టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ
Admissions TS CETs

టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ

టీఎస్ ఐసెట్ 2024 పరీక్ష షెడ్యూల్ వెలువడింది. తెలంగాణ యూనివర్సిటీలు మరియు మానేజ్మెంట్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు కల్పించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఐసెట్ అనగా ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. ఈ ఏడాది టీఎస్ ఐసెట్ పరీక్షను జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు.

టీఎస్ ఐసెట్ పరీక్షను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కనుసన్నలలో శ్రీ కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో 2 గంటల 30 నిమిషాల వ్యవధిలో 200 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. పరీక్షలో సెక్షన్ A మరియు సెక్షన్ B తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉంటాయి. సెక్షన్ C కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది.

Exam Name TS ICET 2024
Exam Type Entrance Exam
Exam For Admission for MBA, MCA
Exam Date 4, 5 June 2024
Exam Duration 2.30 Hours
Exam Level State Level (Telangana)

టీఎస్ ఐసెట్ 2024 సమాచారం

టీఎస్ ఐసెట్ ద్వారా అడ్మిషన్ పొందే కోర్సులు

  • మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ).
  • మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ)

టీఎస్ ఐసెట్ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారత పౌరులయి ఉండాలి. అలానే తెలంగాణ యూనివర్సిటీలకు సంబంధించి లోకల్ లేదా నాన్ లోకల్ నియమాలను సంతృప్తి పరచాలి.
  • అడ్మిషన్ పొందే యూనివర్సిటీ యొక్క నియమ అర్హుతలను అభ్యర్థి కలిగి ఉండాలి.
  • 50 శాతం మార్కులతో యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 10+2+3 విధానంలో అడ్మిషన్ సమయానికి ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది.
  • ఎంబీఏ ప్రవేశాలకోసం దరఖాస్తు చేసుకునే వారు పదిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదువుకుని ఉండాలి.
  • ఎంసీఏ ప్రవేశాలకోసం దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదుకుని ఉండాలి.
  • ఎంసీఏ-2 వ ఏడాదిలో డైరెక్ట్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు బీసీఏ లేదా ఐటీ/సీఎస్ విద్యార్థులు ఇంటర్ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదువుకుని ఉండాలి.

టీఎస్ ఐసెట్ 2024 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 07 మార్చి 2024
దరఖాస్తు చివరి తేదీ 30 ఏప్రిల్ 2024
హాల్ టికెట్ డౌన్‌లోడ్ మే 2024
పరీక్ష తేదీ 4 & 5 జూన్ 2024
ఫలితాలు జూన్ 2024
కౌన్సిలింగ్ జులై 2024
పరీక్ష సమయం
ఉదయం 10:00 AM TO 12:30 PM
మధ్యాహ్నం 02:30 PM TO 05:00 PM

టీఎస్ ఐసెట్ దరఖాస్తు ఫీజు

కేటగిరి రిజిస్ట్రేషన్ ఫీజు
జనరల్ కేటగిరి 650/-
ఎస్సీ, ఎస్టీలకు 450/-
  • 250/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: 17 మే 2024
  • 500/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: 27 మే 2024

దరఖాస్తు రుసుములు ఏపీ ఆన్‌లైన్‌, టీఎస్ ఆన్‌లైన్‌, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు సమయంలో ఉండే అదనపు రుసుములు అభ్యర్థులే చెల్లించవల్సి ఉంటుంది.

టీఎస్ ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేయండి

తెలంగాణ ఐసెట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్‌ పద్దతిలో ఉంటుంది. తెలంగాణ అధికారిక ఐసెట్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ కింది వివరాలు అందుబాటులో ఉంచుకోండి.

  • ఉత్తీర్ణత సాధించిన పరీక్ష హాల్ టికెట్ నెంబర్ (డిగ్రీ)
  • టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్
  • పుట్టిన తేదీ వివరాలు
  • కేటగిరి వివరాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు)
  • ఆధార్ నెంబర్
  • పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు
  • ఆదాయ దృవపత్రం & రేషన్ కార్డు నెంబర్
  • స్టడీ మరియు రెసిడెన్సీ సర్టిఫికెట్లు

టీఎస్ ఐసెట్ దరఖాస్తు ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రెండవ దశలో అడిగిన వివరాలు పూరించి దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి. దరఖాస్తు పూర్తిచేసే ముందు మీరు ఇచ్చిన వివరాలు మరోమారు సరిచూసుకోండి.

దరఖాస్తు చివరి దశలో మీ దరఖాస్తు ప్రింటవుట్ తీసుకోవటం ద్వారా మొత్తం దరఖాస్తు ప్రక్రియ  పూర్తివుతుంది. మీరు తీసుకున్న ప్రింటవుట్ పై తాజాగా తీసిన మీ ఫొటోగ్రాఫ్ అతికించి, మీరు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ లేదా గ్రేజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించి పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ కు అందించవల్సి ఉంటుంది.

టీఎస్ ఐసెట్ రీజనల్ ఎగ్జామ్ సెంటర్లు

  • హైదరాబాద్ వెస్ట్ : కూకట్పల్లి, పటాన్చెరు, గండిపేట, మొయినాబాద్.
  • హైదరాబాద్ నార్త్ : మేడ్చల్, గండిమైసమ్మ
  • హైదరాబాద్ సెంట్రల్ : అబిడ్స్, తార్నాక.
  • హైదరాబాద్ ఈస్ట్ : ఘట్కేసర్, కీసర.
  • హైదరాబాద్ సౌత్-ఈస్ట్ : ఎల్బీ నగర్, హయత్నగర్, పెద్ద అంబర్పేట్, ఇబ్రహీంపట్నం, రామోజీ ఫిలిం సిటీ.
  • ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, కోదాడ, నిజామాబాద్, సిద్దపేట, వరంగల్.
  •  ఆంధ్రప్రదేశ్ : తిరుపతి. విజయవాడ, కర్నూల్, విశాఖపట్నం.

టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ నమూనా

ఐసెట్ పరీక్ష పూర్తి కంప్యూటర్ ఆధారంగా జరుగుతుంది. 200 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు 150 నిమిషాల వ్యవధిలో సమాధానం చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ప్రధానంగా వెర్బల్ మరియు మాథమెటికల్ నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని అభ్యర్థి యొక్క క్రమబద్ధమైన ఆలోచన సామర్ధ్యాన్ని అంచనా వేచే విధంగా ఉంటుంది.

ఈ పరీక్షలో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. ఈ మూడు సెక్షనాలలో అనలైటికల్ ఎబిలిటీ, మాథమెటికల్ ఎబిలిటీ మరియు కమ్యూనికేషన్ ఎబిలిటీ కి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ పరీక్ష పూర్తి స్వరూపం ఈ కింది పట్టిక ద్వారా తెలుసుకుందాం.

AP-ICET-EXAM-PATTERN

టీఎస్ ఐసెట్ క్వాలిఫై మార్కులు & ర్యాంకింగ్ విధానం

టీఎస్ ఐసెట్ పరీక్షలో 25 శాతంకు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులందరిని ర్యాంకింగు కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు యెటువంటి క్వాలిఫై మార్కులు లేవు. ఎంసెట్ హాజరైన వారందరికీ వారి కోటా అనుసారం ప్రవేశాలు కల్పిస్తారు. ఇకపోతే ఐసెట్ మార్కుల లెక్కింపు నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. వివిధ సెషన్లలో అభ్యర్థులకు వచ్చిన మార్కులును నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా గణించి కేటగిరి వారీగా, అర్హుత నిబంధలను అనుచరించి తుది మెరిట్ జాబితా తయారుచేస్తారు.

అభ్యర్థుల మార్కులు సమమైనప్పుడు సెక్షన్ A, Bలలో వచ్చిన మెరిట్ పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికి సమమైతే అధిక వయసు ఉన్న అభ్యర్థులకు మొదట ప్రాధన్యత ఇస్తారు. ఐసెట్ ర్యాంకు కేవలం ఈ ఏడాది తెలంగాణలో ఉన్న కాలేజీలు మరియు యూనివర్సిటీలలో అడ్మిషన్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఫలితాలు ప్రకటన జరిగిన ఇది పది రోజుల్లో ఐసెట్ అధికారిక వెబ్‌సైట్ లో ర్యాంకు కార్డుతో పాటు కౌన్సిలింగ్ షెడ్యూల్ అందుబాటులో ఉంచబడుతుంది.

Where,
SASD: Sum of Average (A) and Standard Deviation (SD) of the subject of a session in which the candidate appeared.
GASD: Sum of Average (A) and Standard Deviation (SD) of all the candidates across all sessions of the subject put together.
STA: Average mark of the top 0.1% of the candidates in the subject of a session in which the candidate appeared.
GTA: Average mark of the top 0.1% of all the candidates across all the sessions of the subject put together.

Post Comment