కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ప్రవేశాలు
Telangana

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ప్రవేశాలు

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కెజిబివి) సమగ్రా శిక్ష ప్రధాన లక్ష్యాలలో భాగంగా 2004 లో వీటిని పరిచయం చేశారు. గ్రామీణ మరియు గిరిజన నిరుపేద బాలికలకు అన్ని వసతులతో పూర్తిస్థాయి రెసిడెన్సియల్ పాఠశాల విద్యను అందించాలనే లక్ష్యం వీటిని నెల్కొలపరు. కెజిబివిలును రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటప్పటికీ వీటికి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది.

భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 84 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను మంజూరు చేసింది. ప్రస్తుతం ఇవి TSTW గురుకులం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. మన రాష్టంలో ఉండే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు క్లాస్ VI నుండి క్లాస్ XII వరకు స్టేట్ సెకండరీ బోర్డు మరియు ఇంటర్ బోర్డు ఆధారిత పాఠ్యప్రణాళికను అందిస్తున్నాయి. ప్రతి పాఠశాలలో దాదాపు 200 మంది గిరిజన బాలికలకు అన్ని వసతులతో కూడిన పూర్తిస్థాయి రెసిడెన్సియల్ విద్యను అందిస్తున్నారు.

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలు ఏటా జూన్ నెలలో నిర్వహిస్తారు. అర్హుత కలిగిన బాలికలు సంబంధిత పాఠశాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ..విద్యార్థి అర్హుతలు ద్రువీకరించి నేరుగా ఎటువంటి ప్రవేశ పరీక్షా లేకుండా అడ్మిషన్ కల్పిస్తారు. పాఠశాల ఉన్న మండలం చెందిన గిరిజన బాలికలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అప్పటికి సీట్లు అందుబాటులో ఉంటె బయట ప్రాంతాల వారికీ అవకాశం కల్పిస్తారు.