Advertisement
మ్యాట్ 2024 : నోటిఫికేషన్, ఎగ్జామ్ తేదీలు, ఎగ్జామ్ సరళి
Admissions MBA Entrance Exams

మ్యాట్ 2024 : నోటిఫికేషన్, ఎగ్జామ్ తేదీలు, ఎగ్జామ్ సరళి

మేనేజ్‌మెంట్‌ కోర్సులలో అడ్మిషన్లు కల్పించే మ్యాట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. మ్యాట్ ఎగ్జామ్ యందు అర్హుత పొందటం ద్వారా భారతదేశంలోని 600 పైగా బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ మరియు దాని అనుబంధ మేనేజ్‌మెంట్‌ కోర్సులలో అడ్మిషన్ పొందొచ్చు.

మానవ వనరుల మంత్రిత్వ శాఖ 2003 లో మ్యాట్ పరీక్షను జాతీయస్థాయి మేనేజ్‌మెంట్‌ పరీక్షగా ఆమోదం తెలిపింది. మ్యాట్ స్కోరును జాతీయ స్థాయిలో అన్ని మేనేజ్‌మెంట్‌ కాలేజీలు పరిగణలోకి తీసుకుంటాయి. ఏటా నాలుగు సార్లు నిర్వహించే ఈ పరీక్ష పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Exam Name MAT 2024
Exam Type Entrance Exam
Admission For Management Courses
Exam Date 03/12/2023
Exam Duration 3 Hours
Exam Level National Level

మ్యాట్ 2024 ఎలిజిబిలిటీ

  • మ్యాట్ పరీక్షకు జాతీయ మరియు అంతర్జాతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • విద్యార్థి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
  • గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసేందుకు అర్హులు.

మ్యాట్ 2024 ఎగ్జామ్ మోడ్

మ్యాట్ పరీక్ష ఏటా ఫిబ్రవరి, మే, సెప్టెంబర్ మరియు డిసెంబర్‌ నెలల్లో నాలుగు సార్లు నిర్వహించబడుతుంది. పరీక్ష మూడు విధాలుగా నిర్వహిస్తారు.

  1. ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ (IBT)
  2. పేపర్ బేస్డ్ టెస్ట్ (PBT)
  3. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT)

అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పై వాటిలో ఏదైనా ఒక పరీక్షా విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు లేదా అదనపు రుసుము చెల్లించడం ద్వారా అదనంగా మరో పరీక్షా మోడ్ ని ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది.

మ్యాట్ 2024 షెడ్యూల్

మ్యాట్ పేపర్ బేస్డ్ టెస్ట్ షెడ్యూల్ (పీబీటీ)

దరఖాస్తు చివరి తేదీ 05 డిసెంబర్ 2023
అడ్మిట్ కార్డు 07 డిసెంబర్ 2023
పరీక్ష తేదీ 09 డిసెంబర్ 2023

మ్యాట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షెడ్యూల్ (సీబీటీ -1)

దరఖాస్తు చివరి తేదీ 28 నవంబర్ 2023
అడ్మిట్ కార్డు 30 నవంబర్ 2023
పరీక్ష తేదీ 03 డిసెంబర్ 2023

మ్యాట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షెడ్యూల్ (సీబీటీ -2)

దరఖాస్తు చివరి తేదీ 11 డిసెంబర్ 2023
అడ్మిట్ కార్డు 13 డిసెంబర్ 2023
పరీక్ష తేదీ 16 డిసెంబర్ 2023

మ్యాట్ 20204 దరఖాస్తు రుసుము

దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు , జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.

IBT / PBT / CBT (ఏదైనా ఒక ఎగ్జామ్ మోడ్) Rs 2,100/-
IBT+IBT or
PBT+IBT or
CBT+IBT or
PBT+CBT (డబల్ ఎగ్జామ్ మోడ్)
Rs 3,300/-

మ్యాట్ 2024 దరఖాస్తు విధానం

మ్యాట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మ్యాట్ కు చెందిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మొదటిసారి దరఖాస్తు చేసే అభ్యర్థులు మ్యాట్ పోర్టల్ యందు వ్యక్తిగత అకౌంట్ కోసం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు ఉండాలి.

దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో  మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా  చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో  ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాలు

స్టేట్ ఎగ్జామ్ మోడ్ ఎగ్జామ్ సెంటర్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పేపర్ బేస్డ్ టెస్ట్ (PBT) విశాఖపట్నం, హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT) విశాఖపట్నం, హైదరాబాద్

ఎగ్జామ్ విధానం

MAT ప్రవేశ పరీక్ష CBT, PBT, IBT విధానంలో జరుగుతుంది. IBT ఎగ్జామ్ మోడ్ ని ఎంపిక చేసుకునేవారు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. 2.30 గంటల నిడివితో జరిగే ఈ పరీక్షలో మొత్తం ఐదు విభాగాల నుండి 40 చెప్పున 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి.

ప్రతి ప్రశ్నకు నాలుగు వేరువేరు సమాదానాలు ఉంటాయి. అందులో నుండి ఒక సరైన సమాధానమును గుర్తించాలి. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది. మొత్తం 200 మార్కులకు జరిగే ఈ ప్రవేశ పరీక్ష లో అభ్యర్థి సాధించిన స్కోర్ ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న బిజినెస్ మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంటాయి

Type Of Questions No Of Questions Total Marks
లాంగ్వేజ్ కంప్రహెన్షన్ 40 ప్రశ్నలు 40 మార్కులు
ఇంటిలిజెన్స్ & క్రిటికల్ రీజనింగ్ 40 ప్రశ్నలు 40 మార్కులు
మ్యాథమెటికల్ స్కిల్స్ 40 ప్రశ్నలు 40 మార్కులు
డేటా అనాలిసిస్ & సఫీసెన్సీ 40 ప్రశ్నలు 40 మార్కులు
ఇండియన్ & గ్లోబల్ ఎన్విరాన్మెంట్ 40 ప్రశ్నలు 40 మార్కులు
మొత్తం ప్రశ్నలు = 200 మొత్తం మార్కులు =200

Post Comment