ఐఐఎఫ్‌టీ ఎగ్జామ్ 2023 -25 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ డేట్
Admissions MBA Entrance Exams NTA Exams University Entrance Exams

ఐఐఎఫ్‌టీ ఎగ్జామ్ 2023 -25 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ డేట్

ఐఐఎఫ్‌టీ (IIFT) పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ యందు ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సు సంబంధించి ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఇండియాలో ఢిల్లీ, కోలకతా మరియు కాకినాడలో ఐఐఎఫ్‌టీ ఇనిస్టిట్యూట్లలను కలిగి ఉంది.

ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఇంటెర్నేషన బిజినెస్ కోర్సును రెండేళ్ల నిడివితో 6 సెమిస్టర్లగా అందిస్తుంది. ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సును ప్రధానంగా టెక్నాలజీ వాణిజ్యంలో భారత పారిశ్రామిక సామర్ధ్యాన్ని వ్యూత్మకంగా బలపర్చేందుకు, ఆర్థిక మరియు సాంకేతిక సహకారంతో కొన్ని సంస్థాగత వాణిజ్య సంక్లిష్టతలను పరిష్కరించేందుకు అవసరమయ్యే నాణ్యమైన మానవ వనురులను రూపొందించే లక్ష్యంతో అందిస్తుంది.

ఐఐఎఫ్‌టీ 2023

Exam Name IIFT EXAM 2023
Exam Type Admission
Admission For MBA
Exam Date NA
Exam Duration 120 Minutes
Exam Level National Level

ఐఐఎఫ్‌టీ ఎగ్జామ్ 2023 వివరాలు

ఐఐఎఫ్‌టీ ఎలిజిబిలిటీ

  • గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుండి 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
  • చివరి ఏడాది పరీక్షా రాస్తున్న వారు అడ్మిషన్ సమయానికి అండర్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
  • దరఖాస్తు చేసేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు

ఐఐఎఫ్‌టీ 2023 ముఖ్యమైన తేదీలు

 దరఖాస్తు తేదీ
అడ్మిట్ కార్డు
ఎగ్జామ్
రిజల్ట్స్

ఐఐఎఫ్‌టీ దరఖాస్తు ఫీజు

రిజర్వేషన్ కేటగిరి దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరి 2500/-
ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులు 1000/-

ఐఐఎఫ్‌టీ ఎగ్జామ్ సెంటర్లు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
అనంతపురం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ

 

ఐఐఎఫ్‌టీ దరఖాస్తు ప్రక్రియ

ఐఐఎఫ్‌టీ ఎగ్జామ్ సంబంధించిన దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మాత్రమే స్వీకరించబడతయి. ఐఐఎఫ్‌టీ పోర్టల్ (www.nta.ac.in/Iiftexam) నుండి ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి. మొదటిసారి పోర్టల్ని సందర్శించిన వారు మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ వివరాలతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది.

ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా అకాడమిక్ మెరిట్ ఆధారంగా యూజీ, పీజీ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆ సంబంధిత దరఖాస్తూ ఫీజు చెల్లించి మెరిట్ ఆధారిత అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది.

ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసే విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కోరిన విద్య, వ్యక్తిగత సమాచారం తప్పులు దొర్లకుండా దరఖాస్తులో పొందుపర్చాలి. రిజర్వేషన్ కేటగిరి, కోర్సు ఎంపిక, పరీక్షా కేంద్రం వంటి ముఖ్యమైన వివరాలు పొందుపర్చినప్పుడు మరోమారు సరిచూసుకోండి. ప్రవేశ పరీక్షకు సంబంధించి సమస్త సమాచారం మెయిల్ మరియు మొబైల్ ద్వారా అందజేస్తారు.

దరఖాస్తు యందు అభ్యర్థులు ఖచ్చితమైన ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ఐడీలు అందజేయాల్సి ఉంటుంది. చివరిగా అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తివుతుంది. దరఖాస్తు ప్రక్రియ విజయవంతమయ్యాక సంబంధిత దరఖాస్తు ప్రింట్ తీసి మీ వద్ద భద్రపర్చుకోండి.

ఐఐఎఫ్‌టీ ఎగ్జామ్ నమూనా

ఐఐఎఫ్‌టీ పరీక్ష ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. పరీక్షా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షా 2 గంటల నిడివితో 120 మార్కులకు జరుగుతుంది. క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్, జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ మరియు క్వాంటిటేటివ్ అనాలిసిస్ సంబంధించి 120 ప్రశ్నలు ఇవ్వబడతయి.

ప్రతి ప్రశ్న 4 ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. అందులో సరైన సమాధానాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు తొలగిస్తారు.

సిలబస్ ప్రశ్నల సంఖ్య మార్కులు సమయం
ఇంగ్లీష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్, జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ మరియు క్వాంటిటేటివ్ అనాలిసిస్ 120 120 120 నిముషాలు

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి

0120-6895200

Post Comment