబడుతుంది. 6 నుండి 8 వ తరగతి చెందిన ఉపాధ్యాయల కోసం పేపర్ 2 నిర్వహించబడుతుంది. ఒకవేళ 1 నుండి 8 వ తరగతి వరకు ఉపాధ్యాయులుగా చేరాలనుకునే వారు రెండు పేపర్లకు హాజరవ్వవలసి ఉంటుంది. పేపర్ 2 లో తిరిగి రెండు పేపర్లు ఉంటాయి.

సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ మరియు లాంగ్వేజ్ పండిట్లు లకు సంబంధించిన అభ్యర్థులు పేపర్ 2 A కు హాజరవ్వవల్సి ఉంటుంది. అలానే ఫీజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అభ్యర్థులు పేపర్ 2 B కు హాజరవ్వవల్సి ఉంటుంది.

టీఎస్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ టెట్ ఎగ్జామ్)

TS TET Exam - Dates, Registration, Application, Eligibilityటీఎస్ టెట్ అనగా తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అర్ధం. టెట్ పరీక్షను ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయాలుగా పనిచేసేందుకు ఆసక్తి కనబర్చే అభ్యర్థుల యొక్క ప్రాథమిక టీచింగ్ ఎలిజిబిలిటీని అంచనా వేసేందుకు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మండల పరిషిత్, జిల్లా పరిషిత్, మునసపాలిటీ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్  ఆన్ ఎయిడెడ్ స్కూళ్లలో జరిగే ఉపాధ్యాయల నియామకాలకు సంబంధించి టెట్ అర్హుత తప్పనిసరి చేసింది.

1 నుండి 8వ తరగతి ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి జరిగే భర్తీ ప్రక్రియలో టెట్ అర్హుత సాధించిన వారికీ 20 శాతం వెయిటేజీ ఇస్తుంది. టెట్ స్కోరు కాలవ్యవధి గతంలో 7 ఏళ్ళుకు మాత్రమే ఉండేది. తాజాగా ప్రభుత్వం దీన్ని జీవితకాలం చెల్లిబాటుయ్యేలా జీవో జారీచేసింది. దీని ప్రకారం ఒకసారి టెట్ అర్హుత సాధిస్తే మీ వయోపరిమితి ఉన్నంత వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలకు పోటీపడవొచ్చు.