లడఖ్'లో సాంప్రదాయ కొత్త సంవత్సర 'లోసర్ ఫెస్టివల్' సంబరాలు
లడఖ్ సాంప్రదాయ కొత్త సంవత్సరం 'లోసర్ ఫెస్టివల్' ఘనంగా నిర్వహించారు. టిబెటన్ బౌద్ధమతం యొక్క సాంప్రదాయ ఆచారాలలో భాగంగా నూతన సంవత్సరం ప్రారంభంలో ఈ పండగ జరుపుకుంటారు. ఈ పండగలో ఈ పండుగలో దీపాలు వెలిగించడం, దేవుడు మరియు దేవతలకు పూజలు చేయడం మరియు మరణించిన వారి కోసం స్మారక ఆహార సమర్పణలతో కూడిన ఉత్సవాలు జరుపుకుంటారు.
25వ జాతీయ యూత్ ఫెస్టివల్‌కు పుదుచ్చేరి ఆతిథ్యం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుదుచ్చేరిలో 25వ జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించారు. స్వామి వివేకానంద జయంతి అయిన ఈరోజు జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి శ్రీ ఎన్. రంగస్వామి, ఎంఓఎస్ యస్ శ్రీ నిసిత్ ప్రమాణిక్ హాజరయ్యారు.
20వ ఢాకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో 20వ ఢాకా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 15 జనవరి 2022 న హాట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్‌లో 10 కేటగిరీల క్రింద 70 దేశాల నుండి 225 చిత్రాలను ప్రదర్శిస్తారు. జనవరి 15-23 తేదీల మధ్య ఢాకాలోని వివిధ వేదికలలో ఈ చిత్రాలు ప్రదర్శించబడతాయి. ఢాకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నయనతార నటించిన 'కూజంగల్' చిత్రం ఉత్తమ అవార్డును గెలుచుకుంది.
మణిపూర్ 18వ కచాయ్ లెమన్ ఫెస్టివల్
మణిపూర్‌లో ఏటా నిర్వహించే రెండు రోజుల కచాయ్ లెమన్ ఫెస్టివల్ యొక్క 18వ ఎడిషన్ స్థానిక కచాయ్ విలేజ్ మైదానంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ పండగను ప్రత్యేక భౌగోళిక గుర్తింపు (GI) ట్యాగ్ కలిగిన దేశీయ కచాయి నిమ్మకాయను సంరక్షించడం మరియు ప్రచారం చేయడం లక్ష్యంగా నిర్వహిస్తారు.
సిక్కింలో లోసూంగ్ న్యూయిర్ ఫెస్టివల్
ఈశాన్య భారత రాష్ట్రమైన సిక్కిం యొక్క అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా పరిగణించబడే లోసూంగ్ లేదా నామ్‌సూంగ్ సిక్కిమీస్ నూతన సంవత్సర ప్రారంభ వేడుకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలు ఏటా జనవరి 3, 4వ తేదీల్లో జరుగుకుంటారు. నిజానికి లోసూంగ్ అనేది భూటియా తెగకు చెందిన సిక్కిమీస్ నూతన సంవత్సరం వేడుక, వీరు ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో ఈ సంబరాలు జరుపుకుంటారు.
కేరళ ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ విలేజుకు అంతర్జాతీయ క్రాఫ్ట్ అవార్డు
తిరువనంతపురంకు చెందిన కోవలం సమీపంలోని కేరళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్ (KACV), 2021 సంవత్సరపు ఉత్తమ క్రాఫ్ట్ విలేజ్‌గా అంతర్జాతీయ క్రాఫ్ట్ అవార్డును గెలుచుకుంది. కేరళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్ అనేది రాష్ట్ర పర్యాటక శాఖ కోసం ఉరలుంగల్ లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా స్థాపించబడిన పర్యాటక సంస్థ. కోవలంకు సమీపంలో వెల్లార్‌లో 8.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ విలేజులో కేరళ సంప్రదాయ కళలు మరియు చేతి వృత్తులకు సంబంధించిన కళాఖండాలు ప్రదర్శిస్తారు.
అరుంధతీ భట్టాచార్య ఆటోబయోగ్రఫీ "ఇండొమిటబుల్" విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య రచయితగా తన ఆత్మకథాత్మక "ఇండోమిటబుల్: ఎ వర్కింగ్ ఉమెన్స్ నోట్స్ ఆన్ వర్క్, లైఫ్ అండ్ లీడర్‌షిప్" పుస్తకాన్ని విడుదల చేసారు. అరుంధతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్‌పర్సన్ అయిన మొదటి మహిళగా చరిత్రకెక్కారు. 2016లో ఆమె ఫోర్బ్ ప్రపంచ అత్యంత శక్తివంతమైన 25వ మహిళగా కీర్తించబడ్డారు.
"బోస్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ యాన్ ఇన్ కన్వీనియెంట్ బుక్ విడుదల
చంద్రచూర్ ఘోష్ రచించిన “ బోస్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ యాన్ ఇన్ కన్వీనియెంట్ నేషనలిస్ట్ ” అనే సుభాష్ చంద్రబోస్ సంబంధించి కొత్త జీవిత చరిత్ర ఫిబ్రవరి 2022లో విడుదల కానుంది. ఈ పుస్తకంలో స్వతంత్ర భారతదేశం, మతతత్వం, భౌగోళిక రాజకీయాలు మరియు రాజకీయ భావజాలం గురించి సుభాస్ చంద్రబోస్ ఆలోచనలు మరియు అభిప్రాయాలు ఉన్నాయి.
త్రిపుర 44వ కోక్‌బోరోక్ దినోత్సవం
త్రిపుర ఏటా జనవరి 19న కోక్‌బోరోక్ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. త్రిపుర యొక్క అధికారిక భాష అయిన కోక్‌బోరోక్ భాషను త్రిపురి లేదా టిప్రాకోక్ అని కూడా అంటారు. 1979లో, కోక్‌బోరోక్ త్రిపుర రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించబడింది. అప్పటి నుండి ఏటా జనవరి 19న ఈ వేడుక నిర్వహిస్తారు.
శుబీరా ప్రసాద్ రచించిన ది ఏంజెల్స్ ఆఫ్ కైలాష్ బుక్ విడుదల
ప్రముఖ విద్యావేత్త, రచయిత, జ్యోతిష్కురాలులైన శుబీరా ప్రసాద్, తాను రచించిన రెండవ పుస్తకం 'ది ఏంజెల్స్ ఆఫ్ కైలాష్ బుక్' విడుదల చేసారు. తన మొదటి పుస్తకం డెమన్స్ ఆఫ్ జైత్రయాకి ఇది కొనసాగింపుగా ఉండనుంది. తన మొదటి పుస్తకం అయిన డెమన్స్ ఆఫ్ జైత్రయాకి అద్భుతమైన స్పందన లభించడంతో దానికి కొనసాగింపుగా ది ఏంజిల్స్ ఆఫ్ కైలాష్ ( విటాస్టా పబ్లిషింగ్ )తో తిరిగి వచ్చారు.