తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 04 ఫిబ్రవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.
ఘర్ (గో హోమ్ అండ్ రీ యూనిట్) పోర్టల్ ప్రారంభం
నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కొత్తగా ఘర్ (గో హోమ్ అండ్ రీ యూనిట్) పోర్టల్ ప్రారంభించింది. తప్పిపోయిన పిల్లల పునరుద్ధరణ మరియు సంరక్షను డిజిటల్‌గా పర్యవేక్షించడానికి మరియు ట్రాక్ చేయడానికి దీనిని అభివృద్ధి చేసింది. ఘర్ పోర్టల్ ఈ కింది విధులను నిర్వర్తిస్తుంది.
- జువెనైల్ జస్టిస్ సిస్టమ్‌లో ఉన్న పిల్లలను డిజిటల్‌గా ట్రాకింగ్ చేసి, పర్యవేక్షించి, సొంత దేశం/రాష్ట్రం/జిల్లాకు తరలిస్తుంది.
- దేశం/రాష్ట్రంలోని సంబంధిత జువైనల్ జస్టిస్ బోర్డు/శిశు సంక్షేమ కమిటీకి పిల్లల కేసులను డిజిటల్ బదిలీ చేసి, వారి సొంత ప్రాంతాలకు చేర్చేందుకు సహాయపడుతుంది.
- అనువాదకుడు/వ్యాఖ్యాత/నిపుణుడి అవసరం ఉన్న చోట, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేస్తుంది.
- చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు & జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ల ద్వారా పిల్లల కేసు పురోగతిని డిజిటల్‌గా పర్యవేక్షిస్తూ, పిల్లల పునరుద్ధరణ & పునరావాసాన్ని నిర్దారిస్తుంది.
- సొంత ప్రాంతాలకు చేర్చని పిల్లల కోసం పరిహారం లేదా ఇతర ద్రవ్య ప్రయోజనాలు అందేలా చేస్తుంది.
- ప్రభుత్వం అమలు చేసే పథకాల జాబితాను అందిస్తుంది.
- తద్వారా పునరుద్ధరణ సమయంలో బాలల సంక్షేమ కమిటీలు పిల్లలను కుటుంబాన్ని బలోపేతం చేసేందుకు, పథకాలతో అనుసంధానించేందుకు సహాయం అందిస్తుంది.
ఈ పోర్టల్ స్త్రీ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. 2015 జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం తప్పి పోయిన పిల్లల భద్రత, రక్షణ, గౌరవం మరియు శ్రేయస్సును నిర్ధారించడం కోసం ఇది కృషి చేస్తుంది. పిల్లలు సంరక్షణ, రక్షణ, అభివృద్ధి, చికిత్స మరియు సామాజిక పునరేకీకరణ ద్వారా వారి ప్రాథమిక అవసరాలను తీర్చడం ద్వారా సంరక్షణ మరియు రక్షణ అవసరమైన పిల్లలకు ఇది సహాయం అందిస్తుంది.
అనాథ, తప్పిపోయిన మరియు విడిచిపెట్టబడిన పిల్లలను దత్తత తీసుకోవడానికి సమర్థవంతమైన మరియు వ్యవస్థీకృతమైన రక్షణ అందించేందుకు జువెనైల్ జస్టిస్ చట్టం 2015 ఏర్పాటు చేయబడింది. దీనిని 22 డిసెంబర్ 2015న రాజ్యసభ ఆమోదించింది. ఇది 16 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు చేసే నేరాలను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.
46 క్రూరమైన నేరాల విషయంలో 16 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారిని పెద్దల మాదిరిగానే విచారించాలనే నిబంధనను చేర్చడం ద్వారా, అటువంటి నేరాల బాధితులకు న్యాయం అందిస్తుంది. నేరంలో దోషిగా రుజువైతే ఏడేళ్లకు పైగా జైలుశిక్షను కూడా విదిస్తుంది.
జువెనైల్ జస్టిస్ చట్టాన్ని 2000 లో సవరించి చట్టానికి విరుద్ధంగా ఉన్న పిల్లలు మరియు చికిత్స మరియు రక్షణ అవసరమైన పిల్లలతో వ్యవహరించడానికి సంబంధించి నిబంధనలను ఏర్పాటు చేసింది. జువెనైల్ జస్టిస్ చట్టం 2015 (సెక్షన్లు 27-30) ప్రకారం పిల్లల సంరక్షణ మరియు రక్షణ సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీలకు ఇవ్వబడింది.
చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ పనితీరును పర్యవేక్షించడం కూడా తప్పనిసరి చేసింది. అదేవిధంగా, ఈచట్టంలోని సెక్షన్ 106 ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ల ఏర్పాటుని తప్పనిసరి చేసింది. వీటి పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా మేజిస్ట్రేట్‌లకు అప్పజెప్పింది. ఈ చట్టం 2021లో కూడా సవరించింది. ఇది ఈ చట్టం పరిధిలోని పిల్లల వయసును 16 నుండి 10కి తగ్గించింది.
ఫ్రాన్స్‌లో అధికారికంగా గ్లోబల్ యూపీఐ సేవలు ప్రారంభం
పారిస్‌లోని ఐకానిక్ ఈఫిల్ టవర్‌లో గ్లోబల్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ని ఫిబ్రవరి 2న భారత్ లాంఛనంగా ప్రారంభించింది. ఫ్రాన్స్‌లో జరిగిన రిపబ్లిక్ డే రిసెప్షన్‌లో భాగంగా ఈ సేవలు ప్రారంభించాయి. ప్రధాని మోడీ గతేడాది జులైలో ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా యూపీఐ చెల్లింపు విధానాన్ని ఉపయోగించేందుకు భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందాన్ని ప్రకటించారు. తాజా చొరవ ఫ్రాన్స్‌లోని భారతీయ పర్యాటకులు ఇకపై రూపాయిలలో చెల్లింపులు చేసేందుకు అవకాశం లభిస్తుంది.
ఈ సేవలు రాబోయే రోజులలో యూరప్ అంతటా పర్యాటక మరియు రిటైల్ రంగాలలోని ఇతర వ్యాపారులకు విస్తరించాలని భావిస్తున్నారు. ఇది యూపీఐ సేవలను ప్రపంచ మార్కెట్లో విస్తరించేందుకు సహాపడుతుంది అని భావిస్తున్నారు, ఇప్పటికే 30 ఏప్రిల్ 2023 నుండి మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, యూఎస్ఎ, సౌదీ అరేబియా, యూఏఈ మరియు యూకేలలో ఈ సేవల విస్తరణ జరిగింది.
యూపీఐ అనేది 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అభివృద్ధి చేయబడిన భారతదేశ మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ. ఇది కస్టమర్ సృష్టించిన వర్చువల్ పేమెంట్ అడ్రస్ ద్వారా వ్యక్తులను రౌండ్-ది-క్లాక్ చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. యూపీఐ అనేది ఏదైనా భాగస్వామ్య బ్యాంకు యొక్క ఒకే మొబైల్ అప్లికేషన్‌గా బహుళ బ్యాంక్ ఖాతాలను శక్తివంతం చేసే వ్యవస్థ.
నగేష్ ట్రోఫీని కైవసం చేసుకున్న కర్ణాటక
నాగ్‌పూర్‌లో జరిగిన జాతీయ అంధుల టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2023-24 ఫైనల్‌లో కర్ణాటక తొమ్మిది వికెట్ల తేడాతో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించి విజేతగా నిలిచి నగేష్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ జాతీయ టైటిల్ కోసం 20 ఏళ్ల కర్ణాటక నిరీక్షణ ముగిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది, అయితే ఛేదనలో కర్ణాటక జట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
నగేష్ ట్రోఫీ అనేది భారతదేశంలో దృష్టి లోపం ఉన్న పురుషుల కోసం ట్వంటీ 20 క్రికెట్ టోర్నమెంట్. ఇది క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా వ్యవస్థాపకుడు దివంగత ఎస్పీ నగేష్ పేరు మీదుగా ప్రారంభించబడింది. ఇందులో 24 రాష్ట్ర జట్లు రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో పోటీపడతాయి, తర్వాత ప్లేఆఫ్‌లు మరియు ఫైనల్ మ్యాచ్ నిర్వహించబడుతుంది.
లడఖ్‌లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 లేహ్‌లోని ఎన్డీయెస్ స్టేడియంలో ఫిబ్రవరి 2న ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల నిడువతో జరిగే ఈ మొదటి భాగంలో పదిహేను రాష్ట్రాలు మరియు రెండు ప్రభుత్వ సంస్థలు ఐస్ హాకీ మరియు ఐస్-స్కేటింగ్ ఈవెంట్‌లలో పాల్గొన్నాయి. వింటర్ గేమ్స్ రెండో భాగం ఫిబ్రవరి 21-25 వరకు జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో జరగనుంది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (KISCE) ఏర్పాటును గత అక్టోబర్ నెలలో ఆమోదించింది. ఇది ఈ సవాలుతో కూడిన ప్రాంతంలో క్రీడాకారులకు పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఈ కేంద్రం అథ్లెటిక్స్, ఆర్చరీ మరియు బాక్సింగ్ అనే మూడు క్రీడలకు సేవలు అందిస్తుంది.
ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 అనేది ఖేలో ఇండియా వార్షిక క్యాలెండర్‌లో నిర్వహించే ఈ ఈవెంట్ యొక్క నాల్గవ ఎడిషన్. ఈ క్రీడా ఈవెంట్ 2020 నుండి జమ్మూ & కాశ్మీర్ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వీటిని జమ్మూ & కాశ్మీరులో పాటుగా లడఖ్ కూడా ఆతిధ్యం ఇస్తుంది. ఈ ఈవెంట్ యొక్క మొదటి భాగం ఫిబ్రవరి 2-6 మధ్య లడఖ్ (లేహ్)లో జరగగా, రెండవ భాగం ఫిబ్రవరి 21-25 మధ్య జమ్మూ & కాశ్మీర్ (గుల్‌మార్గ్)లో నిర్వహిస్తారు.
ఈ క్రీడా ఈవెంట్ యందు ఐస్ హాకీ, స్పీడ్ స్కేటింగ్, పర్వతారోహణ, ఆల్పైన్ స్కీయింగ్, స్నోబోర్డింగ్, నార్డిక్ స్కీ మరియు గాండోలా వంటి క్రీడలు నిర్వహిస్తారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి ఖేలో ఇండియా మిషన్‌లో భాగం, ఇది ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనతో ప్రారంభించబడింది. అన్ని రకాల ఒలంపిక్ క్రీడలకు ప్రాముఖ్యతనిస్తూ, అత్యున్నత స్థాయి క్రీడా నైపుణ్యల భారతదేశం కోసం దీనిని నిర్వహిస్తున్నారు.
66వ వార్షిక గ్రామీ అవార్డుల విజేతలు 2024
66 వ వార్షిక గ్రామీ అవార్డ్‌ల వేడుక ఫిబ్రవరి 4, 2024న లాస్ ఏంజిల్స్‌లోని క్రిప్టో.కామ్ ఎరీనాలో నిర్వహించబడింది. ఈ అవార్డులు అక్టోబర్ 1, 2022 నుండి సెప్టెంబర్ 15, 2023 వరకు రికార్డింగ్ అకాడమీ ద్వారా ఎంపిక చేయబడిన ఉత్తమ రికార్డింగ్‌లు, కంపోజిషన్‌లు మరియు కళాకారులకు అందించబడ్డాయి. ఈ అవార్డుల వేడుక సీబీఎస్ బ్రాడ్‌కాస్టింగ్ ఇంక్ ద్వారా ప్రచారం చేయబడింది. దక్షిణాఫ్రికా హాస్యనటుడు ట్రెవర్ నోహ్ హోస్టుగా వ్యవహరించాడు.
దీని నామినేషన్లు నవంబర్ 10, 2023న ప్రకటించబడ్డాయి. ఈ ఏడాది సోలానా ఇమాని రోవ్ (SZA) అత్యధికంగా తొమ్మిది నామినేషన్లను అందుకుంది, తర్వాత విక్టోరియా మోనెట్, ఫోబ్ బ్రిడ్జర్స్ మరియు సెర్బన్ ఘెనియా ఒక్కొక్కరు ఏడు నామినేషన్లు అందుకున్నారు. అయితే ఫోబ్ లుసిల్లే బ్రిడ్జర్స్ ఈ ఏడాది అత్యధికంగా నాలుగు అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కొత్తగా గ్రామీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఆఫ్రికన్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్, గ్రామీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఆల్ట్రనేటివ్ జాజ్ ఆల్బమ్ మరియు గ్రామీ అవార్డ్ ఫర్ బెస్ట్ పాప్ డ్యాన్స్ రికార్డింగ్ విభాగాలను చేర్చారు.
66వ వార్షిక గ్రామీ అవార్డ్స్‌లో ఇండియాకు చెందిన లెజెండరీ ఫ్యూజన్ బ్యాండ్ శక్తికి చెందిన ఆల్బమ్ "దిస్ మూమెంట్" ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును గెలుచుకుంది. ఫ్యూజన్ బ్యాండ్ శక్తి అనేది ఆంగ్ల గిటారిస్ట్ జాన్ మెక్‌లాఫ్లిన్, భారతీయ వయోలిన్ ప్లేయర్ లక్ష్మీనారాయణ శంకర్, జాకీర్ హుస్సేన్, టిహెచ్ వినాయక్, శంకర్ మహదేవన్ సభ్యుల బృంధం. ఫ్యూజన్ బ్యాండ్ శక్తి 1973లో ఏర్పాటు చేసారు. ఇది తొలి రోజుల్లో "తురియానంద సంగీత్" అనే స్టేజ్ పేరుతో నిర్వహించబడేది.
ప్రస్తుతం ఈ బ్యాండ్ యందు జాన్ మెక్‌లాఫ్లిన్, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, గణేష్ రాజగోపాలన్, వి.సెల్వగణేష్ సభ్యులుగా ఉన్నారు. ఈ బ్యాండ్ అమెరికన్ మరియు భారతీయ సంగీతాన్ని కలపడంతో పాటుగా, ఇండియాలో హిందుస్తానీ మరియు కర్ణాటక సంగీత సంప్రదాయాల కలయికకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
- గ్రామీ రికార్డ్ ఆఫ్ ది ఇయర్ : ఫ్లవర్స్ ( మిలే సైరస్)
- గ్రామీ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ : మిడ్‌నైట్స్ (టేలర్ స్విఫ్ట్)
- సాంగ్ ఆఫ్ ది ఇయర్ : వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?
- బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ : విక్టోరియా మోనెట్
- బెస్ట్ పాప్ సోలో పెర్ఫార్మెన్స్ : ఫ్లవర్స్ ( మిలే సైరస్)
- బెస్ట్ పాప్ డ్యూయో/గ్రూప్ పెర్ఫార్మెన్స్ : ఘోస్ట్ ఇన్ ది మెషిన్ (సోలానా ఇమాని రోవ్ & ఫోబ్ బ్రిడ్జర్స్)
- ఉత్తమ పాప్ వోకల్ ఆల్బమ్ : మిడ్‌నైట్స్ (టేలర్ స్విఫ్ట్)
- బెస్ట్ డాన్స్ /ఎలక్ట్రానిక్ రికార్డింగ్ : రంబుల్ (స్క్రిల్లెక్స్ , ఫ్రెడ్ ఎగైన్ & ఫ్లోడాన్)
- బెస్ట్ రాక్ పెర్ఫార్మెన్స్ : నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ (బాయ్జెనియస్)
- బెస్ట్ రాక్ సాంగ్ : నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ (బాయ్జెనియస్, జూలియన్ బేకర్ , ఫోబ్ బ్రిడ్జర్స్ & లూసీ డాకస్)
- బెస్ట్ రాక్ ఆల్బమ్ : దిస్ ఈజ్ వై (పారామో)
- బెస్ట్ ఆఫ్రికన్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ : వాటర్ (టైలా)
- బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ : దిస్ మూమెంట్ (ఫ్యూజన్ బ్యాండ్ శక్తి)
- ఉత్తమ పిల్లల ఆల్బమ్ : 23 ఆండ్రేస్
hi!,I love your writing very so much!