టీఎస్‌పీఎస్సీ గ్రూపు 2 ఎగ్జామ్ విధానం & సిలబస్
Telangana

టీఎస్‌పీఎస్సీ గ్రూపు 2 ఎగ్జామ్ విధానం & సిలబస్

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూపు II పోస్టుల నియామక ప్రక్రియ రెండు దశలలో జరుగుతుంది. మొదటి దశలో 600 మార్కులకు ఆబ్జెక్టివ్ రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హుత పొందివారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి వివిధ రిజర్వేషన్ల వారీగా తుది నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు. దరఖాస్తు  ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లు అయితే రాతపరీక్షకు ముందు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంటుంది.

టీఎస్‌పీఎస్సీ గ్రూపు 2 ద్వారా భర్తీ చేసే పోస్టులు

  • మున్సిపల్ కమీషనర్ గ్రేడ్ III
  • అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గ్రేడ్  II
  • సబ్ రిజిస్ట్రార్
  • ఎక్సటెన్షన్ ఆఫీసర్
  • అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
  • ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ (
  • డిప్యూటీ తహశీల్దార్
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్
  • ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I
  • అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
  • డిస్ట్రిక్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్
  • అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్
  • మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-III
  • అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO))

టీఎస్‌పీఎస్సీ గ్రూపు 2 రాతపరీక్ష విధానం

గ్రూపు II పోస్టుల నియామక ప్రక్రియ రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు. రాతపరీక్ష 600 మార్కులకు 4 పేపర్లుగా నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ 150 మార్కులకు జరుగుతుంది.  ప్రతి పేపర్ 150 ప్రశ్నలతో, 2.30 గంటల నిడివితో పూర్తిచేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఒక్కో పేపర్ కోసం వివరంగా తెలుసుకుందాం.

జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ ( పేపర్ పేపర్ I )

పేపర్ I లో భాగంగా 150 మార్కులకు జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ సంబందించిన అంశాలతో నిర్వహస్తారు. ప్రశ్న పత్రం మూడు సెక్షన్లుగా, ఒక్కో సెక్షన్ యందు 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 2.30 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు 150 మార్కులు 2.30 గంటలు

హిస్టరీ, పాలిటి & సొసైటీ ( పేపర్ II )

పేపర్ II హిస్టరీ, పాలిటి మరియు సొసైటీ అంశంలో కూడిన ఆబ్జెక్టివ్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుండి 50 ప్రశ్నలు చెప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు.

పరీక్ష నిడివి 2.30 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్ తో ఇండియన్ & తెలంగాణ హిస్టరీ, భారత రాజ్యాంగం & రాజకీయ వ్యవస్థ మరియు ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ & పబ్లిక్ పాలసీ అంశాల నుండి ఇవ్వబడతయి.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
హిస్టరీ, పాలిటి & సోసిటీ స్ట్రక్చర్ 150 ప్రశ్నలు 150 మార్కులు 2.30 గంటలు

ఇండియన్ ఎకానమీ & డెవలప్మెంట్ ( పేపర్ III )

పేపర్ III భారతీయ ఆర్థిక వ్యవస్థ, దాని అభివృద్ధి సంబంధిత అంశంలో కూడిన ఆబ్జెక్టివ్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుండి 50 ప్రశ్నలు చెప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 2.30 గంటల నిడివితో ఉంటుంది.

ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్ తో భారతీయ ఆర్థిక వ్యవస్థ: సమస్యలు మరియు సవాళ్లు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి మరియు మార్పు సమస్యలు వంటి సంబంధిత అంశాల నుండి ఇవ్వబడతయి.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
భారతీయ & తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, దాని అభివృద్ధి 150 ప్రశ్నలు 150 మార్కులు 2.30 గంటలు

తెలంగాణ ఉద్యమం & తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు  ( పేపర్ IV )

పేపర్ IV  తెలంగాణ ఉద్యమం & తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సంబంధిత అంశంలో కూడిన రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుండి 50 ప్రశ్నలు చెప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు.

పరీక్ష నిడివి 2.30 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్ తో తెలంగాణ ఆలోచన (1948-1970), ఉద్యమ సమీకరణ దశ (1971-1990) మరియు తెలంగాణ అవతరణ (1991-2014) అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఇవ్వబడతయి.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
తెలంగాణ ఉద్యమం & తెలంగాణ రాష్ట్రం 150 ప్రశ్నలు 150 మార్కులు 2.30 గంటలు

ఇంటర్వ్యూ & సర్టిఫికెట్ వెరిఫికేషన్

రాతపరీక్షలో అర్హుత పొందిన వారికీ చివరి దశలో పోస్టుల సంఖ్యా ఆధారంగా ఇంటర్వ్యూ జరిపేందుకు షార్ట్ లిస్ట్ రూపొందింస్తారు. వ్యక్తిగత ఇంటర్వ్యూకి గరిష్టంగా 75 మార్కులు కేటాయిస్తారు. రాతపరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ ఆధారంగా, వివిధ సమీకరణలు పరిగణలోకి తీసుకుని తుది ఎంపికను పూర్తిచేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేట్ పూర్తిచేసి నియామక పత్రాలు జారీ చేస్తారు.

కేటగిరి & రిజర్వేషన్ కేటగిరి & రిజర్వేషన్ 
బీసీ - 29%
ఎస్సీ - 15%
ఎస్టీ - 7%
EWS - 10%
Sports - 2%
PH - 4%.

క్వాలిఫైయింగ్ మార్కులు

  • జనరల్, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్, మాజీ సైనికులు - 40% మార్కులు తప్పనిసరి.
  • బీసీ అభ్యర్థులు లకు 35 శాతం మార్కులు తప్పనిసరి.
  • ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు అవసరం

Post Comment