సీటెట్ ఎగ్జామ్ జనవరి 2024 : రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ & ఎగ్జామ్ ఫార్మేట్
Admissions Teaching Entrance Exams

సీటెట్ ఎగ్జామ్ జనవరి 2024 : రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ & ఎగ్జామ్ ఫార్మేట్

ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల అర్హుతను నిర్ణయించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి మరియు అర్హుత ఉన్న అభ్యర్థులు 23 నవంబర్ 2023 లోపు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 3 నుండి ప్రారంభం కానుంది. ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా 135 నగరాల్లో నిర్వహించనున్నారు.

సీటెట్ 2024

ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఆలోచనతో 2010 లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) ఈ సీటెట్ పరీక్షకు నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయాలు ఉండాలనే ఆలోచనతో, 1 నుండి 8 తరగతి వరకు విద్యను బోధించే ఉపాధ్యాయల నియామకాలకు సంబంధించి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలతో ఈ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహిస్తుంది.

సీటెట్ పరీక్షలో అర్హుత సాధిస్తే దేశ వ్యాప్తంగా ఉండే కేంద్ర ప్రభుత్వ మరియు అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లలో ఉపాధ్యాయాలుగా పనిచేసేందుకు అర్హుత లభిస్తుంది. ఈ సీటెట్ నమూనాతో దాదాపు అన్నిరాష్ట్రాలు తమ సొంత టెట్ పరీక్షను నిర్వహిస్తున్నప్పటికి ..ఏటా రెండు సార్లు క్రమం తప్పకుండ జరిగే సీటెట్ పరీక్షకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవలే సీటెట్ స్కోరు చెల్లుబాటును 7 సంవత్సరాల నుండి జీవితకాలానికి పొడిగించింది.

Exam Name CTET 2024
Exam Type Eligibility Test
Eligibility For Teaching
Exam Date 21 Jan 2023
Exam Duration 2.30 Hours
Exam Level National Level

సీటెట్ 2024 ఎలిజిబిలిటీ

  • పేపర్ 1 :(క్లాస్ 1 నుండి 5) 50 శాతం మార్కులతో 10+2 లేదా ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 5శాతం మార్కుల సడలింపు ఉంటుంది మరియు 50 శాతం మార్కులతో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) లేదా 4ఏళ్ళ బ్యాచిలర్ అఫ్ ఎలిమింటరీ ఎడ్యుకేషన్ (B.El.Ed) చేసిన వారు అర్హులు
  • పేపర్ 2 : (క్లాస్ 6 నుండి 8) 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ అఫ్ ఎడ్యుకేషన్(B.Ed ) లేదా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేసిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది.
  • 50 శాతం మార్కులతో నాలుగేళ్ళ B.A.Ed/B.Sc.Ed పూర్తిచేసిన వారు కూడా అర్హులు. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 5శాతం మార్కుల సడలింపు ఉంటుంది.
  •  ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా NCTE గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ అఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (B.P.Ed) లేదా గ్రాడ్యుయేట్ ఇన్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (BPE) పూర్తిచేసిన వారు అర్హులు.
  • బ్యాచిలర్ డిగ్రీ అర్హుతకు సంబంధించి యూజీసీ గుర్తింపు పొందిన కళాశాలల్లో పూర్తిచేసిన వారు మాత్రమే అర్హులు.
  • సీటెట్ రాసేందుకు ఎటువంటి గరిష్ట వయోపరిమితి లేదు.
  • సీటెట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.

సీటెట్ 2024 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 03 నవంబర్ 2023
దరఖాస్తు చివరి తేదీ 23 నవంబర్ 2023
హాల్ టికెట్ జనవరి 2024
పరీక్ష తేదీ 21 జనవరి 2024
ఫలితాలు ఫిబ్రవరి 2024

సీటెట్ 2024 దరఖాస్తు ఫీజు

కేటగిరి పేపర్ I లేదా పేపర్ II పేపర్ I & పేపర్ II
ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి 500/- 600/-
ఇతర అభ్యర్థులకు 1000/- 1200/-

సీటెట్  దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.

సీటెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ

సీటెట్ దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. సీటెట్ 2024 అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయండి. ముందుగా మీ మొబైల్ మరియు మెయిల్ ఐడీ ద్వారా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రెండవ దశలో దరఖాస్తు అడిగిన విద్య, వ్యక్తిగత, చిరునామా వివరాలు పొందుపర్చి, దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకొండి. దరఖాస్తు సమయంలో నింపే ప్రతి సమాచారం కు జవాబుదారీ మీరే కాబట్టి, ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు స్టెప్ బై స్టెప్ పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి ఉంచుకోండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

తెలుగు రాష్ట్రాల్లో సీటెట్ పరీక్ష కేంద్రాలు

  • విజయవాడ
  • విశాఖపట్నం
  • హైదరాబాద్

సీటెట్ 2024 ఎగ్జామ్ నమూనా

సీటెట్ అర్హుత పరీక్ష పూర్తి ఆన్‌లైన్‌(సీబీటీ) విధానంలో జరుగుతుంది. 2 గంటల 30 నిమిషాల నిడివి తో జరిగే ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ప్రైమరీ స్థాయిలో 1 నుండి 5 వ తరగతి ఉపాధ్యాయల అర్హుత కి సంబంధించి జరుగుతుంది. పేపర్ II ఎలిమంటరీ స్థాయిలో 6 నుండి 8 వ తరగతి ఉపాధ్యాయల అర్హుత కి సంబంధించి జరుగుతుంది.

ఒకేవేళ 1 నుండి 8 వ తరగతి ఉపాధ్యాయల అర్హుత కి సంబంధించి వ్రాయాలి అనుకుంటే, పేపర్ I మరియు పేపర్ II రెండు పేపర్లకు హాజరు కావాల్సి ఉంటుంది. 150 మార్కులకు జరిగే ఈ పరీక్షలో మొత్తం 150 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు ఇవ్వబడుతుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.

పేపర్ 1 : ప్రైమరీ క్లాసులు 1 నుండి 5 వ తరగతి
చైల్డ్ డెవలప్మెంట్ మరియు బోధన పద్ధతులు  30 ప్రశ్నలు 30 మార్కులు
లాంగ్వేజ్ 1  30 ప్రశ్నలు 30 మార్కులు
లాంగ్వేజ్ 2  30 ప్రశ్నలు 30 మార్కులు
మ్యాథమెటిక్స్  30 ప్రశ్నలు 30 మార్కులు
ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 ప్రశ్నలు 30 మార్కులు
మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులు
పేపర్ 2 : ఎలిమెంటరీ క్లాసులు 6 నుండి 8 వ తరగతి
చైల్డ్ డెవలప్మెంట్ మరియు బోధన పద్ధతులు  30 ప్రశ్నలు 30 మార్కులు
లాంగ్వేజ్ 1  30 ప్రశ్నలు 30 మార్కులు
లాంగ్వేజ్ 2  30 ప్రశ్నలు 30 మార్కులు
మ్యాథమెటిక్స్ / సైన్స్ / సోషల్ స్టడీస్ (ఆప్షనల్) 60 ప్రశ్నలు 60 మార్కులు
మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులు
  • పేపర్ 1 లోని చైల్డ్ డెవలప్మెంట్ మరియు బోధన పద్ధతులు అనే టాపిక్ 6 నుండి 11 ఏళ్ళ విద్యార్థులకు చెందిదై ఉంటుంది. ఆ వయసు పిల్లకు సంబందించిన బోధన పద్దతుల గురించి, చైల్డ్ సైకాలజీ, పాఠ్యాంశాలునేర్చుకునే పద్దతుల గూర్చి ఉంటుంది. అదేవిదంగా పేపర్ 2 ముందు చెప్పిన విదంగా 11 నుండి 14 ఏళ్ళ  విద్యార్థులకు చెందిదై ఉంటుంది.
  • లాంగ్వేజ్ 1 అభ్యర్థులకు చెందిన బోధన మాధ్యమానికి సంభందించిన ప్రావీణ్యతలు పరీక్షించే విదంగా ఉంటుంది.
  • లాంగ్వేజ్ 2 అభ్యర్థి  ఆప్షనల్ గా తీసుకున్న లాంగ్వేజ్ లో కమ్యూనికేషన్ మరియు కంప్రెహెన్షన్  బాష సామర్ధ్యాలను అంచనా వేచే విదంగా ఉంటుంది.
  • ఆయా పేపర్లలలో  ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి సిలబస్ ఆయా తరగతులకు చెందిన NCERT బుక్స్ నుండి ఇవ్వబడుతుంది.
  • ప్రశ్న పత్రాలు హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి.

సీటెట్ క్వాలిఫై మార్కులు  & సీటెట్ స్కోరు వాలిడిటీ

11 ఫిబ్రవరి 2011 లో NCTE (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) ఇచ్చిన నోటిఫికేషన్ నెంబర్ 76-4/2010/NCTE/Acad ప్రకారం సీటెట్ లో 60 శాతం లేదా అంతకు మించి స్కోర్ సాధించిన అభ్యర్థులు టెట్ అర్హులుగా పరిగణిస్తారు. టెట్ అర్హుత సాధించిన వారంతా టీచర్ ఉద్యోగాలకు అర్హులని కాదు వాటిలో ఇది ఒక అర్హుత మాత్రమే.

సీటెట్ అర్హుత మార్కులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థుల రిజర్వేషన్ హక్కులు ఆయా రాష్ట్రాలు, స్కూల్ మేనేజ్‌మెంట్‌ పాలసీలకు లోబడి ఉంటాయి. సీటెట్ స్కోర్ కార్డు యొక్క కాలపరిమితిని ఇటీవలే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 7 సంవత్సరాల నుండి జీవితకాలానికి పొడిగించింది. అభ్యర్థులకు ఇష్టముంటే తమ సీటెట్ స్కోరును ప్రతి ఏడాది మెరుగు పర్చుకునేందుకు అవకాసం ఉంటుంది. సీటెట్ కు హాజరయ్యే విషయంలో ఎటువంటి పరిమితి లేదు.

సీటెట్ స్కోర్ చెల్లుబాటు అయ్యే స్కూళ్లు

  • సీటెట్ స్కోరును కేంద్ర ప్రభత్వ అధీనంలో నడిచే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సెంట్రల్ టిబెటన్ స్కూళ్ల వంటి వివిధ టీచింగ్ నియమాకాల్లో పరిగణలోకి తీసుకుంటారు.
  • అలానే కేంద్ర పాలిత ప్రాంతాలైన చండీఘర్, దాద్రా మరియు నగర్ హవేలీ, డామన్ మరియు డయ్యు, అండమాన్ నికోబర్ దీవులు, లక్షదీప్ మరియు ఢిల్లీ ప్రభుత్వ అధీనంలో ఉన్న స్కూళ్ల టీచింగ్ నియమాకాల్లో పరిగణలోకి తీసుకుంటారు.
  • సీటెట్ స్కోర్ ని కొన్ని ఆన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లు కూడా తమ స్కూళ్ల టీచింగ్ నియమాకాల్లో పరిగణలోకి తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తాయి.
  • రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత టెట్ లు నిర్వహించేటప్పటికీ, కొన్ని నిర్వహించలేని సందర్భాలలో సీటెట్ స్కోర్ ని పరిగణలోకి తీసుకుంటాయి.

Post Comment