Advertisement
ఏపీలో 292 గ్రూపు పోస్టుల ఖాళీలు | త్వరలో నోటిఫికేషన్ జారీ
Andhra Pradesh

ఏపీలో 292 గ్రూపు పోస్టుల ఖాళీలు | త్వరలో నోటిఫికేషన్ జారీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగులకు తీపికబురు అందించారు. రాష్ట్రలో 292 గ్రూపు 1, గ్రూపు 2 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుపుతూ, వాటిని త్వరలో భర్తీచేసినందుకు ఆదేశాలు జారీచేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన క్యాలెండరులో 38 ఖాళీలు ఉండగా, వాటి సంఖ్యా నేడు భారీగా పెరిగింది. ముఖ్యమంత్రి వెల్లడించిన వివరాలు మేరకు గ్రూపు 1 లో 110 పోస్టులు, గ్రూపు 2 పరిధిలో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు.

గ్రూపు 1 పరిధిలో డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ, సిటిఓ, డీఎస్పీ, డీఎఫ్ఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపిడిఓ పోస్టులు ఉండగా, గ్రూపు 2 పరిధిలో డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, ట్రెజరీ పోస్టులు వంటివి ఉన్నాయి. వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏదిఏమైనా ఉద్యోగాల భర్తీకోసం అలమటిస్తున్న ఏపీ నిరుద్యోగ యువతకు ఇది చిన్నపాటి శుభవార్తగానే చెప్పుకోవాలి.

విభాగాల వారీగా గ్రూపు 1 ఖాళీలు

డిప్యూటీ కలెక్టర్లు - 10 పోస్టులు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ - 03 పోస్టులు
ఆర్డీఓ - 07 పోస్టులు మున్సిపల్ కమిషనర్ - 01 పోస్టు
కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు - 12 పోస్టులు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 - 08 పోస్టులు
డిస్ట్రిక్ట్ రిజిస్టర్లు - 06 పోస్టులు డిప్యూటీ రిజిస్ట్రార్ - 02 పోస్టులు
డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 01 పోస్టు  లే సెక్రెటరీ & ట్రెజరర్ గ్రేడ్ 2 - 05 పోస్టులు
డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 01 పోస్టు ఏటిఓ\ఏఏఓ (ట్రెజరీ) - 08 పోస్టులు
డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ - 03 పోస్టులు ఏటిఓ\ఏఏఓ (ఆడిట్- 04 పోస్టులు
డీఎస్పీ (సివిల్) - 13 పోస్టులు ఏఓ (హెల్త్ కేర్) - 15 పోస్టులు
డీఎస్పీ (జైళ్లు) - 02 పోస్టులు ఎంపీడీఓ - 07 పోస్టులు
డీఎఫ్ఓ - 02 పోస్టులు మొత్తం - 110 పోస్టులు 

విభాగాల వారీగా గ్రూపు 2 ఖాళీలు

డిప్యూటీ తహసీల్దార్ - 30 పోస్టులు  ఏఎస్ఓ (లెజిస్లేచర్) - 04 పోస్టులు
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 - 16 పోస్టులు ఏఎస్ఓ (జనరల్) - 50 పోస్టులు
అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 15 పోస్టులు  జేఏ (సీసీఎస్) - 05 పోస్టులు
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 - 05 పోస్టులు సీనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ) - 10 పోస్టులు
ఏఎల్ఓ (లేబర్) - 10 పోస్టులు జూనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ) - 20 పోస్టులు
ఏఎస్ఓ (లా) - 02 పోస్టులు సీనియర్ ఆడిటర్ - 05 పోస్టులు
ఆడిటర్ (పే & అలోవెన్సు) - 10 పోస్టులు  మొత్తం - 182 పోస్టులు 

Post Comment