జెట్ ఎగ్జామ్ 2023 : రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ, ఎగ్జామ్ ఫార్మేట్
Admissions Engineering Entrance Exams MBA Entrance Exams

జెట్ ఎగ్జామ్ 2023 : రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ, ఎగ్జామ్ ఫార్మేట్

జెట్ పరీక్ష జైన్ యూనివర్సిటీలో వివిధ యూజీ, పీజీ మరియు పీహెచ్డీ కోర్సుల యందు అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహించబడుతుంది. బెంగుళూరు ప్రధాన కేంద్రగా నడుస్తున్న ఈ యూనివర్సిటీ ఇంజనీరింగ్, మానేజ్మెంట్, కామర్స్, డిజైన్, హెల్త్ కేర్ అండ్ సైన్సెస్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలలో విభిన్న యూజీ, పీజీ కోర్సులు అందిస్తుంది.

జెట్ ఎగ్జామ్ 2023

Exam Name JAIN Entrance Test 2023
Exam Type Admission
Admission For UG & PG Courses
Exam Date NA
Exam Duration 3 Hours
Exam Level University Level

జైన్ అడ్మిషన్ టెస్ట్ సమాచారం

జైన్ యూనివర్సిటీ అందిస్తున్న ఇంజనీరింగ్ కోర్సులు

సివిల్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
ఏరోస్పేస్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

జెట్ 2023 షెడ్యూల్

ఆన్‌లైన్ టెస్ట్ స్లాట్ బుకింగ్ 30 జనవరి 2023
జెట్ ఎగ్జామ్ తేదీ NA
జెట్ ఎగ్జామ్ ఫలితాలు NA
జెట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ NA

జెట్ ఎలిజిబిలిటీ

  • జనరల్ యూజీ కోర్సులలో చేరేందుకు 60 శాతం మార్కులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణతయి ఉండాలి
  • బీటెక్ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీలో ఉత్తీర్ణతయి ఉండాలి
  • హెల్త్ సైన్సెస్ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీలో ఉత్తీర్ణతయి ఉండాలి
  • పీజీ కోర్సులలో చేరేందుకు సంబంధిత బ్యాచిలర్ డిగ్రీలలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి

జెట్ దరఖాస్తు ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు

దరఖాస్తు రుసుములు పరీక్షా కేంద్రాలు
అప్లికేషన్ ఫీజు : 1050 /- బెంగుళూరు, చెన్నై, విజయవాడ & హైదరాబాద్

జెట్ దరఖాస్తు ప్రక్రియ

జెట్ పరీక్షను రాసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జైన్ యూనివర్సిటీ అధికారిక వెబ్సైటు (www.jainuniversity.ac.in) ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్లో మీ సంబంధిత వ్యక్తిగత, విద్య మరియు చిరునామ వివరాలు ఎటువంటి తప్పులు దొర్లకుండా పొందుపర్చాల్సి ఉంటుంది.

అలానే మీ పొందుపర్చిన వివరాలకు సంబంధించి ధ్రువపత్రాలు, మీ ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

జెట్ ఎగ్జామ్ నమూనా

జెట్ ప్రవేశ పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షా 180 నిముషాల నిడివితో 150 మార్కులకు జరుగుతుంది. క్వశ్చన్ పేపర్లో ఎంపిక చేసుకున్న కోర్సు సంబంధిత గ్రూపుల నుండి మొత్తం 150 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షనల్ సమాధానాలు ఉంటాయి.
వాటిలో నుండి ఒక సరైన సమాధానాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. సరైన జవాబు గుర్తించిన ప్రశ్నలకు 1 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు, సమాధానం చేయని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు ఇవ్వబడవు. పరీక్షా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నలు మార్కులు
పార్ట్ 1 ఇంగ్లీష్ 30 30
పార్ట్ 2 ఫిజిక్స్ 30 30
పార్ట్ 3 కెమిస్ట్రీ 30 30
పార్ట్ 4 మ్యాథ్స్ 30 30
పార్ట్ 5 ఆప్టిట్యూడ్ & రీజనింగ్ 30 30
మొత్తం 150 150

Post Comment