టీఎస్ పది 2022 ఫలితాలు విడుదల | టీఎస్ పది ఫలితాలు పొందండి
School Education

టీఎస్ పది 2022 ఫలితాలు విడుదల | టీఎస్ పది ఫలితాలు పొందండి

టీఎస్ పది ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి విడుదల చేసారు. 2021-22 పది పరీక్షలు మే 23 నుండి 1 జూన్ 2022 వరకు నిర్వహించారు. ఈ ఏడాది పది పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,03575 మంది విద్యార్థులు హాజరవ్వగా, ఇందులో 4,53210 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ఈ ఏడాది పది ఫలితాలలో తెలంగాణ విద్యార్థులు మొత్తంగా 90 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసారు.

టీఎస్ పది 2022 ఫలితాలు విడుదల

లింక్ 1

లింక్ 2

టీఎస్ పది పరీక్షలకు 255,433 మంది బాలురులు హాజరవ్వగా,  వారిలో 223,779 మంది పరీక్షల్లో ఉత్తీర్ణత పొందారు. అలానే బాలికలు 248,146 మంది బాలికలు హాజరు అవ్వగా, వారిలో 229,422 మంది ఉత్తీర్ణత సాధించారు. అలానే జండర్ వారీగా చూసుకుంటే బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా, బాలురులు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించారు.

టీఎస్ పది రీకౌంటింగ్ ప్రక్రియ &  రీవెరిఫికేషన్ తేదీలు

రీకౌంటింగ్ ప్రక్రియ & రీవెరిఫికేషన్ కోసం ఈ నెల ఆఖరు నుండి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. అలానే సప్లమెంటరీ పరీక్షలు ఆగష్టు 1 నుండి ఆగష్టు 10 వరకు నిర్వహించనున్నారు.

Post Comment