తెలుగు జీకే క్విజ్ – నదులు మరియు ఆనకట్టలు
Study Material Telugu Gk

తెలుగు జీకే క్విజ్ – నదులు మరియు ఆనకట్టలు

1. భాక్రా నంగల్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు

  1. మహానది
  2. సట్లెజ్ నది
  3. బియాస్ నది
  4. దామోదర నది
సమాధానం
2. సట్లెజ్ నది

2. హిరాకుడ్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. బీహార్
  2. మహారాష్ట్ర
  3. ఒడిశా
  4. కర్ణాటక
సమాధానం
3. ఒడిశా

3. తుంగభద్ర ప్రాజెక్ట్ ఏ రెండు రాష్ట్రాల ఉమ్మడి పథకం ?

  1. ఆంధ్రప్రదేశ్ & తమిళనాడు
  2. ఆంధ్రప్రదేశ్ & కర్ణాటక
  3. తమిళనాడు & కర్ణాటక
  4. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ
సమాధానం
2. ఆంధ్రప్రదేశ్ & కర్ణాటక

4. గండక్ ప్రాజెక్టు ద్వారా లబ్ది పొందుతున్న పొరుగు దేశం ఏది ?

  1. భూటాన్
  2. నేపాల్
  3. బాంగ్లాదేశ్
  4. ఆఫ్ఘనిస్తాన్
సమాధానం
2. నేపాల్

5. ఇందిరా గాంధీ కాలువ ఏ రాష్టంలో ఉంది ?

  1. కర్ణాటక
  2. ఉత్తరప్రదేశ్
  3. రాజస్థాన్
  4. ఒడిశా
సమాధానం
3. రాజస్థాన్

6. కింది వాటిలో నర్మదా నదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది ?

  1. భాక్రా ఆనకట్ట
  2. తెహ్రీ డ్యామ్
  3. సర్దార్ సరోవర్ డ్యామ్
  4. రంజిత్ సాగర్ ఆనకట్ట
సమాధానం
3. సర్దార్ సరోవర్ డ్యామ్

7. మేధా పాట్కర్ యొక్క నర్మదా బచావో ఆందోళన దేనికి చెందింది ?

  1. ఇందిరా సాగర్ జలవిద్యుత్ ప్రాజెక్ట్
  2. సర్దార్ సరోవర్ డ్యామ్
  3. తెహ్రీ డ్యామ్
  4. తుంగభద్ర డ్యామ్
సమాధానం
2. సర్దార్ సరోవర్ డ్యామ్

8. రవిశంకర్ సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు ?

  1. మహానది (ఒడిశా)
  2. గోదావరి (మహారాష్ట్ర)
  3. గంగా నది (బీహార్)
  4. మహానది (ఛత్తీస్‌గఢ్‌)
సమాధానం
4. మహానది (ఛత్తీస్‌గఢ్‌)

9. దేశంలో అతి పొడవైన రాతి ఆనకట్ట ఏది ?

  1. శ్రీశైలం ప్రాజెక్ట్
  2. భాక్రా & నంగల్ ప్రాజెక్టు
  3. నాగార్జున సాగర్
  4. తుంగభద్ర డ్యామ్
సమాధానం
3. నాగార్జున సాగర్

10. తెహ్రీ డ్యామ్ ఏ నదిపై నిర్మించారు ?

  1. సబర్మతి నది
  2. భాగీరథి నది
  3. కోసి నది
  4. కావేరి నది
సమాధానం
2. భాగీరథి నది

11. కింది వాటిలో అరేబియా సముద్రంలో కలిసే నది ఏది ?

  1. కావేరి నది
  2. మహి నది
  3. బైతరణి నది
  4. దామోదర నది
సమాధానం
2. మహి నది

12. కోల్‌కతా నౌకాశ్రయంకు పరోక్షంగా సహాయపడుతున్న బ్యారేజ్ ఏది ?

  1. పంచేట్ ఆనకట్ట
  2. తెహ్రీ డ్యామ్
  3. ఫరక్కా బ్యారేజీ
  4. దుర్గాపూర్ బ్యారేజ్
సమాధానం
3. ఫరక్కా బ్యారేజీ

13. ఫరక్కా ఒప్పందంపై సంతకం చేసిన దేశాలు ఏవి ?

  1. ఇండియా & నేపాల్
  2. ఇండియా & పాకిస్తాన్
  3. ఇండియా & మయన్మార్
  4. ఇండియా & బంగ్లాదేశ్
సమాధానం
4. ఇండియా & బంగ్లాదేశ్

14. దేశంలో అత్యధిక పెద్ద ఆనకట్టలు ఉన్న రాష్ట్రం ?

  1. మహారాష్ట్ర
  2. పంజాబ్
  3. గుజరాత్
  4. మధ్యప్రదేశ్
సమాధానం
1. మహారాష్ట్ర

15. భిలాయ్ స్టీల్ ప్లాంటుకు నీరు అందించే డ్యామ్ ఏది  ?

  1. భాక్రా & నంగల్ ప్రాజెక్టు
  2. హిరాకుడ్ ప్రాజెక్ట్
  3. సర్దార్ సరోవర్ డ్యామ్
  4. రవిశంకర్ సాగర్ ఆనకట్ట
సమాధానం
4. రవిశంకర్ సాగర్ ఆనకట్ట

16. బెంగాల్ దుఖఃదాయిని అని ఏ నదిని పిలుస్తారు ?

  1. హుగ్లీ నది
  2. గంగ నది
  3. దామోదర నది
  4. చంబల్ నది
సమాధానం
3. దామోదర నది

7. కింది వాటిలో చంబల్ నదిపై ఉన్న బ్యారేజ్ ఏది ?

  1. తెహ్రీ డ్యామ్
  2. కోటా బ్యారేజ్
  3. ఫరక్కా బ్యారేజీ
  4. దుర్గాపూర్ బ్యారేజ్
సమాధానం
2. కోటా బ్యారేజ్

18. కింది వాటిలో ఇడుక్కి ఆనకట్టకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?

  1. ఇడుక్కి ఆనకట్ట కేరళలో ఉంది
  2. ఇడుక్కి ఆనకట్ట పెరియార్ నదిపై ఉంది
  3. కురవన్ & కురాతి పర్వతాల మధ్య ఉంది
  4. పైవి అన్ని సరైనవి
సమాధానం
4. పైవి అన్ని సరైనవి

19. ఆసియాలో మొదటి ఆర్చ్ డ్యామ్ ఏది ?

  1. శ్రీశైలం ప్రాజెక్ట్
  2. నాగార్జున సాగర్
  3. ఇడుక్కి డ్యామ్
  4. తుంగభద్ర డ్యామ్
సమాధానం
3. ఇడుక్కిడ్యామ్

20. మంజీరా నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ ఏది ?

  1. నిజాం సాగర్ ప్రాజెక్ట్
  2. నాగార్జున సాగర్ డ్యామ్
  3. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్
  4. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
సమాధానం
1. నిజాం సాగర్ ప్రాజెక్ట్

21. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు ?

  1. మంజీరా నది
  2. శబరి నది
  3. గోదావరి నది
  4. కృష్ణా నది
సమాధానం
3. గోదావరి నది

22. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండే డ్యామ్ ఏది ?

  1. జురాలా ప్రాజెక్ట్
  2. నాగార్జున సాగర్ డ్యామ్
  3. సోమశిల ఆనకట్ట
  4. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్
సమాధానం
3. సోమశిల ఆనకట్ట

23. కింది వాటిలో దేనిని నీలం సంజీవ రెడ్డి ప్రాజెక్ట్ అంటారు ?

  1. శ్రీశైలం ప్రాజెక్ట్
  2. ఇండియా & పాకిస్తాన్
  3. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్
  4. తుంగభద్ర ప్రాజెక్ట్
సమాధానం
1. శ్రీశైలం ప్రాజెక్ట్

24. దేశంలో అతి పొడవైన గ్రావిటీ డ్యామ్ ఏది ?

  1. హిరాకుడ్ ప్రాజెక్ట్
  2. నాగార్జున సాగర్
  3. తుంగభద్ర ప్రాజెక్ట్
  4. భాక్రా నంగల్ ఆనకట్ట
సమాధానం
4. భాక్రా నంగల్ ఆనకట్ట

25. కింది వాటిలో అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఏది ?

  1. భాక్రా & నంగల్ ప్రాజెక్టు
  2. హిరాకుడ్ ప్రాజెక్ట్
  3. తావా ప్రాజెక్ట్
  4. కోసి ప్రాజెక్ట్
సమాధానం
4. కోసి ప్రాజెక్ట్

26. తవా రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. పశ్చిమ బెంగాల్
  2. మధ్యప్రదేశ్
  3. గుజరాత్
  4. అరుణాచల్ ప్రదేశ్
సమాధానం
2. మధ్యప్రదేశ్

27. తుల్బుల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. ఉత్తరాఖండ్
  2. హర్యానా
  3. జమ్మూ & కాశ్మీర్
  4. పంజాబ్
సమాధానం
3. జమ్మూ & కాశ్మీర్

28. తెలుగు గంగ ప్రాజెక్ట్ సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?

  1. రాయలసీమ & నెల్లూరు జిల్లాలకు సాగునీరు అందిస్తుంది
  2. చెన్నై నగరానికి త్రాగునీరు అందిస్తుంది
  3. తమిళనాడు & ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్ట్
  4. పైవి అన్ని సరైనవి
సమాధానం
4. పైవి అన్ని సరైనవి

29. విద్యాసాగర్ సేతు ఏ నదిపై ఉంది ?

  1. నర్మదా నది
  2. గోదావరి నది
  3. హుగ్లీ నది
  4. మూసి నది
సమాధానం
3. హుగ్లీ నది

30. శారదా కాలువ వ్యవస్థ ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. ఉత్తర ప్రదేశ్
  2. పంజాబ్
  3. బీహార్
  4. తమిళనాడు
సమాధానం
1. ఉత్తర ప్రదేశ్

Post Comment