Advertisement
డైలీ కరెంట్ అఫైర్స్ 17 నవంబర్ 2023 | తెలుగులో కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

డైలీ కరెంట్ అఫైర్స్ 17 నవంబర్ 2023 | తెలుగులో కరెంట్ అఫైర్స్

తెలుగు ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ 17 నవంబర్ 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

సల్మాన్ రష్దీకి తొలి 'లైఫ్‌టైమ్ డిస్టర్బింగ్ ది పీస్ అవార్డు

ప్రపంచ ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్దీకి వక్లావ్ హావెల్ సెంటర్ తొలిసారిగా 'లైఫ్‌టైమ్ డిస్టర్బింగ్ ది పీస్ అవార్డు'ను ప్రదానం చేసింది. నవంబర్ 14న న్యూయార్క్‌లో జరిగిన ఈ సాహిత్య ఉత్సవంలో ఈ అవార్డు ప్రదానం చేయబడింది. గత సంవత్సరం ఒక సాహిత్య కార్యక్రమంలో కత్తిపోట్లకు గురైన తర్వాత సల్మాన్ రష్దీ ఒక వేడుకలో కనబడటం ఇదే తొలిసారి. సల్మాన్ రష్దీ గత నెలలో జర్మన్ బుక్ ట్రేడ్ యొక్క శాంతి బహుమతి కూడా అందుకున్నారు. ఈ అవార్డు రష్దీకి వాక్ స్వాతంత్య్రం పట్ల అచంచలమైన నిబద్ధతకు మరియు సామాజిక నిబంధనలను సవాలు చేసే ఆయన ధైర్యానికి గాను అందించబడింది.

అలానే ప్రముఖ ఈజిప్షియన్ కార్యకర్త అలా అబ్దెల్-ఫత్తాకు 'డిస్టర్బింగ్ ది పీస్ అవార్డ్ టు ఎ కరేజియస్ రైటర్ ఎట్ రిస్క్' అవార్డు అందజేశారు. అబ్దెల్-ఫత్తా ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నప్పటికీ ఈజిప్ట్ యొక్క అధికార పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నందుకు గాను ఆయనకు ఈ గౌరవం అందజేశారు.

లైఫ్‌టైమ్ డిస్టర్బింగ్ ది పీస్ అవారును వాక్లావ్ హావెల్ సెంటర్ ఈ ఏడాది నుండి అందిస్తుంది. వాక్లావ్ హావెల్ సెంటర్‌ను స్థాపించిన దివంగత చెక్ నాటక రచయిత మరియు అధ్యక్షుడు వక్లావ్ హావెల్‌ జ్ఞాపకార్థం దీనిని అందజేస్తున్నారు. ఈ సంస్థ వాక్లావ్ హావెల్ వారసత్వాన్ని గౌరవించడానికి, మానవ హక్కులు, ప్రజాస్వామ్యం మరియు సశాంతి యొక్క విలువలను ప్రోత్సహించడానికి 1997లో స్థాపించబడింది. భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడంలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తికి ప్రతి సంవత్సరం ఈ అవార్డు ఇవ్వబడుతుంది.

స్పెయిన్ ప్రధానిగా పెడ్రో శాంచెజ్ తిరిగి ఎన్నిక

స్పెయిన్ యొక్క తాత్కాలిక సోషలిస్ట్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ నవంబర్ 16, 2023 న ఆ దేశ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు. తాజాగా కాటలాన్ వేర్పాటువాదులతో వివాదాస్పద ఒప్పందం తర్వాత ఈ కొత్త వామపక్ష సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సాంచెజ్ పార్లమెంటరీ ఓటును గెలుచుకున్నారు. 2024లో జరగనున్న తదుపరి సార్వత్రిక ఎన్నికల వరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. స్పానిష్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీకి చెందిన పెడ్రో సాంచెజ్, జూన్ 2018 నుండి ఆ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు.

మాజీ ప్రధాని మరియానో ​​రాజోయ్‌పై అవిశ్వాస తీర్మానం తర్వాత జూన్ 2018లో సాంచెజ్ ప్రధానమంత్రి అయ్యారు. నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో మరణం తర్వాత జన్మించిన తొలి ప్రధాని ఆయనే. స్పెయిన్ యందు పార్లమెంటరీ రాచరికం అమలులో ఉంది. ప్రభుత్వానికి చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. ఈయన రాజ్యాంగానికి అనుగుణంగా తమ అధికారాన్ని ఉపయోగిస్తాడు. ప్రస్తుతం కింగ్ ఫెలిపే VI చక్రవర్తి హోదాలో ఉన్నారు.

ఇండియాలో రికార్డు స్థాయిలో 41010 పేటెంట్లు మంజూరు

భారత పేటెంట్ కార్యాలయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 15 వరకు రికార్డు స్థాయిలో 41,010 పేటెంట్లను మంజూరు చేసినట్లు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ సంఖ్య మునుపటి సంవత్సరం మంజూరు చేసిన 31, 750 పేటెంట్‌ల కంటే గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. పేటెంట్ గ్రాంట్ల పెరుగుదల భారతదేశం యొక్క పెరుగుతున్న ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థకు సంకేతం.

పేటెంట్స్, డిజైన్‌స్ మరియు ట్రేడ్ మార్క్‌ల కంట్రోలర్ జనరల్ కార్యాలయంను సాధారణంగా ఇండియన్ పేటెంట్ ఆఫీస్ అని పిలుస్తారు. ఇది పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యం యొక్క ప్రోత్సాహక విభాగం కింద ఒక ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇది పేటెంట్‌లు, డిజైన్‌లు మరియు ట్రేడ్ మార్క్‌ల భారతీయ చట్టాన్ని నిర్వహిస్తుంది. దీనిని 1912లో ముంబైలో స్థాపించారు. వాస్తవానికి పేటెంట్ కార్యాలయం యొక్క ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది, దాని శాఖ కార్యాలయాలు చెన్నై, న్యూఢిల్లీ మరియు ముంబైలలో ఉన్నాయి. అయితే ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ ముంబైలో ఉంది.

కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2023 'హాలూసినేట్'

2023 ఏడాదికి గాను కేంబ్రిడ్జ్ డిక్షనరీ యొక్క వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా "హాలూసినేట్ (Hallucinate)" ఎంపిక చేయబడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యందు ఈ పద వినియోగాన్ని ప్రతిబింబించేలా నిఘంటువు పదం యొక్క నిర్వచనాన్ని నవీకరించింది. ఎఐ వ్యవస్థలు చేసిన తప్పులను వివరించడానికి ఈ పదం ఇటీవలి సంవత్సరాలలో ఎక్కువగా ఉపయోగించబడుతోంది.

ఇటీవలే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంటెంట్ జనరేషన్ వాడకం ఎక్కువ అయ్యింది. అయితే, ఈ ఎఐ వ్యవస్థలు కొన్నిసార్లు తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇలాంటి సందర్భాలలో ఈ "భ్రాంతి" అనే అర్ధం వచ్చేలా కేంబ్రిడ్జ్ నిఘంటువు దాని నిర్వచనాన్నినవీకరించింది:

గాయకుడు సురేశ్ వాడ్కర్‌కు లతా మంగేష్కర్ అవార్డు

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ నేపథ్య గాయకుడు మరియు జాతీయ అవార్డు గ్రహీత సురేష్ వాడ్కర్‌ను 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 'గాంసమ్రాగిణి లతా మంగేష్కర్ అవార్డు'కు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ అవార్డులో భాగంగా నగదు బహుమతి, ప్రశంసాపత్రం మరియు జ్ఞాపికను అందుకోనున్నారు.

ఈ అవార్డును మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా లతా మంగేష్కర్ జ్ఞాపకారం అందించబడుతుంది. లతా మంగేష్కర్‌ను ' నైటింగేల్ ఆఫ్ ఇండియా/క్వీన్ ఆఫ్ మెలోడీ ' అని కూడా పిలుచుకుంటారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత బహుముఖ గాయకులలో ఆమె ఒకరు. 2007లో ఫ్రాన్స్ ఆమెకు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్‌ అందజేసింది. 1989లో భారత ప్రభుత్వం ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటుగా 2001లో దేశానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత భారతరత్న పురస్కారం అందజేసింది.

బంగాళాఖాతంలో మిధిలీ తుఫాను

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిధిలి తుపాన్ నవంబర్ 17న బంగ్లాదేశ్ ప్రాంతంలో తీరం దాటింది. ఈ తుఫానుకు మిధిలీ పేరును మాల్దీవులు ప్రతిపాదించింది. గంటకు 80 కిలోమీటర్ల గాలులతో తీరం దాటినా ఈ తుఫాన్ బంగ్లాదేశ్‌లో వరదలు, విద్యుత్తు అంతరాయాలు మరియు పంట నష్టాలతో సహా విస్తృతమైన నష్టాన్ని కలిగించింది.

మిధిలీ తుఫాను 2023లో బంగ్లాదేశ్‌లో ల్యాండ్‌ఫాల్ చేసిన రెండవ తుఫాను. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఏర్పడ్డ హమూన్ తుఫాను కూడా ఈ ప్రాంతంలోనే ల్యాండ్‌ఫాల్ చేసింది. బంగాళాఖాతంలో తుఫానులు సర్వసాధారణం మరియు అవి తరచుగా బంగ్లాదేశ్‌లో విస్తృతమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఈ తుఫానులు సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఏర్పడతయి. బంగ్లాదేశ్ ప్రపంచంలోని తుఫానులకు అత్యంత హాని కలిగించే దేశాలలో ఒకటి.

Post Comment