పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేయండి. పీఎన్‌బీ దేశంలో ఏ బ్యాంకూ అందివ్వని విభిన్న ఎడ్యుకేషన్ రుణ పథకాలను అందిస్తుంది. కేజీ నుండి పీజీ వరకు అన్ని రకాల విద్యార్థులకు అవసరమయ్యే 14 రకాల రుణ పథకాలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో అందుబాటులో ఉన్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంకు తక్కువ వడ్డీ రేట్లు, సులభతరమైన డాక్యుమెంటేషన్, అన్ని రకాల కోర్సుల కవరేజీ వంటి అద్భుత ఫీచర్లతో దేశ వ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షిస్తుంది. ఎడ్యుకేషన్ రుణాలకు సంబంధించి సిపార్సు చేసే టాప్ ఐదు బ్యాంకులలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉంటుంది.
పీఎన్‌బీ ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేయండి
ప్రస్తుతం పీఎన్‌బీ విద్యా రుణాలు అన్నీ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా అందిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సదురు అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి, విద్యార్థి అర్హుతను నిర్ణహిస్తారు. అర్హుత పొందిన విద్యార్థులకు 10 నుండి 15 రోజులలో లోన్ మంజూరు చేస్తారు.
రెండవ విధానంలో విద్యార్థులు నేరుగా దగ్గరలో ఉండే స్టేట్ పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎన్‌బీ బ్రాంచు మేనేజర్ లేదా లోన్ సెక్షన్ అధికారులను కలవడం ద్వారా ఎడ్యుకేషన్ లోన్లకు సంబంధించి పూర్తి వివరాలు అందజేస్తారు. మీరు అర్హులైతే సంబంధిత సర్టిఫికెట్లు సేకరించి, పరిశీలించి విద్యా రుణనాన్ని మంజూరు చేస్తారు.
పీఎన్‌బీ ఎడ్యుకేషన్ లోన్ కోసం జత చేయాల్సిన సర్టిఫికెట్లు
- చదివిన విద్యాసంస్థ నుంచి బదిలీ ధ్రువపత్రం (టీసీ).
- మార్కుల జాబితా (ఉత్తీర్ణత సర్టిఫికెట్). ఇంతవరకు పొందిన ఉపకార వేతన పత్రాలు.
- ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షా ర్యాంకు కార్డు. ప్రవేశ అనుమతి పత్రాలు (అడ్మిషన్ సర్టిఫికెట్).
- చదవాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు. తల్లి/ తండ్రి/ సంరక్షుడు/ విద్యార్థికి సంబంధించిన పాస్ ఫోటోలు.
- విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి వేతన ధ్రువపత్రాలు, ఆస్తి వివరాలు.
- నివాస ధృవీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ లాంటివి జత చేయాలి.
- విదేశీ చదువులు : చెలుబాటు అయ్యే పాసుపోర్టు, i20వీసా, అడ్మిషన్ పొందిన విదేశీ యూనివర్సిటీ అడ్మిట్ లెటర్, గ్యాప్ సర్టిఫికేట్, జీఆర్ఈ, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్, టోఫెల్, శాట్ పరీక్షలలో ఏదోకటి ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ఇండియా మరియు విదేశాలలో చదువుకునే విద్యార్థుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు 14 రకాల రుణ పథకాలను అందుబాటులో ఉంచింది. ఈ తొమ్మిది రుణ పథకాల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
1. పీఎన్‌బీ ప్రవాసీ శిక్షా ఎడ్యుకేషన్ లోన్
Education Loan Scheme For Overseas Citizens In India (OCI)
ఇండియాలో చదువుకునే ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులకు పీఎన్‌బీ ప్రవాసి శిక్షా రుణం అందిస్తారు.
Loan Amount | Need Based (విద్యార్థుల అవసరానికి తగ్గట్టు) |
Courses Covered | గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో ఫుల్ టైమ్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సులు. అలానే పార్ట్ టైమ్ రీసెర్చ్ & ఇతర సర్టిఫికేటెడ్ కోర్సులకు కూడా ఈ ఋణం మంజూరు చేస్తారు. ఇనిస్టిట్యూట్ల జాబితా |
Expenses Covered |
|
Interest Rate | 7.30 % నుండి 9.30% (మహిళా విద్యార్థులకు 0.50% రాయితీ అందిస్తారు) |
Processing Charges | మంజూరు చేసిన లోనులో 1% (కనిష్టంగా 10,000/-), డాక్యుమెంట్ చార్జెస్ 450/- |
Margin | 20% మార్జిన్ ఉంటుంది. అంటే కోర్సు యొక్క 20% ఫీజు రుసుము విద్యార్థి భరించాల్సి ఉంటుంది. |
Security | రుణ మొత్తానికి కనీసం 125% విలువ కలిగిన స్థిరమైన ఆస్తి, హామీదారు పేరిట భారతదేశంలో ఉండాలి. |
Repayment | రీపెమెంట్, కోర్సు పూర్తయినా 6 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 10 ఏళ్ల నిడివిలో పూర్తిచేయాల్సి ఉంటుంది. |
2. పీఎన్‌బీ సరస్వతి ఎడ్యుకేషన్ లోన్
(Above Rs. 7.50 lakhs)
Education Loan Scheme For Students Pursuing Higher Education In India.
ఇండియాలో చదువుకునే ప్రతిభావంతులైన దేశీయ విద్యార్థులకు పీఎన్‌బీ సరస్వతి రుణం అందిస్తారు.
Loan Amount | 7.5 లక్షల నుండి గ్లోబల్ ఎడ్-వాన్టేజ్ స్కీమ్ కింద గరిష్టంగా 1.5 కోట్ల వరకు రుణం అందిస్తారు. |
Courses Covered | UGC/ Govt. / AICTE/ AIBMS/ ICMR గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో యూజీ, పీజీ మరియు పీజీ డిప్లొమా కోర్సులు. అలానే ICWA, CA, CFA కోర్సులు. IIMs, IITs, IISc, XLRI. NIFT, NID నిర్వహించే కోర్సులు. అలానే Aeronautical, pilot training, shipping Nursing కోర్సులు. |
Expenses Covered |
|
Interest Rate | 7.5 లక్షల లోపు రుణాలకు RLLR+2.00%, 7.5 లక్షలు దాటే రుణాలకు RLLR+2.75% |
Processing Charges | మంజూరు చేసిన లోనులో 1% (కనిష్టంగా 10,000/-). దీన్ని తిరిగి విద్యార్థికి చెల్లిస్తారు. |
Margin | 4 లక్షల లోపు రుణాలకు ఎటువంటి మార్జిన్ ఉండదు. 4 లక్షలు దాటినా రుణాలకు 5% మార్జిన్ ఉంటుంది. అంటే కోర్సు యొక్క 5% ఫీజు రుసుము విద్యార్థి సొంతంగా భరించాల్సి ఉంటుంది. |
Security | 7.5 లక్షల లోపు రుణాలకు విద్యార్థి మరియు తల్లిదండ్రుల హామీ ఉంటె సరిపోతుంది. 7.5 లక్షలు దాటే రుణాలకు తల్లిదండ్రుల హామీతో పాటుగా 3rd పార్టీ హామీ తప్పనిసరి. |
Repayment | రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 15 ఏళ్ల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది. |
3. పీఎన్‌బీ ప్రతిభ ఎడ్యుకేషన్ లోన్
Education Loan For Meritorious Students in Premier Institutes
Loan Amount | తల్లిదండ్రులు / విద్యార్థి తిరిగి చెల్లింపు సామర్థ్యంకు లోబడి గరిష్ట రుణ పరిమితిని నిర్ణయిస్తారు . ఈ పథకానికి అర్హుత పొందే ఇనిస్టిట్యూట్ల జాబితా. |
Courses Covered | పై జాబితో ఉండే బిజినెస్, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో ఉండే అన్ని కోర్సులు |
Expenses Covered |
|
Interest Rate | 7.5 లక్షల లోపు రుణాలకు RLLR+0.25%, 7.5 లక్షలు దాటే రుణాలకు RLLR+0.75% |
Processing Charges | మంజూరు చేసిన లోనులో 1% (కనిష్టంగా 10,000/-). దీన్ని తిరిగి విద్యార్థికి చెల్లిస్తారు. |
Margin | నిర్దిష్ట మార్జిన్ పరిమితి లేదు. |
Security | తల్లిదండ్రులు లేదా సంరక్షకుల హామీ |
Repayment | రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 15 ఏళ్ల నిడివితో పూర్తిచేయాల్సి ఉంటుంది. |
4. పీఎన్‌బీ ఉడాన్ ఎడ్యుకేషన్ లోన్
Education Loan Scheme For Students Pursuing Higher Education Abroad
విదేశీ చదువులకు పోయే భారతీయ విద్యార్థులకు ఉడాన్ లోన్ మంజూరు చేస్తారు
Loan Amount | తల్లిదండ్రులు / విద్యార్థి తిరిగి చెల్లింపు సామర్థ్యంకు లోబడి గరిష్ట రుణ పరిమితిని నిర్ణయిస్తారు . రుణం మంజూరు చేసే విదేశీ యూనివర్సిటీలు |
Courses Covered | జాబ్ ఓరిఎంటేడ్ టెక్నికల్ మరియు ప్రోఫిసినల్ కోర్సులు. MCA, MBA, MS వంటి మానేజ్మెంట్ కోర్సులు. CIMA (లండన్) CPA (యూఎస్ఏ). కోర్సులు. అలానే Aeronautical, pilot training, shipping Nursing కోర్సులు. |
Expenses Covered |
|
Interest Rate | 7.5 లక్షల లోపు రుణాలకు RLLR+2.00%, 7.5 లక్షలు దాటే రుణాలకు RLLR+2.75% |
Processing Charges | మంజూరు చేసిన లోనులో 1% (కనిష్టంగా 10,000/-). దీన్ని తిరిగి విద్యార్థికి చెల్లిస్తారు. |
Margin | 4 లక్షల లోపు రుణాలకు ఎటువంటి మార్జిన్ లేదు. 4 లక్షల దాటే రుణాలకు 15% మార్జిన్ అప్లయ్ చేస్తారు. |
Security | 7.5 లక్షలు దాటే రుణాలకు తల్లిదండ్రులతో సహా 3rd పార్టీ హామీ తప్పనిసరి. |
Repayment | రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 15 ఏళ్ల నిడివితో పూర్తిచేయాల్సి ఉంటుంది. |
5. పీఎన్‌బీ కౌశల్ ఎడ్యుకేషన్ లోన్
Education Loan Scheme For Pursuing Vocational Education & Training
Loan Amount | 5 వేల నుండి గరిష్టంగా 1.5 లక్షల వరకు మంజూరు చేస్తారు. |
Courses Covered | కేంద్ర మరియు రాష్ట్ర పభుత్వాలచే గుర్తింపు కలిగిన ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు |
Expenses Covered |
|
Interest Rate | RLLR+1.50%. |
Processing Charges | మంజూరు చేసిన లోనులో 1% (కనిష్టంగా 10,000/-). దీన్ని తిరిగి విద్యార్థికి చెల్లిస్తారు. |
Margin | Nill |
Security | తల్లిదండ్రులు లేదా సంరక్షకుల హామీ |
Repayment | 50 వేల లోపు రుణాలు మూడేళ్ళ నిడివిలోపు చెల్లించాల్సి ఉంటుంది. 50 వేల నుండి లక్షలోపు రుణాలు 5 ఏళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. లక్ష దాటే రుణాలకు 7 ఏళ్ళు తిరిగి చెల్లింపు వ్యవధి నిర్ణయించారు. |
6. పీఎన్‌బీ హోన్హార్ ఎడ్యుకేషన్ లోన్
`PNB HONHAAR` Education Loan Scheme For Pursuing Higher Education And Skill Development Courses In Delhi
Loan Amount | అవసరానికి తగ్గట్టుగా గరిష్టంగా 10 లక్షల వరకు రుణం అందిస్తారు. |
Courses Covered | దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నత విద్య లేదా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులలో చేరే విద్యార్థులకు అందిస్తారు. |
Expenses Covered |
|
Interest Rate | RLLR + 2.15% |
Processing Charges | మంజూరు చేసిన లోనులో 1% (కనిష్టంగా 10,000/-). దీన్ని తిరిగి విద్యార్థికి చెల్లిస్తారు. |
Margin | NIL |
Security | తల్లిదండ్రులతో సహా 3rd పార్టీ హామీ తప్పనిసరి. |
Repayment | రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 15 ఏళ్ల నిడివితో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొరాటోరియం వ్యవధిలో సాధారణ వడ్డీ వసూలు చేయబడుతుంది. |
7. పీఎన్‌బీ రాయితీ విద్యా రుణం
Concessional Education loan is being provided to students or Persons with Disabilities (PwDs -40%)
Loan Amount | ఇండియాలో చదివే విద్యార్థులకు గరిష్టంగా 10 లక్షల వరకు, విదేశీ చదువులకు గరిష్టంగా 20 లక్షల లోను మంజూరు చేస్తారు. |
Courses Covered | గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి ఫుల్ టైమ్ / పార్ట్ టైమ్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సులు. |
Expenses Covered |
|
Interest Rate | 7.30 % నుండి 9.30% (మహిళా విద్యార్థులకు 0.50% రాయితీ అందిస్తారు) |
Processing Charges | మంజూరు చేసిన లోనులో 1% (కనిష్టంగా 10,000/-). దీన్ని తిరిగి విద్యార్థికి చెల్లిస్తారు. |
Margin | NIL |
Security | తల్లిదండ్రులు లేదా సంరక్షకుల హామీ |
Repayment | రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 7 ఏళ్ల నిడివితో పూర్తిచేయాల్సి ఉంటుంది. |