టీఎస్ టెట్ 2022 నోటిఫికేషన్ వెలువడింది. ఉపాధ్యాయల అర్హుతకు సంబంధించి జరిపే ఈ పరీక్షను 12 జూన్ 2022 న నిర్వహించేందుకు షెడ్యూల్ చేసారు. పరీక్ష ఉదయం మరియు మధ్యాహ్నం రెండు పూటలా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 26 వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది. 2016, 2017 తర్వాత టెట్ నిర్వహించడం ఇదే తొలిసారి. తాజాగా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేసేందుకు ప్రభుత్వం సిద్దమౌతున్న నేపధ్యలో, టెట్ పరీక్షను నిర్వహించడం అనివార్యమయింది. ఈ పరీక్షకు సంబంధించి పూర్తివివరాలు తెలుసుకోండి.
టీఎస్ టెట్ 2022
Exam Name | TS TET 2022 |
Exam Type | Eligibility Test |
Eligibility For | Teaching |
Exam Date | 12 జూన్ 2022 |
Exam Duration | 2.30 Hours |
Exam Level | State Level (TS) |
టీఎస్ టెట్ సమాచారం
టెట్ అంటే ఏంటి ?
టెట్ అనగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అర్ధం. టెట్ పరీక్షను ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయాలుగా పనిచేసేందుకు ఆసక్తి కనబర్చే అభ్యర్థుల యొక్క ప్రాథమిక టీచింగ్ ఎలిజిబిలిటీని అంచనా వేసేందుకు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పాఠశాల విద్య అందించాలనే ఆలోచనతో 2010 నుండి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) సీటెట్ పేరుతొ జాతీయ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తుంది.
సీటెట్'కు నమూనాగా మన రాష్ట్ర ప్రభుత్వం మండల పరిషిత్, జిల్లా పరిషిత్, మునసపాలిటీ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూళ్లలో జరిగే ఉపాధ్యాయల నియామకాలకు సంబంధించి టెట్ అర్హుత తప్పనిసరి చేసింది. 1 నుండి 8వ తరగతి ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి జరిగే భర్తీ ప్రక్రియలో టెట్ అర్హుత సాధించిన వారికీ 20 శాతం వెయిటేజీ ఇస్తుంది.
టెట్ స్కోరు వ్యాలిడిటీ
టెట్ స్కోరు కాలవ్యవధి గతంలో 7 ఏళ్ళుకు మాత్రమే ఉండేది. తాజాగా ప్రభుత్వం దీన్ని జీవితకాలం చెల్లిబాటుయ్యేలా జీవో జారీచేసింది. దీని ప్రకారం ఒకసారి టెట్ అర్హుత సాధిస్తే మీ వయోపరిమితి ఉన్నంత వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలకు పోటీపడవొచ్చు.
టెట్ అర్హుత పరీక్ష రెండు పేపర్లలో జరుగుతుంది. 1 నుండి 5 వ తరగతి ఉపాధ్యాయల కోసం పేపర్ 1 నిర్వహించబడుతుంది. 6 నుండి 8 వ తరగతి చెందిన ఉపాధ్యాయల కోసం పేపర్ 2 నిర్వహించబడుతుంది. 1 నుండి 8 వ తరగతి వరకు ఉపాధ్యాయులుగా చేరాలనుకునే వారు రెండు పేపర్లకు హాజరవ్వవలసి ఉంటుంది. పేపర్ 2 లో తిరిగి రెండు పేపర్లు ఉంటాయి. సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ మరియు లాంగ్వేజ్ పండిట్లు లకు సంబంధించిన అభ్యర్థులు పేపర్ 2 A కు హాజరవ్వవల్సి ఉంటుంది. ఫీజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అభ్యర్థులు పేపర్ 2 B కు హాజరవ్వవల్సి ఉంటుంది.
టీఎస్ టెట్ ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం | 26 మార్చి 2022 |
దరఖాస్తు తుది గడువు | 12 ఏప్రిల్ 2022 |
హాల్ టికెట్ డౌన్‌లోడ్ | 06 జూన్ 2022 |
పరీక్ష తేదీ (పేపర్ I & II) | 12 జూన్ 2022 |
ఫలితాలు | 27 జూన్ 2022 |
పేపర్ I : ఉదయం 9.30 గంటల నుండి 12 గంటల మధ్య జరుగుతుంది. పేపర్ II మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5 మధ్య నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలను 33 జిల్లాల పరిధిలో అందుబాటులో ఉండనున్నాయి. దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు అందుబాటులో ఉండే పరీక్షాకేంద్రాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
టీఎస్ టెట్ ఎలిజిబిలిటీ
- పేపర్ 1 : 50 శాతం మార్కులతో 10+2 లేదా ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 5శాతం మార్కుల సడలింపు ఉంటుంది. మరియు 50 శాతం మార్కులతో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) లేదా 4ఏళ్ళ బ్యాచిలర్ అఫ్ ఎలిమింటరీ ఎడ్యుకేషన్ (B.El.Ed) చేసిన వారు అర్హులు.
- పేపర్ 2 A : (సైన్స్, మాథ్స్, సోషల్ స్టడీస్ అభ్యర్థులు) 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ అఫ్ ఎడ్యుకేషన్(B.Ed ) లేదా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేసిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 శాతం మార్కుల సడలింపు ఉంటుంది.
- 50 శాతం మార్కులతో నాలుగేళ్ళ B.A.Ed/B.Sc.Ed పూర్తిచేసిన వారు కూడా అర్హులు. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 5శాతం మార్కుల సడలింపు ఉంటుంది.
- (లాంగ్వేజ్ పండిట్లు) ఆప్షనల్ గా ఎంచుకున్న లాంగ్వేజ్ సబ్జెక్టు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ అఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ లేదా లిటరేచర్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు లేదా లాంగ్వేజ్ పండిట్ సర్టిఫికెట్ ఉన్నవారు లేదా లాంగ్వేజ్ మెథడాలజీ లో బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు.
- పేపర్ 2 B:(ఫీజికల్ ఎడ్యుకేషన్): ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హుతతో NCTE గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (U.G.D.P.Ed) లేదా డిప్లొమా ఇన్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (D.P.Ed) లలో ఏదో ఒకటి పూర్తి చేసి ఉండాలి.
- (స్కూల్ అసిస్టెంట్): ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా NCTE గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ అఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (B.P.Ed) లేదా గ్రాడ్యుయేట్ ఇన్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (BPE) పూర్తిచేసిన వారు అర్హులు.
- ఇంటర్మీడియట్ అర్హుత కు సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఉత్తీర్ణత అయిన వారు మాత్రమే అర్హులు.
- బ్యాచిలర్ డిగ్రీ అర్హుతకు సంబంధించి యూజీసీ గుర్తింపు పొందిన కళాశాలల్లో పూర్తిచేసిన వారు మాత్రమే అర్హులు.
- టెట్ రాసేందుకు ఎటువంటి గరిష్ట వయోపరిమితి లేదు.
టీఎస్ టెట్ దరఖాస్తు ఫీజు
దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.
- పేపర్ 1 లేదా పేపర్ 2 కు హాజరయ్యే అభ్యర్థుల దరఖాస్తు ఫీజు 300/-
- రెండు పేపర్లకు హాజరయ్యే అభ్యర్థుల దరఖాస్తు ఫీజు 300/-
టీఎస్ టెట్ పరీక్షకు దరఖాస్తు చేయండి
తెలంగాణ టెట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. తెలంగాణ టెట్ కు చెందిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.
- వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
- మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
- ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
- దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
- పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
- నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.
టీఎస్ టెట్ పరీక్ష విధానం
తెలంగాణ టెట్ అర్హుత పరీక్ష పూర్తి ఆన్‌లైన్(సీబీటీ) విధానంలో జరుగుతుంది. 2 గంటల 30 నిమిషాల నిడివి తో జరిగే ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ప్రైమరీ స్థాయిలో 1 నుండి 5 వ తరగతి ఉపాధ్యాయల అర్హుత కి సంబంధించి జరుగుతుంది. పేపర్ 2 ఎలిమంటరీ స్థాయిలో 6 నుండి 8 వ తరగతి ఉపాధ్యాయల అర్హుత కి సంబంధించి జరుగుతుంది. ఒకేవేళ 1 నుండి 8 వ తరగతి ఉపాధ్యాయల అర్హుత కి సంబంధించి రాయాలనుకుంటే రెండు పేపర్లకు హాజరవ్వవలసి ఉంటుంది. 150 మార్కులకు జరిగే ఈ పరీక్షలో మొత్తం 150 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు ఇవ్వబడుతుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.
పేపర్ 1 : ప్రైమరీ క్లాసులు 1 నుండి 5 వ తరగతి | ||
చైల్డ్ డెవలప్మెంట్ మరియు బోధన పద్ధతులు | 30 ప్రశ్నలు | 30 మార్కులు |
లాంగ్వేజ్ 1 (ఆప్షనల్) | 30 ప్రశ్నలు | 30 మార్కులు |
లాంగ్వేజ్ 2 (ఇంగ్లీష్) | 30 ప్రశ్నలు | 30 మార్కులు |
మ్యాథమెటిక్స్ | 30 ప్రశ్నలు | 30 మార్కులు |
ఎన్విరాన్మెంటల్ స్టడీస్ | 30 ప్రశ్నలు | 30 మార్కులు |
మొత్తం | 150 ప్రశ్నలు | 150 మార్కులు |
పేపర్ 2 A : ఎలిమెంటరీ క్లాసులు 6 నుండి 8 వ తరగతి (సైన్స్, సోషల్, మాథ్స్ మరియు లాంగ్వేజ్ పండిట్లు) | ||
చైల్డ్ డెవలప్మెంట్ మరియు బోధన పద్ధతులు | 30 ప్రశ్నలు | 30 మార్కులు |
లాంగ్వేజ్ 1 | 30 ప్రశ్నలు | 30 మార్కులు |
లాంగ్వేజ్ 2 | 30 ప్రశ్నలు | 30 మార్కులు |
మ్యాథమెటిక్స్ / సైన్స్ / సోషల్ స్టడీస్ (ఆప్షనల్) | 60 ప్రశ్నలు | 60 మార్కులు |
మొత్తం | 150 ప్రశ్నలు | 150 మార్కులు |
పేపర్ 2 B : ఎలిమెంటరీ క్లాసులు 6 నుండి 8 వ తరగతి (ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు) | ||
ఫీజికల్ ఎడ్యుకేషన్ బోధన పద్ధతులు | 30 ప్రశ్నలు | 30 మార్కులు |
లాంగ్వేజ్ 1 | 10 ప్రశ్నలు | 10 మార్కులు |
లాంగ్వేజ్ 2 | 10 ప్రశ్నలు | 10 మార్కులు |
ఫీజికల్ ఎడ్యుకేషన్ | 100 ప్రశ్నలు | 100 మార్కులు |
మొత్తం | 150 ప్రశ్నలు | 150 మార్కులు |
ప్రతిభావంతులైన క్రీడాకారులకు వారి స్థాయిని బట్టి 20 నుండి 30 ఇన్సెంటివ్ మార్కులు ఇవ్వబడతాయి |
- పేపర్ 1 లోని చైల్డ్ డెవలప్మెంట్ మరియు బోధన పద్ధతులు అనే టాపిక్ 6 నుండి 11 ఏళ్ళ విద్యార్థులకు చెందిదై ఉంటుంది. ఆ వయసు పిల్లకు సంబందించిన బోధన పద్దతుల గురించి, చైల్డ్ సైకాలజీ, పాఠ్యాంశాలునేర్చుకునే పద్దతుల గూర్చి ఉంటుంది. అదేవిదంగా పేపర్ 2 ముందు చెప్పిన విదంగా 11 నుండి 14 ఏళ్ళ విద్యార్థులకు చెందిదై ఉంటుంది.
- లాంగ్వేజ్ 1 అభ్యర్థులకు చెందిన బోధన మాధ్యమానికి సంభందించిన ప్రావీణ్యతలు పరీక్షించే విదంగా ఉంటుంది. ఇందులో ఆప్షనల్ గా ఉండే తెలుగు, ఉర్దు, హిందీ, కన్నడ, తమిళం మరియు ఒరియా భాషల్లో ఒక దాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది.
- లాంగ్వేజ్ 2 గా ప్రతి అభ్యర్థికి ఇంగ్లీష్ ఉంటుంది. ఈ భాష కు సంబంధించి కమ్యూనికేషన్ మరియు కంప్రెహెన్షన్ భాషా సామర్ధ్యాలను అంచనా వేచే విదంగా ఉంటుంది.
- ఆయా పేపర్లలలో ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి సిలబస్ ఆయా తరగతులకు చెందిన NCERT బుక్స్ నుండి ఇవ్వబడుతుంది.
- ప్రశ్న పత్రాలు లాంగ్వేజ్ 1 లో తీసుకున్న ఆప్షనల్ మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి.
టీఎస్ క్వాలిఫై మార్కులు
జనరల్ కేటగిరిలో 60 శాతం లేదా అంతకుమించి స్కోర్ సాధించిన అభ్యర్థులు టెట్ అర్హులుగా పరిగణిస్తారు. టెట్ అర్హుత సాధించిన వారంతా టీచర్ ఉద్యోగాలకు అర్హులని కాదు వాటిలో ఇది ఒక అర్హుత మాత్రమే. అర్హుత మార్కులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థుల రిజర్వేషన్ హక్కులు ఈ కింది విదంగా ఉంటాయి. అర్హుత సాధించిన అభ్యర్థులకు తెలంగాణ టెట్ జాయిన్ డైరెక్టర్ సంతకంతో డిజిటల్ ఫార్మెట్ పాస్ సర్టిఫికెట్ అందిస్తారు. ఈ సర్టిఫికేటులో అభ్యర్థి పేరు, రిజిస్టర్ నెంబర్, అర్హుత సాధించిన ఏడాది వంటి సమాచారం ఉంటుంది.
టెట్ స్కోర్ కార్డు యొక్క కాలపరిమితి అభ్యర్థి అర్హుత సాధించిన తేదీ నుండి ఏడేళ్లు చెల్లుబాటు అవుతుంది. అభ్యర్థులకు ఇష్టముంటే తమ టెట్ స్కోర్ ని ప్రతి ఏడాది మెరుగు పర్చుకునేందుకు అవకాసం ఉంటుంది. టెట్ కు హాజరయ్యే విషయంలో ఎటువంటి పరిమితి లేదు.
రిజర్వేషన్ కేటగిరి | అర్హుత మార్కులు |
జనరల్ కేటగిరి అభ్యర్థులు | 60% మార్కులు |
బీసీ అభ్యర్థులు | 50% మార్కులు |
ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులు | 40% మార్కులు |
టెట్ చెల్లుబాటయ్యే పాఠశాలలు
- టెట్ స్కోర్ రాష్ట్ర ప్రభుత్వ ఆదీనంలో ఉన్న అన్ని పాఠశాలలకు సంబంధించిన నియామక ప్రక్రియలో చెల్లిబాటు అవుతుంది.
- టెట్ స్కోర్ ని కొన్ని ఆన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లు కూడా తమ స్కూళ్ల టీచింగ్ నియమాకాల్లో పరిగణలోకి తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తాయి.