బిజినెస్ & ఎకానమీ అఫైర్స్ : మార్చి 2022 | తెలుగు కరెంటు అఫైర్స్
Telugu Current Affairs

బిజినెస్ & ఎకానమీ అఫైర్స్ : మార్చి 2022 | తెలుగు కరెంటు అఫైర్స్

ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ చైర్‌పర్సన్‌గా ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్

ఎల్‌అండ్‌టి ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఎల్‌టిఎఫ్‌హెచ్) యొక్క డైరెక్టర్ మరియు చైర్‌పర్సన్‌గా ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ నియమితులయ్యారు. సుబ్రహ్మణ్యన్ ప్రస్తుతం లార్సెన్ & టూబ్రో (L&T) యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు. 2017 నుండి L&T ఫైనాన్స్ హోల్డింగ్స్ బోర్డులో చైర్‌పర్సన్‌గా ఉన్న శైలేష్ హరిభక్తి స్థానంలో త్వరలో చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

జెట్ ఎయిర్‌వేస్ సీఈఓగా సంజీవ్ కపూర్‌

జెట్ ఎయిర్‌వేస్‌ను పునరుద్ధరించేందుకు విమానయాన రంగ ప్రముఖుడు సంజీవ్ కపూర్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు కల్రాక్ జలాన్ కన్సార్టియం ప్రకటించింది. కపూర్ ఏప్రిల్ 4 న ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఎల్‌ఐసీ మ్యూచువల్ కొత్త ఎండీ, సీఈఓగా టీఎస్ రామకృష్ణన్

ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్త ఎండీ మరియు సీఈఓగా టీఎస్ రామకృష్ణన్ నియమితులయ్యారు. రామకృష్ణన్‌కు ఎల్‌ఐసి మరియు దాని అనుబంధ సంస్థలు/అసోసియేట్ కంపెనీలలో 34 సంవత్సరాల అనుభవం ఉంది. రామకృష్ణన్ మాజీ హోల్‌టైమ్ డైరెక్టర్ మరియు సీఈఓ అయిన దినేష్ పాంగ్టే స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఫీచర్ ఫోన్‌ల కోసం యూపీఐ123పే సాంకేతికత ప్రారంభం

భారతీయ రిజర్వ్ బ్యాంక్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఫీచర్ ఫోన్‌ల కోసం కొత్తగా యూపీఐ123పే సాంకేతికతను 9, మార్చి 2022 న ప్రారంభించింది. ఈ సాంకేతిక ఫీచర్ ఫోన్‌ వినియోగదారులు ఇంటర్నెట్ లేకుండా చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. అదే విధంగా బాలన్స్ చెకింగ్, మినీ స్టేటుమెంట్ వంటి ఇతర బ్యాంకింగ్ సేవలను కూడా పొందొచ్చు. ఈ సాంకేతికతను రురల్ ఏరియాలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ చైర్మన్‌గా అజయ్ భూషణ్

మాజీ ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, మూడు సంవత్సరాల కాలానికి గాను నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) చైర్మన్‌గా నియమితులయ్యారు. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అనేది కంపెనీల చట్టం 2013 ప్రకారం భారతదేశంలో ఆడిటింగ్ వృత్తి మరియు అకౌంటింగ్ ప్రమాణాలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేయబడిన స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది అక్టోబర్ 2018 నుండి ఉనికిలో ఉంది.

ఐఆర్‌డీఐ నూతన చైర్మన్‌గా దేబాశిష్ పాండా

మాజీ ఆర్థిక కార్యదర్శి దేబాశిష్ పాండా "ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా 14 మార్చి 2022న బాధ్యతలు స్వీకరించారు. ఈయన వచ్చే 3 ఏళ్ళ కాలానికి నియమించబడ్డారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఏర్పాటు చేయబడ్డ చట్టబద్దమైన కార్పొరేషన్. ఇది భారతదేశంలోని బీమా మరియు రీ-ఇన్సూరెన్స్ పరిశ్రమలను నియంత్రించడం మరియు లైసెన్సింగ్ జారీ చేయడం వంటి విధులు నిర్వర్తిస్తుంది. 1999 లో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంది.

ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ & ఎండీగా రంజిత్ రాత్

ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) తదుపరి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా రంజిత్ రత్ నియమితులయ్యారు. ప్రస్తుత ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయినా సుశీల్ చంద్ర మిశ్రా స్థానంలో త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. రంజిత్ రత్  ప్రస్తుతం మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (MECL) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

ఎయిరిండియా లిమిటెడ్ చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్‌

ఎయిరిండియా లిమిటెడ్ చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్‌ను నియమిస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ప్రభుత్వం నుండి ఎయిర్ ఇండియాను దక్కించుకున్న కొద్ది నెలల తర్వాత నష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ నిర్వహణను బలపరిచేందుకు టాటా గ్రూపు కార్యాచరణ ప్రారంభించింది. నటరాజన్ చంద్రశేఖరన్‌ 2017 నుండి అతిపెద్ద టాటా గ్రూపు చైర్మనుగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మారుతీ సుజుకి ఇండియా ఎండీ & సీఈవోగా హిసాషి టేకుచి

మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా హిసాషి టేకుచి నియమితులయ్యారు. ఈయన 2022 ఏప్రిల్ మొదటి వారంలో ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన 1986 నుండి మారుతీ సుజుకిలో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2019 నుండి మారుతీ సుజుకి బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు.

ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ అధికారిక స్పాన్సర్‌గా బైజూస్

బెంగళూరుకు చెందిన ప్రపంచ అతిపెద్ద ఎడ్-టెక్ కంపెనీ బైజూస్, త్వరలో ఖతార్‌లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ 2022కి అధికారిక స్పాన్సర్‌గా ప్రకటించబడింది. మెక్సికో, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు పాల్గునే టోర్నమెంటు ద్వారా ప్రపంచ ఎడ్యుకేషన్ మార్కెటును బైజూస్ ఆకర్షించనుంది. ఈ హక్కుల కోసం బైజూస్ దాదాపు 40 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు తెలుస్తుంది.

Post Comment