సీఐఎస్‌సీఈ సమాచారం 2023 : అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు
School Education

సీఐఎస్‌సీఈ సమాచారం 2023 : అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు

కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ) అనేది ఇండియాలోని ఒక నాన్ గవర్నమెంటల్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు. ఇది ఒకప్పటి కేంబ్రిడ్జ్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్‌కు ప్రతిరూపమని చెప్పొచ్చు. ఇది సిబిఎస్‌ఈ బోర్డుకు దీటుగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబడ్డ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ బోర్డు.

Advertisement

సీఐఎస్‌సీఈ బోర్డును 1958 లో జాతీయ అవసరాల దృష్ట్యా నెలకొల్పారు. భారత రాజ్యాంగం దీన్ని "నాన్ గవర్నమెంటల్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్" గా గుర్తించింది. ఇది ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ICSE) ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ISC) ఎగ్జామినేషన్ పేరుతో సీఐఎస్‌సీఈ క్లాస్ X, క్లాస్ XII ఎడ్యుకేషన్ అందిస్తుంది.

సీఐఎస్‌సీఈకి అనుబందంగా ఇండియాతో పాటుగా అంతర్జాతీయంగా దాదాపు 2200 స్కూళ్ళు సెకండరీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాయి. సీఐఎస్‌సీఈ బోర్డు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉన్నప్పటికీ దీని కార్యకలాపాలు, అకాడమిక్ ప్రణాళికలు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఆధ్వర్యంలో నిర్వర్తించబడతాయి.

సీఐఎస్‌సీఈ పరీక్షలకు ఏటా 2 లక్షలకు పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. సీఐఎస్‌సీఈ అంతర్జాతీయ స్థాయి స్కూల్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. ఈ బోర్డు అందించే పాఠశాల ఎడ్యుకేషన్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సీఐఎస్‌సీఈ గుర్తింపు కలిగిన విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షలు రాసేందుకు అనుమతించబడతారు. ప్రైవేట్ విద్యార్థులకు అనుమతి ఉండదు. సీఐఎస్‌సీఈ మూడు కేటగిర్లలో పరీక్షలు నిర్వహిస్తుంది.

  1. ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ICSE).
  2. ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ISC).
  3. సర్టిఫికెట్ ఇన్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ (CVE).

సీఐఎస్‌సీఈ ఐసీఎస్‌ఈ

ఐసీఎస్‌ఈ ఎగ్జామినేషన్ క్లాస్ X విద్యార్థుల కోసం నిర్వహిస్తారు. ఐసీఎస్‌ఈ అనగా ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని అర్ధం. ఇది జనరల్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ (I నుండి X) ఫార్మేట్‌లో ఉంటుంది. ఐసీఎస్‌ఈ క్లాస్ X లో మొత్తం 7 సబ్జెక్టులకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో నాలుగు తప్పనిసరి తీసుకోవాల్సిన సబ్జెక్టులు ఉంటాయి.

మిగతా మూడు సబ్జెక్టులను విద్యార్థుల ఆసక్తిని అనుచరించి ఎంపిక చేసుకోవచ్చు. సీఐఎస్‌సీఈ విద్యార్థుల కోసం విస్తృతస్థాయిలో సబ్జెక్టులు అందుబాటులో ఉంచుతుంది. ఐసీఎస్‌ఈ పరీక్షలు ఏటా ఫిబ్రవరి మరియు మార్చిలో నిర్వహిస్తారు. అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అందజేస్తారు.

ఒకటి లేదా రెండు సబ్జెక్టల్లో ఫెయిలైన విద్యార్థులకు జులైలో కంపార్టుమెంటల్ ఎగ్జామ్స్ నిర్వహించి ఆగస్టులో పలితాలు విడుదల చేస్తారు. రెండుకు మించి సబ్జెక్టులు ఫెయిల్ అయినా విద్యార్థులు మొత్తం అన్ని సబ్జెక్టులను వచ్చే ఏడాది తిరిగి రాయాల్సి ఉంటుంది.

ఐసీఎస్‌ఈ సిలబస్ విదేశీ యూనివర్శిటీలకు దగ్గరగా ఉంటుంది. ఐసీఎస్‌ఈ విద్యార్థులు ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్, జీఆర్ఈ, జీమ్యాట్, పియర్సన్, శాట్ వంటి విదేశీ ప్రవేశ పరీక్షలలో సులభంగా అర్హుత పొందొచ్చు.

సీఐఎస్‌సీఈ ఐఎస్‌సీ

ఐఎస్‌సీ అనగా ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ అని అర్ధం. ఐఎస్‌సీ పరీక్షలను సీఐఎస్‌సీఈ క్లాస్ XII విద్యార్థుల కోసం నిర్వహిస్తారు. దీనిని సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో భాగంగా అందిస్తారు. ఐఎస్‌సీ సైన్స్, కామర్స్ మరియు ఆర్ట్స్ విభాగాల్లో స్కూల్ ఎడ్యుకేషన్ అందిస్తుంది.

సైన్స్ స్ట్రీమ్ సంబంధించి మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఉంటాయి. కామర్స్ స్ట్రీమ్ యందు అకౌంట్స్, కామర్స్, బిజినెస్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులు ఉంటాయి. ఆర్ట్స్ విభాగంలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, సోషియాలజీ, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులు ఉంటాయి.

ప్రతి స్ట్రీమ్ వైనాడు ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుంది. ప్రతి పేపర్ 100 మార్కులకు జరుగుతుంది. అందులో 80 మార్కులకు థియరీ ఎగ్జామ్ కోసం మరియు 20 మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్ కోసం కేటాయిస్తారు.

సీఐఎస్‌సీఈ సీవీఈ

సీవీఈ అనగా సర్టిఫికెట్ ఇన్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అని అర్ధం. సీవీఈ పరీక్షలను సీనియర్ సెకండరీ ఒకేషనల్ ఎడ్యుకేషన్ సంబంధించి నిర్వహిస్తారు. ఇది భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు జాయింట్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ కోరిక మేరకు నిర్వహిస్తున్నారు.

సీవీఈ క్లాస్ X లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత పొందినవారు సీవీఈ క్లాస్ XII పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులు. ఇందులో విద్యార్థి ఎంపిక చేసుకున్న ప్రత్యేక ఒకేషనల్ సబ్జెక్టుల గురించి టీచ్ చేస్తారు. సీవీఈ ఎగ్జామినేషన్స్ ఐఎస్‌సీ పరీక్షలతో పాటుగా నిర్వహిస్తారు.

Advertisement