నిమ్‌సెట్ 2023 నోటిఫికేషన్ : ఎల్జిబిలిటీ, రిజిస్ట్రేషన్ & ఎగ్జామ్ తేదీ
Admissions MBA Entrance Exams

నిమ్‌సెట్ 2023 నోటిఫికేషన్ : ఎల్జిబిలిటీ, రిజిస్ట్రేషన్ & ఎగ్జామ్ తేదీ

నిమ్‌సెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. నిమ్‌సెట్ అనగా నిట్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. నిమ్‌సెట్ ప్రవేశ పరీక్షలో అర్హుత పొందటం ద్వారా కేంద్రప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) లలో మూడేళ్ళ ఎంసీఏ కోర్సులో అడ్మిషన్ పొందొచ్చు.

Advertisement
Exam Name NIMCET 2023
Exam Type Entrance Test
Entrance For MCA
Exam Date 11/06/2023
Exam Level National Level

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఎన్ఐటీలు) జాతీయ ప్రాముఖ్యతతో ఏర్పాటు చేయబడ్డ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లు. వీటిని 2007 లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NITSER) చట్టం ద్వారా స్థాపించారు. ప్రస్తుతం దేశంలో 31 ఎన్ఐటీలు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంజనీరింగ్, ఇతర యూజీ, పీజీ మరియు డాక్టోరల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.

నిమ్‌సెట్ ప్రవేశ పరీక్షను ప్రధానంగా అగర్తల, అలహాబాద్, భోపాల్, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర, రాయ్‌పూర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లి (తిరుచ్చి), మరియు వరంగల్ యందు గల 9 ఎన్ఐటీల యందు మూడేళ్ళ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సుల యందు అడ్మిషన్ కల్పించేందుకు నిర్వహిస్తారు. అయితే జంషెడ్‌పూర్, వరంగల్ ఎన్ఐటీలు రెండేళ్ల తర్వాత పీజీ డిప్లొమా సర్టిఫికెట్‌తో కోర్సు నుండి వైదొలిగేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.

నిమ్‌సెట్ ద్వారా అడ్మిషన్ పొందే ఎన్ఐటీలు & సీట్ల వివరాలు

ఎన్ఐటీ పేరు ఎంసీఏ సీట్ల వివరాలు
ఎన్ఐటీ అగర్తల 30 సీట్లు
ఎన్ఐటీ అలహాబాద్ 116 సీట్లు
ఎన్ఐటీ భోపాల్ 115 సీట్లు
ఎన్ఐటీ జంషెడ్‌పూర్ 115 సీట్లు
ఎన్ఐటీ కురుక్షేత్ర 96 సీట్లు
ఎన్ఐటీ రాయ్‌పూర్ 110 సీట్లు
ఎన్ఐటీ సూరత్‌కల్ 58 సీట్లు
ఎన్ఐటీ తిరుచిరాపల్లి 115 సీట్లు
ఎన్ఐటీ వరంగల్ 58 సీట్లు

నిమ్‌సెట్ 2023 ముఖ్యమైన తేదీలు

నిమ్‌సెట్ దరఖాస్తు ప్రారంభం 05 మార్చి 2023
నిమ్‌సెట్ దరఖాస్తు గడువు 10 ఏప్రిల్ 2023
నిమ్‌సెట్ అడ్మిట్ కార్డు 02 జూన్ 2023
నిమ్‌సెట్ 2023 ఎగ్జామ్ తేదీ 11 జూన్ 2023
నిమ్‌సెట్ 2023 రిజల్ట్ 26 జూన్ 2023

నిమ్‌సెట్ 2023 ఎలిజిబిలిటీ

  • భారతీయ పౌరులు మాత్రమే అర్హులు.
  • అభ్యర్థులు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా 60% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి బీఈ/బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులు.
  • పరీక్షకు హాజరు అయ్యేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు.

నిమ్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ

నిమ్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో అందుబాటులో ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక నిమ్‌సెట్ పోర్టల్ (www.nimcet.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా అభ్యర్థి తమ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ సహాయంతో నిమ్‌సెట్ అకౌంట్ రూపొందించుకోవాల్సి ఉంటుంది.

రెండవ దశలో సంబంధిత అకౌంట్ యందు లాగిన్ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులో వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. తర్వాత దశలో పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్ ఎంపిక, ఇనిస్టిట్యూట్ ఎంపిక వంటి వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. తర్వాత దశలో విద్యా ధ్రువపత్రాలు, ఫోటో, డిజిటల్ సిగ్నేచర్ వంటి ఫైల్స్ సరైన రీతుల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా ఎగ్జామ్ రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

దరఖాస్తు ఫీజు (జనరల్ కేటగిరి ) Rs. 2,500/-
దరఖాస్తు ఫీజు (ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి) Rs.1,250/-
ఎగ్జామ్ సెంటర్లు హైదరాబాద్ & వరంగల్

నిమ్‌సెట్ ఎగ్జామ్ ఫార్మేట్

నిమ్‌సెట్ ప్రవేశ పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించబడుతుంది. ఎగ్జామ్ 2 గంటల నిడివితో 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో జరపబడుతుంది. ప్రశ్నలు మ్యాథమెటిక్స్, అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ అవెర్నెస్ మరియు జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన అంశాల నుండి ఇవ్వబడతాయి. ప్రశ్నలు సంఖ్య, మార్కుల కేటాయంపు సెక్షన్ వారీగా మారుతూ ఉంటాయి.

మ్యాథమెటిక్స్ నుండి గరిష్టంగా 50 ప్రశ్నలు ఇవ్వబడతయి. ఒక్కో ప్రశ్నకు 12 మార్కులు కేటాయిస్తారు. అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అంశాల నుండి 40 ప్రశ్నలు ఇవ్వబడతయి. ఈ సెక్షన్ యందు ఒక్కో ప్రశ్నకు 6 మార్కులు కేటాయిస్తారు. కంప్యూటర్ అవెర్నెస్ నుండి 20 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ సెక్షన్ కూడా ఒక్కో ప్రశ్నకు 6 మార్కులు అందిస్తారు. చివరిగా జనరల్ ఇంగ్లీష్ నుండి 10 ప్రశ్నలు ఇవ్వబడతయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు అందిస్తారు.

ఎగ్జామ్ మొత్తం 1000 మార్కులకు జరుగుతుంది. పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలానే సెక్షన్ వారీగా తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు ఋణాత్మక మార్కులు కేటాయిస్తారు.

నిమ్‌సెట్ సబ్జెక్టు /సిలబస్ ప్రశ్నల సంఖ్య & మార్కులు సరైన ప్రశ్నకు మార్కులు కేటాయింపు తప్పు ప్రశ్నలకు మార్కులు కేటాయింపు
మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలు (600 మార్కులు) 12 మార్కులు 3 మార్కులు
అనలిటికల్ ఎబిలిటీ & లాజికల్ రీజనింగ్ 40 ప్రశ్నలు (240 మార్కులు) 6 మార్కులు 1.2 మార్కులు
కంప్యూటర్ అవెర్నెస్ 20 ప్రశ్నలు (120 మార్కులు) 6 మార్కులు 1.2 మార్కులు
జనరల్ ఇంగ్లీష్ 10 ప్రశ్నలు (20 మార్కులు) 4 మార్కులు 1 మార్కు
మొత్తం ప్రశ్నలు & మార్కులు 120 ప్రశ్నలు (600 మార్కులు)

నిమ్‌సెట్ క్వాలిఫై మార్కులు & అడ్మిషన్ ప్రక్రియ

నిమ్‌సెట్ అడ్మిషన్ ప్రక్రియ ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారితంగా ఉంటుంది. మ్యాథమెటిక్స్ యందు జీరో లేదా ఋణాత్మక మార్కులు సాధించిన అభ్యర్థులను అనర్హులుగా గుర్తిస్తారు. అలానే మ్యాథమెటిక్స్ యందు గరిష్ట మార్కులు పొందిన అభ్యర్థులకు మెరిట్ జాబితా యందు మొదటి ప్రాధన్యత కల్పిస్తారు. ఈ సెక్షన్ యందు సమమైన స్కోరు సాధించిన అభ్యర్థులను తర్వాత సెక్షన్ సాధించిన మార్కుల ఆధారంగా ప్రాధన్యత కల్పిస్తారు.

సీట్ల కేటాయింపు లోకల్ మరియు వివిధ కుల రిజర్వేషన్ కోటా వారీగా నిర్వహిస్తారు. మెరిట్ జాబితాలో అర్హుత పొందిన వారు తర్వాత దశలో ఎంసీఏ కౌన్సలింగ్ ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది . రిజల్ట్ వెలువడిన తర్వాత రోజు నుండి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది.

Advertisement

Post Comment