‘పరీక్ష పే చర్చ’ 2022 | 01 ఏప్రిల్ 2022, తల్కతోరా ఇండోర్ స్టేడియం
School Education

‘పరీక్ష పే చర్చ’ 2022 | 01 ఏప్రిల్ 2022, తల్కతోరా ఇండోర్ స్టేడియం

'పరీక్ష పే చర్చ' రిజిస్ట్రేషన్ 2022

విద్యార్థులకు పరీక్షా సంబంధిత సలహాలు, చిట్కాలు అందించే ప్రధాని మోడీ 'పరీక్ష పే చర్చ' 2022 5వ ఎడిషన్‌ కార్యక్రమంకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రధాని మోడీ నిర్వహించే ఈవెంట్లలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమం ఇది. ఏటా పబ్లిక్ పరీక్షలు ముందు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధాని నేరుగా విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో భేటీ అవుతారు. ఈ కార్యక్రమం కోసం ఏటా 10 లక్షలకు పైగా విద్యార్థులు, 4 లక్షలకు పైగా తల్లిదండ్రులు, లక్షకు పైగా ఉపాధ్యాయులు దరఖాస్తు చేస్తుండగా, అందులో 1500 మంది విద్యార్థులు, 250 మంది తల్లిదండ్రులు మరియు 250 మంది ఉపాధ్యాయులు ప్రధానమంత్రితో సంభాషించడానికి ఎంపిక చేయబడతారు.

వార్షిక పరీక్షలకు ముందు దేశవ్యాప్తంగా విద్యార్థులతో సంభాషించే పరీక్ష పే చర్చ వార్షిక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2018 లో ప్రారంభించారు. వార్షిక పరీక్షల సమయంలో విద్యార్థుల యందు పరీక్షల ఒత్తిడిని పారదోలేందుకు ప్రధాని నేరుగా వారితో సంభాషించి, వారికీ ఉపయోగపడే సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం కోసం ఎంపికైన వారికీ ప్రధాని రచించిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకంతో పాటుగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) ప్రశంసా పత్రం  ఇతర అంశాలతో కూడిన పరీక్షా పే చర్చా కిట్‌ను బహుమతిగా అందజేస్తారు.

'పరీక్ష పే చర్చ' రిజిస్ట్రేషన్ 2022 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ దరఖాస్తు చివరి తేదీ
28 డిసెంబర్ 2021 27 జనవరి 2022
పరీక్ష పే చర్చ తేదీ సమయం  వేదిక 
01 ఏప్రిల్ 2022 ఉదయం 11 గంటలకు తల్కతోరా ఇండోర్ స్టేడియం (ఢిల్లీ)

దరఖాస్తు చేసేందుకు మార్గదర్శకాలు

  •  కార్యక్రమలో పాల్గునేందుకు 9 నుండి 12 వ తరగతి విద్యార్థులు మాత్రమే అర్హులు.
  • విద్యార్థులు కార్యక్రమంలో అందుబాటులో ఉంచిన ఒక థీమ్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఎంపిక చేసుకున్న థీమ్'కు సంబంధించి తమ సొంత ప్రతిస్పందన సమర్పించాల్సి ఉంటుంది.
  • ప్రధానికి అడిగే ప్రశ్న 500 పదాలకు మించకూడదు.
  • ఎంట్రీలను విజయవంతంగా సమర్పించిన వారికీ డిజిటల్ సర్టిఫికేట్‌ అందజేస్తారు.
  • తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం

ఆసక్తి ఉండే విద్యార్థులు ముందుగా MyGov ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవడం ద్వారా పోటీలో పాల్గొనవచ్చు. దరఖాస్తు చేసేందుకు మెయిల్ ఐడీ లేదా మొబైల్ నెంబర్ కలిగివుండాలి. మెయిల్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వగానే వన్ టైమ్ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) పంపబడుతుంది. ఓటీపీ సమర్పించడం ద్వారా దరఖాస్తు చేసేందుకు అనుమతి లభిస్తుంది. దరఖాస్తులో అడిగిన అంశాలను పూర్తిగా పొందుపర్చడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేసిన వారికీ దరఖాస్తు ముగింపు సమయంలో డిజిటల్ సర్టిఫికెట్ అందజేస్తారు. భారతదేశం వెలుపల నుండి పాల్గొనే వారి కోసం, ఇమెయిల్ ఐడిలో పంపిన OTPని ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు.

2022 పరీక్ష పే చర్చ థీమ్స్

విద్యార్థుల కోసం

  • కోవిడ్-19 సమయంలో పరీక్ష ఒత్తిడి నిర్వహణ వ్యూహాలు
  • ఆజాదీ కా అమృత్ మహొస్తవ్
  • స్వావలంబన భారతదేశం కోసం స్వయం-ఆధారిత పాఠశాలలు
  • క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా
  • తరగతి గదులలో డిజిటల్ సహకారం
  • పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ మార్పులు
ఉపాధ్యాయుల కోసం

  • నయా భారత్ కోసం జాతీయ విద్యా విధానం (NEP)
  • COVID-19 మహమ్మారి: అవకాశాలు & సవాళ్లు
తల్లిదండ్రుల కోసం

  • బేటీ పఢావో, దేశ్ బధావో
  • మహమ్మారి సమయంలో మీరు మీ పిల్లల నుండి నేర్చుకున్న ఏదైనా కొత్త టెక్నాలజీ గురించి వ్రాయండి

Post Comment