Daily Current affairs in Telugu : 25th డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Daily Current affairs in Telugu : 25th డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Daily Current affairs in Telugu 25 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీ పోర్టల్‌ ప్రారంభం

కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ డిసెంబర్ 19న నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్ దేశవ్యాప్తంగా భౌగోళిక సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి మరియు విశ్లేషించడానికి ఒక సమగ్ర ఆన్‌లైన్ వేదికను అందిస్తుంది. దీనిని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు భాస్కరచాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియోఇన్ఫర్మేటిక్స్ ఉమ్మడిగా అభివృద్ధి చేసాయి. కీలకమైన జియోసైన్స్ డేటాను ప్రజాస్వామ్యీకరించడంలో పాటుగా పరిశ్రమలు మరియు విద్యాసంస్థలకు అపూర్వమైన వనరులను యాక్సెస్ కల్పించే లక్ష్యంతో దీనిని రూపొందించారు.

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను 1851లో రైల్వేలకు బొగ్గు నిక్షేపాలను కనుగొనడం కోసం ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో జిఎస్ఐ దేశంలోని వివిధ రంగాలలో అవసరమైన జియో-సైన్స్ సమాచార భాండాగారంగా అవతరించింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన భౌగోళిక-శాస్త్రీయ సంస్థ హోదాను కూడా పొందింది. కోల్‌కతాలో దీని ప్రధాన కార్యాలయం ఉంది, లక్నో, జైపూర్, నాగ్‌పూర్, హైదరాబాద్, షిల్లాంగ్ మరియు కోల్‌కతాలో ఆరు ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇది కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.

భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ అనేది దేశంలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ & మేనేజ్‌మెంట్, రీసెర్చ్ కోసం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద 1860లో స్థాపించారు. ఇది జియో-స్పేషియల్ టెక్నాలజీ రంగంలో సాంకేతికత బదిలీ & వ్యవస్థాపకత అభివృద్ధికి మద్దతు అందిస్తుంది.

పారాదీప్ పోర్టులో రికార్డు స్థాయిలో కార్గో హ్యాండ్లింగ్‌

ఒడిశాలోని పారాదీప్ పోర్ట్ అతి తక్కువ సమయంలో మరో 100 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్‌ను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 18నాటికి 100.28 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో త్రూపుట్‌ను సాధించింది. ఆర్థిక సంవత్సరం 2022-23లో 22 రోజుల ముందుగానే  కంటే 9.64% వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 145 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కార్గో హ్యాండ్లింగ్‌ను ఆల్ టైమ్ రికార్డ్‌గా సెట్ చేయడానికి పోర్ట్ సిద్ధంగా ఉంది.

పారాదీప్ ఓడరేవు ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ఉన్న పారాదీప్‌లో ఉంది. ఇది భారతదేశ తూర్పు తీరంలో ఉన్నసహజసిద్ధమైన ఓడరేవు. మహానది నది మరియు బంగాళాఖాతం కలిసే ప్రదేశంల, కోల్‌కతాకు దక్షిణాన 210 నాటికల్ మైళ్ళు మరియు విశాఖపట్నానికి ఉత్తరాన 260 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది. దీనిని 1966లో స్థాపించారు. ఇది దేశంలో సముద్ర వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన ఓడరేవు. ఈ పోర్ట్ ఏడాదికి 277 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో సేవలు నిర్వహించే  సామర్థ్యం కలిగి ఉంది.

సూరత్ డైమండ్ ఎక్స్ఛేంజ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయంగా భావించే పెంటగాన్‌ను అధిగమించిన సూరత్ డైమండ్ ఎక్స్ఛేంజ్ సముదాయాన్ని డిసెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది 6.7 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 32 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించబడింది. ఇదే రోజున సూరత్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు. అలానే పంచతత్వ గార్డెన్‌ను కూడా ప్రధాని సందర్శించారు, సూరత్ డైమండ్ బోర్స్ & స్పైన్-4 యొక్క గ్రీన్ బిల్డింగ్‌ను కూడా వీక్షించారు.

డైమండ్ కటింగ్ మరియు పాలిషింగ్‌కు ప్రసిద్ధి చెందిన సూరత్‌ను డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సూరత్ డైమండ్ బోర్స్ అంతర్జాతీయ వజ్రాలు మరియు నగల వ్యాపారానికి ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత ఆధునిక కేంద్రంగా ఉంది. ఇది కఠినమైన మరియు మెరుగుపెట్టిన వజ్రాలు, ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. సూరత్ డైమండ్ బోర్స్ వజ్రాల దిగుమతి-ఎగుమతి కోసం అత్యాధునిక 'కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్'ని కూడా కలిగి ఉంటుంది.

ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం కంప్యూటర్ ఎయిడెడ్ డిస్పాచ్ సిస్టమ్‌

నేషనల్ హైవేస్ అథారిటీ ఇండియా 1033 కాల్ సెంటర్ ఆపరేటర్లకు సమీపంలోని అందుబాటులో ఉన్న ఆన్-రోడ్ యూనిట్ (అంబులెన్స్/క్రేన్/పెట్రోల్ యూనిట్)ని గుర్తించడానికి కంప్యూటర్ ఎయిడెడ్ డిస్పాచ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. అలానే ఆన్-రోడ్ యూనిట్‌లకు డిస్పాచ్ సమాచారాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ (ఈఆర్ఎస్) అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యవసర కాల్‌లకు ప్రతిస్పందనను వేగవంతం చేయడానికి ఈ వ్యవస్థ అభివృద్ధి చేయబడింది.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కంప్యూటర్-ఎయిడెడ్ డిస్పాచ్ వ్యవస్థను ప్రారంభించడం భారతీయ రహదారులపై పౌరుల భద్రత మరియు ప్రతిస్పందన సమయాలను మెరుగుపరచడంలో ముఖ్యమైన దశ. ఈ వ్యవస్థ వారి జీవితాలను రక్షించే మరియు బాధలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

మణిపూర్‌లో న్యుమోనియా నివారణ కోసం శాన్స్ ప్రసార కార్యక్రమం

మణిపూర్ ప్రభుత్వం న్యుమోనియా నివారణ కోసం సోషల్ అవేర్‌నెస్ అండ్ యాక్షన్ టు న్యూట్రలైజ్ న్యుమోనియా (SAANS) క్యాంపెయిన్ ప్రారంభించింది. ఆ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సపమ్ రంజన్ సింగ్ డిసెంబర్ 20న ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జెఎన్‌ఐఎంఎస్)లో రాష్ట్ర నవజాత వనరుల కేంద్రం ప్రారంభోత్సవం సంధర్బంగా దీనిని ప్రకటించారు. ఈ కార్యక్రమం సామాజిక అవగాహన ద్వారా న్యుమోనియాను తటస్థికరించే లక్ష్యం పెట్టుకుంది.

న్యుమోనియా అనేది బ్యాక్టీరియా, వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మీ ఊపిరితిత్తులలో వాపు మరియు ద్రవం చేరడం ద్వారా వచ్చే ఒకరకమైన ఇన్ఫెక్షన్. ఇది వ్యాధిగస్తుడిని శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది.  పసుపు, ఆకుపచ్చ లేదా రక్తపు శ్లేష్మంతో జ్వరం మరియు దగ్గును కలిగిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఎవరికైనా ప్రాణాపాయం కలిగించవచ్చు, ప్రత్యేకించి శిశువులు, పిల్లలు మరియు 65 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ఇది ప్రాణాంతకం.

కురుక్షేత్రలో అంతర్జాతీయ గీత మహోత్సవం

హర్యానాలోని కురుక్షేత్రలో అంతర్జాతీయ గీత మహోత్సని డిసెంబర్ 19 నుండి వారం రోజుల నిడివితో నిర్వహించారు. ఈ అంతర్జాతీయ గీత మహోత్సవంను బ్రహ్మ సరోవర్‌లో గీతా ఆరతితో ప్రారంభమైంది. దీనిని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మరియు స్వామి జ్ఞానానంద మహారాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం వసుధైవ కుటుంబం: శ్రీమద్ భగవద్గీత మరియు సార్వత్రిక ఐక్యత అనే థీమ్‌తో జరిగింది. ఈ థీమ్ సార్వత్రిక సోదరభావం మరియు శాంతి యొక్క గీత సందేశాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ కార్యక్రమాన్ని హర్యానా ప్రభుత్వం మరియు కురుక్షేత్ర డెవలప్‌మెంట్ బోర్డ్ నిర్వహించాయి. ఈ వేడుకకు భారతదేశం మరియు విదేశాల నుండి ఒక మిలియన్ సందర్శకులు హాజరయ్యారు. ఈ గీత మహోత్సవ్ అనేది హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథమైన భగవద్గీత యొక్క వారం రోజుల వేడుక. ఈ కార్యక్రమంలో సంగీతం, నృత్యం మరియు థియేటర్ ప్రదర్శనలతో సహా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. గీతా బోధనలపై ఉపన్యాసాలు మరియు చర్చలు కూడా నిర్వహిస్తారు.

Advertisement

Post Comment