కేఐఐటీఈఈ ఎగ్జామ్ 2023 : రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ, ఎగ్జామ్ ఫార్మేట్
Admissions Engineering Entrance Exams MBA Entrance Exams

కేఐఐటీఈఈ ఎగ్జామ్ 2023 : రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ, ఎగ్జామ్ ఫార్మేట్

కేఐఐటీఈఈ పరీక్షను కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) లో యూజీ, పీజీ మరియు రీసెర్చ్ కోర్సుల యందు మొడటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. దేశంలో టాప్ 20 యూనివర్సిటీలలో ఒకటైన కళింగ ఇనిస్టిట్యూట్ దేశంలో ఏ ప్రైవేట్ యూనివర్సిటీ అందించని విభిన్న కోర్సులు అందిస్తుంది.

Advertisement

యూజీ, పీజీ కేటగిర్లలో ఇంజనీరింగ్, మెడికల్, మానేజ్మెంట్, లా, ఫాషన్ డిజైనింగ్, లాజిస్టిక్స్ & ఈ-కామర్స్, జనరల్ బ్యాచిలర్ డిగ్రీలతో పాటుగా మరెన్నో రీసెర్చ్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. మెడికల్ కోర్సులు మినహా మిగతా అన్ని కోర్సుల ప్రవేశాలు కేఐఐటీఈఈ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు.

కేఐఐటీఈఈ ఎగ్జామ్ 2023

Exam Name KIITEE 2023
Exam Type Admission
Admission For UG & PG Courses
Exam Date 14 & 20 April 2023
Exam Duration 180 Minutes
Exam Level University Level

కేఐఐటీఈఈ సమాచారం

కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న కోర్సులు

Bachelor of Technology (BTech)
Bachelor of Architecture (B.Arch)
Master of Architecture (M.Arch)
Bachelor of Design (Fashion / Textile)
Bachelor of Film & Television Production (BFTP)
Bachelor of Business Administration (BBA)
Master of Mass Communication (Integrated)
M.Com
BSC Computer Science
Bachelor of Computer Application (BCA)
Master of Computer Application (MCA)
Master of Computer Application Lateral Entry (MCA LE)
Integrated M.Sc. & Ph.D
Integrated M.Tech & Ph.D
M.Tech
Master of Public Health (MPH)
Master of Hospital Administration (MHA)
B.Com

కేఐఐటీఈఈ ఎలిజిబిలిటీ

  • జనరల్ యూజీ కోర్సులలో చేరేందుకు 60 శాతం మార్కులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణతయి ఉండాలి
  • బీటెక్ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీలో ఉత్తీర్ణతయి ఉండాలి
  • బీఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ/బైపీసీలో ఉత్తీర్ణతయి ఉండాలి
  • పీజీ కోర్సులలో చేరేందుకు సంబంధిత బ్యాచిలర్ డిగ్రీలలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి

కేఐఐటీఈఈ 2023 షెడ్యూల్

కేఐఐటీఈఈ రిజిస్ట్రేషన్ 04 ఏప్రిల్ 2023 (LD)
కేఐఐటీఈఈ ఎగ్జామ్ తేదీ 14 & 20 ఏప్రిల్ 2023
కేఐఐటీఈఈ ఫలితాలు 22 ఏప్రిల్ 2023
కేఐఐటీఈఈ కౌన్సిలింగ్ మే & జూన్ 2023

కేఐఐటీఈఈ దరఖాస్తు ఫీజు & పరీక్ష కేంద్రాలు

దరఖాస్తు రుసుములు పరీక్షా కేంద్రాలు
అప్లికేషన్ ఫీజు : 800 /- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం

కేఐఐటీఈఈ దరఖాస్తు ప్రక్రియ

కేఐఐటీఈఈ పరీక్ష రాసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు కళింగ ఇనిస్టిట్యూట్ అధికారిక యూనివర్సిటీ వెబ్సైటు (www.kiitee.kiit.ac.in/) ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్లో మీ సంబంధిత వ్యక్తిగత, విద్య మరియు చిరునామ వివరాలు ఎటువంటి తప్పులు దొర్లకుండా పొందుపర్చాల్సి ఉంటుంది.

అలానే మీ పొందుపర్చిన వివరాలకు సంబంధించి ధ్రువపత్రాలు, మీ ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

కేఐఐటీఈఈ ఎగ్జామ్ ఫార్మేట్

కేఐఐటీఈఈ ప్రవేశ పరీక్షా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షా 3 గంటల నిడివితో 480 మార్కులకు జరుగుతుంది. క్వశ్చన్ పేపర్లో ఎంపిక చేసుకున్న కోర్సు సంబంధిత గ్రూపుల నుండి మొత్తం 120 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షనల్ సమాధానాలు ఉంటాయి.

వాటిలో నుండి ఒక సరైన సమాధానాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. సరైన జవాబు గుర్తించిన ప్రశ్నలకు 4 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు -1 మార్కులు తొలగిస్తారు. సమాధానం చేయని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు ఇవ్వబడవు. పరీక్షా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సబ్జెక్టు/సిలబస్  ప్రశ్నల సంఖ్యా మార్కులు
పార్ట్ 1 ఫిజిక్స్ 40 160
పార్ట్ 2 కెమిస్ట్రీ 40 160
పార్ట్ 3 మ్యాథ్స్/బయాలజీ 40 160
మొత్తం 120 480

కేఐఐటీఈఈ అడ్మిషన్ ప్రక్రియ

అడ్మిషన్లు కేఐఐటీఈఈ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతాయి. ఆన్లైన్ టెస్టులో కనీస అర్హుత మార్కులు సాధించిన అభ్యర్థులను అడ్మిషన్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. మెరిట్ సాధించిన అభ్యర్థులకు కౌన్సిలింగ్ సంబంధిత వివరాలు ఫోన్ మరియు మెయిల్ ద్వారా అందజేస్తారు. యూజీసీ అడ్మిషన్ నియమాలను అనుగుణంగా వివిధ రిజర్వేషన్ కేటగిరి కోటా ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

కళింగ యూనివర్సిటీ స్కాలర్షిప్ - ఫెలోషిప్

KIITEE Scholarships Schemes
KIITEE Scholarships SchemesKIITEE Scholarships Schemes

కేఐఐటీఈఈ హెల్ప్-లైన్ సమాచారం

Director Admissions
Admission Cell (Koel Campus),
KIIT Deemed to be University
Bhubaneswar Odisha, India 751024
8114373311, 8114373312, 8114373313, 8114373314, 8114373315, 7788889911
0674-2742103, O674-2741747

admission@kiit.ac.in

Advertisement