టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2022
Latest Jobs TSPSC

టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2022

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా గిరిజన సంక్షేమ శాఖ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖలో దాదాపు 581 వెల్ఫేర్ ఆఫీసర్లు, వార్డెన్లు, మాట్రాన్ మరియు లేడీ సూపరింటెండెంట్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ 06 జనవరి 2023 నుండి 27 జనవరి 2023 మధ్య చేపట్టనున్నారు.

టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల ఖాళీలు

ఖాళీ పోస్టులను కమ్యూనిటీ వారీగా, వివిధ కోటాల వారీగా మరియు మల్టీ జోనల్ వారీగా భర్తీ చేస్తారు.

ట్రైబల్ హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ I - 5 ఖాళీలు వార్డెన్ గ్రేడ్ I (డిజబుల్డ్ & సీనియర్ సిటిజెన్) - 5 ఖాళీలు
ట్రైబల్ హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ II - 106 ఖాళీలు మాట్రాన్ గ్రేడ్ I (డిజబుల్డ్ & సీనియర్ సిటిజెన్) - 3 ఖాళీలు
ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ II (మహిళలు) - 70 ఖాళీలు వార్డెన్ గ్రేడ్ II (డిజబుల్డ్ & సీనియర్ సిటిజెన్) - 3 ఖాళీలు
ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ II (పురుషులు) - 228 ఖాళీలు మాట్రాన్ గ్రేడ్ II (డిజబుల్డ్ & సీనియర్ సిటిజెన్) - 2 ఖాళీలు
బీసీ హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ II - 140 ఖాళీలు లేడీ సూపరింటెండెంట్ ఆఫీసర్ (చైల్డ్ డెవలప్మెంట్) -19 ఖాళీలు
మొత్తం ఖాళీలు  581 పోస్టులు 

టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
  • డిస్టెన్స్ మరియు ఓపెన్ డిగ్రీ ద్వారా పీజీ పూర్తిచేసిన వారు యూజీసీ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు 18 నుండి 44ఏళ్ళ మధ్య ఉండాలి. కమ్యూనిటీ కోటా పరిధిలో వయోపరిమితి సడలింపు ఉంటుంది.

టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 06 జనవరి 2023
దరఖాస్తు తుది గడువు 27 జనవరి 2023
హాల్ టికెట్ జూన్/జులై 2023
ఎగ్జామ్ తేదీ జూన్/జులై 2023
ఫలితాలు సెప్టెంబర్ 2023

టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ దరఖాస్తు ఫీజు

దరఖాస్తు రుసుము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ విధానంలో అందుబాటులో ఉంటుంది. పరీక్ష రుసుము చెల్లించిన దరఖాస్తులు మాత్రమే పరిగణంలోకి తీసుకోబడతాయి.

ఫీజు జనరల్ అభ్యర్థులు నిరుద్యోగులు
అప్లికేషన్ ఫీజు 200/- 200/-
ఎగ్జామ్ ఫీజు 80/- మినహాయింపు

టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ దరఖాస్తు విధానం

టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఓటీపీఆర్ ఐడీ ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐడీ లేని వారు కొత్తగా ఓటిపీఆర్ ఐడీ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ మరియు ఇతర సంబంధిత సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలి.

టీఎస్పీఎస్సీ పోర్టల్ యందు ఉన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లింక్ ఉపయోగించించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. మొదటిగా ఓటిపిఆర్ మరియు పుట్టిన తేదీ వివరాలు పొందుపర్చగానే అభ్యర్థుల డేటా లోడ్ అవుతుంది.

అందులో ఇదివరకే మీరు పొందుపర్చిన వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు మరోమారు సరిచూసుకుని, అవసరమయ్యే ఇతర అవసరాలను అందించాల్సి ఉంటుంది. అదే సమయంలో  దరఖాస్తు చేస్తున్న పోస్టు మరియు ఎగ్జామ్ సెంటర్ వివరాలు అందించాల్సి ఉంటుంది. చివరిగా దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తివుతుంది.

టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ సెంటర్లు

  • ఆదిలాబాద్
  • కరీంనగర్
  • వరంగల్
  • ఖమ్మం
  • HMDA అధికార పరిధితో సహా హైదరాబాద్
  • నిజామాబాద్
  • మహబూబ్ నగర్
  • మెదక్
  • నల్గొండ

టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ నమూనా

టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్దతిలో నిర్వహించనున్నారు. రాతపరీక్ష రెండు అంచెలలో పేపర్ I, పేపర్ II లుగా జరుపుతారు. పేపర్ I యందు జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ సంబంధించి 150 ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన జవాబు చేసిన ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు.

పేపర్ II బ్యాచిలర్ డిగ్రీ లెవెల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు సంబంధించి ఉంటుంది. ఇందులో మొత్తం 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. పరీక్ష ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 2.30 గంటల సమయం కేటాయిస్తారు.

పేపర్ పేరు సబ్జెక్టు / సిలబస్ ప్రశ్నలు & మార్కులు సమయం
పేపర్ I జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు (150 మార్కులు) 2.30 గంటలు
పేపర్ II ఎడ్యుకేషన్ 150 ప్రశ్నలు (300 మార్కులు) 2.30 గంటలు

టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఎంపిక ప్రక్రియ

టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల నియామక ప్రక్రియ రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారితంగా ఉంటుంది. రాతపరీక్షలో అర్హుత పొందిన అభ్యర్థులను పోస్టుల ఖాళీల వారీగా, జోన్ల వారీగా, కమ్యూనిటీ వారీగా, ఇతర రిజర్వేషన్ కోటాల వారీగా షార్ట్ లిస్టు రూపొందిస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడ్డ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపి తుది ఎంపిక చేపడతారు.

కేటగిరి & రిజర్వేషన్ కేటగిరి & రిజర్వేషన్ 
బీసీ - 29%
ఎస్సీ - 15%
ఎస్టీ - 7%
EWS - 10%
Sports - 2%
PH - 4%.

క్వాలిఫైయింగ్ మార్కులు

  • జనరల్, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్, మాజీ సైనికులు - 40% మార్కులు తప్పనిసరి.
  • బీసీ అభ్యర్థులు లకు 35 శాతం మార్కులు తప్పనిసరి.
  • ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు అవసరం

టీఎస్పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పేపర్ 1 సిలబస్

1. Current Affairs – Regional, National and International
2. International Relations and Events.
3. General Science; India‟s achievements in Science and Technology
4. Environmental issues and Disaster Management
5. Economy of India and Telangana
6. Geography of India with a focus on Telangana
7. Indian Constitution and Polity with a focus on local self Government
8. Society, Culture, Heritage, Arts and Literature of Telangana
9. Policies of Telangana State
10.History of Modern India with a focus on Indian National Movement
11.History of Telangana with special emphasis on Movement for Telangana Statehood

Post Comment