ముఖ్యమైన రోజులు మరియు తేదీలు మార్చి 2024
Important Dates

ముఖ్యమైన రోజులు మరియు తేదీలు మార్చి 2024

మార్చి 2024లో ముఖ్యమైన రోజులు మరియు తేదీలు కోసం చదవండి. మార్చి నెలలో జరుపుకునే వివిధ జాతీయ దినోత్సవాలు మరియు అంతర్జాతీయ దినోత్సవాల వివరాలు తెలుసుకోండి. ప్రముఖుల పుట్టిన రోజులు, మరణాల సమాచారం కూడా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

Advertisement

జనౌషధి దివస్ వీక్ | మార్చి మొదటి వారం (1-7)

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఆధ్వర్యంలోని ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) నిర్వహించే జనౌషధి దివాస్'ను మార్చి మొదటి వారంలో 1 వ తేదీ నుండి 7 వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రజలకు సరసమైన ధరలలో మందులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్ ఔషధి పథకం కోసం అవగాహనా కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే | మార్చి 01

ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని ఏటా మార్చి 1న జరుపుకుంటారు. విపత్తు నిర్వహణ గురించి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఈ వేడుక నిర్వహిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడానికి మరియు విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి పౌర జనాభాను మెరుగ్గా సిద్ధం చేయడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.

జీరో డిస్క్రిమినేషన్ డే | మార్చి 01

వివక్ష రహిత దినోత్సవంను ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలచే ప్రతి సంవత్సరం మార్చి 1న నిర్వహిస్తారు. ప్రభుత్వ వ్యవస్థల నుండి, న్యాయ వ్యవస్థల నుండి ప్రజలకు వివక్షత లేకుండా ఉండటం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

వరల్డ్ హియరింగ్ డే | మార్చి 03

చెవిటితనం మరియు వినికిడి లోపాన్ని నివారించడం మరియు చెవి మరియు వినికిడి కలిగిన వ్యక్తుల సంరక్షణను ఎలా ప్రోత్సహించాలనే దానిపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యొక్క అంధత్వం మరియు చెవుడు నివారణ కార్యాలయం ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది.

వరల్డ్ వైల్డ్ లైఫ్ డే | మార్చి 03

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (WWD) ను ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన నిర్వహిస్తారు. వైవిధ్యమైన అడవి జంతు జాతులను ​​​​మరియు వృక్ష జాతులను సంరక్షించేందుకు మరియు వాటి సంరక్షణ యందు అవగాహనా కల్పించేందుకు ఈ కార్యక్రమం నివహిస్తారు. ఈ కార్యక్రమంను 20 డిసెంబర్ 2013 నుండి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రారంభించబడింది.

ఎంప్లాయ్ అప్రిసియేషన్ డే | మార్చి 04

ప్రతి సంవత్సరం మార్చిలో మొదటి శుక్రవారం నాడు జాతీయ ఉద్యోగుల ప్రశంసా దినోత్సవంను జరుపుకుంటారు. ఈ కార్యక్రమంను రికగ్నిషన్ ప్రొఫెషనల్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక బోర్డు సభ్యులలో ఒకరైన బాబ్ నెల్సన్ యొక్క ఆలోచనతో మొదలయ్యింది. ఈరోజున యజమానులు తమ ఉద్యోగులకు కృతజ్ఞతలు లేదా గుర్తింపును తెలియజేయడానికి ఉపయోగించుకుంటారు.

నేషనల్ సేఫ్టీ డే | మార్చి 04

జాతీయ భద్రతా దినోత్సవంను ప్రతి ఏడాది మార్చి 4 న జరుపుకుంటారు. ఈరోజున జాతీయ భద్రతా మండలి అన్ని భద్రతా సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వీటిలో రహదారి భద్రత, పారిశ్రామిక భద్రత, మానవ ఆరోగ్యం మరియు పర్యావరణ భద్రత కూడా ఉన్నాయి. ఇండియన్ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ 4 మార్చి 1966 లో స్థాపించిన తేదికి గుర్తుగా ఈ వేడుక నిర్వహిస్తారు. దీని ప్రధాన కార్యాలయం నేవీ ముంబాయిలో ఉంది.

వరల్డ్ ఒబేసిటీ డే | మార్చి 04

ప్రపంచ ఊబకాయం దినోత్సవంను ఏటా మార్చి 4వ తేలిన నిర్వహిస్తారు. ప్రపంచ స్థూలకాయ సంక్షోభాన్ని అంతం చేయడానికి మరియు ఆచరణాత్మక పరిష్కారాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో భాగంగా 04 మార్చి 2020 నుండి ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఊబకాయం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాలలో ఒకటిగా ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరుగురి వ్యక్తులలో ఒకరిరు ఊబకాయంతో సతమౌతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వీరి సంఖ్యా 800 మిలియన్లకు దాటి ఉంటుంది.

ప్రపంచ టెన్నిస్ దినోత్సవం | మార్చి 07

ప్రపంచ టెన్నిస్ దినోత్సవంను ఏటా మార్చి 07వ తేదీన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం యొక్క మొదటి ఎడిషన్‌ను ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ మార్చి 4, 2013న ప్రారంభించింది. అలానే నేషనల్ ప్లే టెన్నిస్ డే ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 23 న జరుపుకుంటారు. ఇది టెన్నిస్ ఆడటానికి అంకితం చేయబడిన రోజు. అదేవిధంగా 20 జూన్ 1789 టెన్నిస్ కోర్ట్ ప్రారంభ తేదీని అంతర్జాతీయ టెన్నిస్ దినోత్సవంగా జరుపుకుంటారు.

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే | మార్చి 08

అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ప్రతిఏటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమాన్ని మహిళల సాంస్కృతిక, రాజకీయ మరియు సామాజిక ఆర్థిక విజయాలను గుర్తుచేసుకోవడానికి మరియు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదటిసారిగా 1975లో ఐక్యరాజ్యసమితి జరుపుకుంది. తర్వాత డిసెంబర్ 1977 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మహిళా హక్కులు మరియు అంతర్జాతీయ శాంతి కోసం ఈ తీర్మానాన్ని ఆమోదించింది.

నో స్మోకింగ్ డే | మార్చి రెండవ బుధవారం

ప్రతి ఏడాది మార్చి నెలలో రెండవ బుధవారం ప్రపంచవ్యాప్తంగా ధూమపాన నిషేధ దినంగా జరుపుకుంటారు. ధూమపానం మానేయాలనుకునే వారికి సహాయం చేయడానికి అలాగే ఒక వ్యక్తి ఆరోగ్యంపై ధూమపానం వల్ల కలిగే ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటారు.

ప్రపంచ కిడ్నీ దినోత్సవం | మార్చి 10

ప్రతి సంవత్సరం మార్చి 10 వ తేదీని ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమం ప్రధానంగా కిడ్నీ వైద్యులపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని మొదటిగా ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ మరియు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్స్ ద్వారా సంయుక్తంగా ప్రారంభించబడింది.

అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం | మార్చి 10

ఏటా మార్చి 10వ తేదీని అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అన్ని రంగాలతో పాటుగా న్యాయ వ్యవస్థలో కూడా మహిళల పూర్తి మరియు సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదంతో 2021 నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ | మార్చి 14

అంతర్జాతీయ గణిత దినోత్సవం ( IDM) అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 14న జరుపుకుంటారు. యునెస్కో నవంబర్ 2019లో పై డేని అంతర్జాతీయ గణిత దినోత్సవంగా నిర్ణయించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అంకగణితం మరియు సమస్య పరిష్కారంలో వారి నైపుణ్యాలను పదును పెట్టడానికి మరియు ప్రోత్సహించడానికి గాను నిర్వహిస్తారు. ఇదేరోజు సాపేక్షత సిద్ధాంత రూపకర్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జన్మదినోత్సవం కూడా.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్ : మార్చి 14

అంతర్జాతీయ నదుల కార్యాచరణ దినోత్సవంను ప్రతి సంవత్సరం మార్చి 14 వ తేదీన జరుపుకుంటారు. ఈ కార్యక్రమం నదుల ప్రాముఖ్యత మరియు జల వనరుల ఆదాపై పై అవగహన కల్పించేందుకు నిర్వహిస్తారు.

వరల్డ్ కాంటాక్ట్ డే | మార్చి 15

ప్రపంచ సంప్రదింపు దినోత్సవంను ఏటా మార్చి 15వ తేదీన జరుపుకుంటారు. దీనిని మొదటిసారిగా మార్చి 1953లో ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ సాసర్ బ్యూరో (IFSB) అనే సంస్థ ప్రకటించింది. ప్రపంచ సంప్రదింపు దినోత్సవం అనేది టెలిపతిక్ గ్రహాంతరవాసులు ఉన్నారనే ఆశతో, గ్రహం మరియు మన ఆరోగ్యం మధ్య పరస్పర అనుసంధానంపై ఆశాభావం వ్యక్తపరుస్తూ వేడుక చేసుకుంటారు.

వరల్డ్ కంజ్యూమర్ రైట్స్ డే | మార్చి 15

వినియోగదారుల హక్కులు మరియు అవసరాల గురించి ప్రపంచవ్యాప్త అవగాహనను పెంపొందించే లక్యంలో భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు. వినియోగదారుల రక్షణ కోసం 09 ఏప్రిల్ 1985 లో ఐక్యరాజ్యసమితి విస్తృత నియమాలను ఆమోదించింది. ఆ తర్వాత వాటిపై అవగాహన పెంపొందించడంలో భాగంగా మొదటి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 1983లో నిర్వహించబడింది.

ఇంటర్నేషనల్ డే టూ కంబాట్ ఇస్లామోఫోబియా | మార్చి 15

ఏటా మార్చి 15వ తేదిని ఇస్లామోఫోబియాను ఎదుర్కోవటానికి అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమం 2022 లో ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (OIC) తరపున పాకిస్తాన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) ఏకాభిప్రాయంతో ఆమోదించడంతో ప్రారంభమైంది.

ఇస్లామోఫోబియా అంటే ఇస్లాం పేరు వినగానే ద్వేషపూరిత మాటలు, వివక్ష మరియు హింస వంటివి ప్రదర్శించడం. ముస్లిం వ్యక్తులు మరియు వర్గాల పట్ల వివక్ష, శత్రుత్వం మరియు హింసాత్మక భావాన్ని పారదోలి, వారి యందు స్నేహపూర్వక భావాన్ని పొంపొందించే లక్ష్యంలో ఈ కార్యక్రమం జరుపుకోనున్నారు.

నేషనల్ వాక్సినేషన్ డే | మార్చి 16

మానవ ఆరోగ్య వ్యవస్థలో వ్యాక్సిన్‌ల ప్రాముఖ్యతను పెంపొందించడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం మార్చి 16ని జాతీయ టీకా దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ టీకా దినోత్సవాన్ని నేషనల్ ఇమ్యునైజేషన్ డే అని కూడా పిలుస్తారు. ప్రతి చిన్నారికి టీకాలు వేయించేందుకు ముందు వరుస ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించి, ఈరోజున వారిని అభినందిస్తుంది.

గ్లోబల్ రీసైక్లింగ్ డే | మార్చి 18

ప్రతి సంవత్సరం మార్చి 18 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ రీసైక్లింగ్ డే జరుపుకుంటారు. రీసైక్లింగ్ అనేది యూఎన్ యొక్క 2030 సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం ప్రపంచం ఏటా రెండు బిలియన్ మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను మరియు పునర్వినియోగ వస్తువులను ఉత్పత్తిచేస్తుంది. వీటిలో రీసైక్లింగ్ జరిగేది చాలా తక్కువ. ఈ వ్యర్దాల వలన గాలి, నీరు, నేల వంటి ప్రకృతి వనరులు కలుషితమౌతున్నాయి. వీటిపై అవగహన కల్పించేందుకే ఈ కార్యక్రమంను నిర్వహిస్తారు.

వరల్డ్ స్లీప్ డే : వసంత విషువత్తుకు ముందు శుక్రవారం

ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని ఏటా వసంత విషువత్తుకు ముందు శుక్రవారం జరుపుకుంటారు. ఈ వార్షిక కార్యక్రమంను వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ స్లీప్ మెడిసిన్, 2008 నుండి ప్రారంభించింది. ప్రజల్లో మంచి నిద్ర అలవాట్ల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం దీని ప్రధాన లక్ష్యం.

వరల్డ్ ఓరల్ హెల్త్ డే | మార్చి 20

ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవంను ఏటా మార్చి 20వ తేదీన జరుపుకుంటారు. నోటి ఆరోగ్యం మరియు నోటి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహనా పెంపొందించడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంను మొదటిసారి 2013 లో వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ ప్రారంభించింది.

వరల్డ్ స్పేరౌ డే | మార్చి 20

ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతరించిపోతున్న ఈ అరుదైన చిట్టి పక్షుల మనుగడను పెంపొందించడంలో భాగంగా ఈ వేడుక నిర్వహిస్తారు. ఇంటి పిచ్చుకులుగా పిలుచుకునే ఈ జాతి జనాభా గత దశబ్దకాలంలో 80% తగ్గిపోయింది. వీటి పరిరక్షణపై ప్రజలలో అవగహన పెంచేందుకు పక్షి ప్రేముకులు, ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ | మార్చి 20

అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది 2012 నుండి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానంతో ప్రారంభించబడింది. అంతర్జాతీయ సంతోష దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ జీవితంలో ఆనందం యొక్క ప్రాముఖ్యతను గ్రహించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

వరల్డ్ పప్పెట్రీ డే | మార్చి 21

ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీని ప్రపంచ తోలుబొమ్మల దినోత్సవంగా జరుపుకుంటుంటారు. తోలుబొమ్మలాటను ప్రపంచ కళారూపంగా గుర్తించేందుకు మరియు ఆ కళాకారులను గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను 2002 నుండి నిర్వహిస్తున్నారు. దీని ముందుగా ఇరాన్‌కు చెందిన పప్పెట్ థియేటర్ ఆర్టిస్ట్ జావద్ జోల్ఫాఘరి ద్వారా ఆచరణలోకి వచ్చింది. 2000లో మాగ్డేబర్గ్‌లోని యూనియన్ ఇంటర్నేషనల్ డి లా మారియోనెట్ యొక్క XVIII కాంగ్రెస్‌లో అతను దీనికి సంబంధించి చర్చ కోసం ప్రతిపాదన చేశాడు.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ | మార్చి 21

అంతర్జాతీయ అటవీ దినోత్సవంను ఏటా మార్చి 21వ తేదీన జరుపుకుంటారు. ప్రజలలో అడవుల ప్రాముఖ్యతను తెలిపేందుకు మరియు వాటి సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దీనిని 28 నవంబర్ 2013న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 1.6 బిలియన్ల ప్రజలు, తమ మనుగడ కోసం అడవులపై ప్రత్యేక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడుతున్నట్లు తెలుస్తుంది.

వరల్డ్ వాటర్ డే | మార్చి 22

ప్రపంచ నీటి దినోత్సవం, 1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22 తేదీన నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంను మంచినీటి ప్రాముఖ్యత మరియు మంచినీటి వనరుల నిర్వహణపై అవగహన పెంపొందించేందుకు నిర్వహిస్తారు. ఈ అవగహన దినోత్సవం 1992లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో  జరిగిన ఎన్విరాన్మెంటల్ & డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ ద్వారా తీర్మానించబడింది.

అమరవీరుల దినోత్సవం & షహీద్ దివాస్ | మార్చి 23

భారతదేశంలో అమరవీరుల దినోత్సవం లేదా షహీద్ దివాస్ లను అనేక తేదీలలో జరుపుకుంటారు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడి, 1931 మార్చి 23న లాహోర్‌లో అమరవీరులైన భగత్ సింగ్, సుఖ్‌దేవ్ థాపర్ మరియు శివరామ్ రాజ్‌గురుల త్యాగాలను స్మరించుకోవడానికి మార్చి 23 తేదీని ఏటా షాహిద్ దివస్ లేదా సర్వోదయ దినోత్సవంగా నిర్వహిస్తారు.

అలానే 1948లో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ హత్యకు గురైన జనవరి 30 వ తేదీన కూడా జాతీయ స్థాయిలో అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. అదేవిధంగా ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపత్ రాయ్ వర్ధంతి సందర్భంగా ఏటా నవంబర్ 17ని షహీద్ దివాస్ లేదా అమరవీరుల దినోత్సవంగా ఒడిశా ప్రభుత్వం జరుపుకుంటుంది.

ప్రపంచ వాతావరణ దినోత్సవం | మార్చి 23

ప్రపంచ వాతావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీన జరుపుకుంటారు. 23 మార్చి 1950న ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటు జ్ఞాపకార్థంగా  1961 నుండి ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం కోసం ఒక నినాదాన్ని ప్రకటిస్తుంది. పర్యావరణ పరిరక్షణే ద్యేయంగా ఈ కార్యక్రమాను ప్రపంచ అన్ని దేశాలు నిర్వహిస్తాయి.

ప్రపంచ ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ)  డే | మార్చి 24

ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం నిర్వహించబడుతుంది. ఇది ప్రధానంగా క్షయవ్యాధిపై అవగహన మరియు వ్యాధిని నివారించే ప్రయత్నాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి రూపొందించబడింది. టీబీ కారణంగా ఏటా 10 మిలియన్ల మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు అందులో 1.5 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు.

క్షయవ్యాధి (టీబీ) అనేది ఒక తీవ్రమైన అంటు వ్యాధి, ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. క్షయవ్యాధిని కలిగించే మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా దగ్గు మరియు తుమ్ముల ద్వారా గాలిలోకి విడుదలయ్యే చిన్న బిందువుల ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిని మొదట 1882 లో డా. రాబర్ట్ కోచ గుర్తించారు.

వరల్డ్ థియేటర్ డే | మార్చి 27

ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 27న జరుపుకుంటారు. 1961లో అంతర్జాతీయ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ (ITI) ఈ వేడుకను మొదట ప్రారంభించింది. ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీఐ కేంద్రాలు, ఐటీఐ సహకార సభ్యులు, థియేటర్ నిపుణులు, థియేటర్ సంస్థలు, థియేటర్ విశ్వవిద్యాలయాలు ఏటా ఘనంగా జరుపుకుంటున్నాయి.

Advertisement

Post Comment