Advertisement
ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2022 | ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
Andhra Pradesh

ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2022 | ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2022 ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి మరియు ద్వితీయ ఏడాది ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసారు. ఈ ఏడాది మే 6 నుండి 25 మధ్య జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సుమారు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలకు 4,45,358 మంది హాజరవ్వగా 2,41,591 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ద్వితీయ ఏడాది పరీక్షలకు 4,23,445 హాజరవ్వగా 2,58,449 మంది పాస్ అయ్యారు.

ఏపీ ఇంటర్ 2022 ఫలితాలు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు 2022

Link 1

Link 2

ఇంటర్ ద్వితీయ ఏడాది ఫలితాలు 2022

Link 1

Link 2

ఒకేషనల్ మొదటి ఏడాది ఫలితాలు

Link 1

Link 2

ఒకేషనల్ ద్వితీయ ఏడాది ఫలితాలు

Link 1

Link 2

ఇంటర్ మొదటి ఏడాది పరీక్షల్లో 54 శాతం ఉత్తీర్ణత నమోదు అవ్వగా, ద్వితీయ ఏడాదిలో 61 శాతం నమోదు అయ్యింది. మొదటి ఏడాదిలో 49 శాతం  బాలురులు ఉత్తీర్ణత పొందగా, 60 శాతం బాలికలు ఉత్తీర్ణత పొందారు. అలానే ద్వితీయ ఏడాదిలో 59 శాతం బాలురులు పాస్ కాగా, 68 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు.

జిల్లాల వారిగా చూసుకుంటే గుంటూరు జిల్లా నుండి అత్యధికంగా 72 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, అత్యల్పంగా కడప జిల్లా నుండి 55 శాతం ఉత్తీర్ణత నమోదు కాబడింది. మొత్తంగా చూసుకుంటే ఇంటర్ మొదటి మరియు ద్వితీయ ఏడాదిలో బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు.

రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్

రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారి కోసం జూన్ 25 నుండి జులై 5 వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. అలానే ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను ఆగష్టు 3 నుండి నిర్వహించనున్నారు.

ఇంటర్ మొదటి ఏడాది పరీక్షకు హాజరైన వారు 868,803 మంది
ఇంటర్ మొదటి ఏడాదిలో ఉత్తీర్ణత పొందినవారు 2,41,591 మంది
ఇంటర్ ద్వితీయ ఏడాది పరీక్షకు హాజరైన వారు 4,23,445 మంది
ఇంటర్ ద్వితీయ ఏడాదిలో ఉత్తీర్ణత పొందినవారు 2,58,449 మంది
మొదటి ఏడాది ఉత్తీర్ణత శాతం 54 శాతం
ద్వితీయ ఏడాది ఉత్తీర్ణత శాతం 61 శాతం
అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లా గుంటూరు (72 శాతం)
అత్యల్ప ఉత్తీర్ణత సాధించిన జిల్లా కడప (55 శాతం)
బాలికల ఉత్తీర్ణత శాతం
బాలురుల ఉత్తీర్ణత శాతం
మొదటి ఏడాది 60 శాతం
ద్వితీయ ఏడాది 49 శాతం
బాలికల ఉత్తీర్ణత శాతం
బాలురుల ఉత్తీర్ణత శాతం
మొదటి ఏడాది 68 శాతం
ద్వితీయ ఏడాది 59 శాతం

Post Comment