Advertisement
5 tips to speak English fluently in Telugu | తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్
Spoken English

5 tips to speak English fluently in Telugu | తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్

ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటానికి ఈ 5 చిట్కాలు తెలుసుకుంటే ఆ భాషను సులభంగా నేర్చుకోవచ్చు. ఎవరికైన కొత్త భాష నేర్చుకునే సమయంలో కొన్ని భయాలు, బలహీనతలు ఉండటం సహజం. వీటిని అధిగమిస్తే భాష ఏదైనా, దానిని సులభంగా నేర్చుకోవచ్చు. ఈ ఆర్టికల్ యందు మీరు ఆ అంశాలనే నేర్చుకోనున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 7 వేల భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 7 వేల భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. వీటిలో ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజుగా గుర్తింపు పొందింది. ఆధునిక సాంకేతికత అంతా ఈ భాషలో మిళితమై ఉంది. విద్యార్థులు నేర్చుకునే విజ్ఞానమంతా ఈ బాషలనే రికార్డు చేయబడి ఉంది. ఇవాళ్టి రోజున ప్రతి విద్యార్థి ఆంగ్ల భాష నేర్చుకోవడం తప్పనిసరి. అలా అని దీనికోసం హైరానా పడాల్సిన అవసరం లేదు.

ముందు రోజుల్లో నూతన భాష నేర్చుకోవాలి అంటే కోచింగ్ సెంటర్ల చుట్టూరా తిరిగే పరిస్థితి ఉండేది. నేడు ఆ అవసరం లేదు. విద్యార్థికి ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తి, అభిరుచి ఉండాలే కాని ఉన్న చోటు నుండే ఆధునిక సాంకేతికను ఉపయోగించి నేర్చుకోవచ్చు. ఒక్క ఇంగ్లీషుకి ఏం కర్మ, ప్రపంచ అన్ని భాషలను నేర్చుకునే సదుపాయం నేటి విద్యార్థులకు ఉంది.

మాతృభాష మరియు పరాయి భాష మధ్య వ్యత్యాసం

మాతృభాష మరియు పరాయి భాష మధ్య వ్యత్యాసం తెలుసుకుంటే పరాయి భాషను నేర్చుకోవడం సులభమౌతుంది. పరాయి భాష అనగానే కొంత మందికి ఉత్సాహం వస్తుంది. ఇంకొంత మందికి నీరసం వస్తుంది. ఈ చిన్న తేడానే మీకు కొత్త భాష నేర్చుకునేందుకు సాధ్యమవుతుందా లేదా అనేది నిర్ణయిస్తుంది.

నిజానికి మాతృభాష vs పరాయి భాష యందు వ్యత్యాసం ఏం ఉండదు. భాషల యందు అక్షరాలు, భాష పదాలు మారుతాయి మినహా, ఏ భాష నిర్మాణమైన ఒకే విధంగా రూపొందించబడి ఉంటుంది. ఏ భాష క్లిష్టమైనది కాదు, అలా అని సులభమైనది కూడా కాదు.

మాతృభాషను మనకు తెలియాకుండానే నేర్చుకుంటాం. పరాయి భాష నేర్చుకునే వరకు మాతృభాష ఎలా అబ్బిందనేది మనకు తెలియాని రహస్యం. ఈ రహస్యమే తెలిస్తే ప్రపంచ అన్ని భాషలను మీరు సులభంగా నేర్చుకోవచ్చు.

గ్రామర్ నేర్చుకున్నంత మాత్రాన ఇంగ్లీష్ మాట్లాడలేం

ఒక భాష నేర్చుకోవాలంటే దానికి సంబంధించిన గ్రామర్ ముందు నేర్చుకోలన్నది అందురూ చెప్పే మాట. అవును ఒక భాష నేర్చుకోవాలంటే, ఆ భాషకు చెందిన నియమ నిభందనలు తెలిసి ఉండాలి. అలా అని దాని కోసం గ్రామర్ పుస్తకాలు పట్టుకుని కూర్చుంటే, మీకు గ్రామర్ మాత్రమే వస్తుంది కాని భాష రాదు.

మీరు ఏ గ్రామర్ పుస్తకాలు చదవకుండానే.. మీ మాతృ భాషను గొప్పగా మాట్లాడు గలుగుతున్నారనే వాస్తవాన్ని గ్రహించండి. గ్రామర్ అనేది భాష యొక్క సాంకేతిక అంశం.. దీని కంటే ప్రధానమైంది ఇంకొకటి ఉంది, అది భాష యొక్క పదజాలం (vocabulary). పదజాలం అనేది భాషకు గుండెకాయ లాంటిది. ఇది మనకు ఎంత గొప్పగా వస్తే..భాష అంత గొప్పగా వచ్చినట్లు అర్ధం చేసుకోవాలి.

ఒక భాషలో దేనిని ఏమంటారో తెలుసుకుంటే ఆ భాష మాట్లాడం సులభమోతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వారిలో చాల మందిలో కనిపించే లోపం ఇదే. వారికి ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి సకల నియమాలు తెలిసినా, ఆ భాష మాట్లాడటంలో విఫలం అయ్యేందుకు కారణం ఇదే. భాషకు గ్రామర్ నియమాలు ప్రధానమే కాని, దాని కంటే ముందు ఆ భాష యొక్క పదజాలం నేర్చుకోవాలి.

"మ మ మమ్మ" అమ్మ.. ఫార్ములా ఉపయోగించండి !

"మ మ మమ్మ" అమ్మా.. ఫార్ములా అంటే అది ఏదో గణితం ఫార్ములా ఆనుకునేరు !. ఇది మన చిన్నతనంలో అందరం ఉపయోగించిన ఫార్ములానే. ఏడాది వయస్సు పిల్లోడు "అమ్మ" అనే పదం పలికేందుకు ఎన్ని మార్లు "మ మ మమ్మ" అని ఉంటాడు.

అదే పిల్లోడు ఇంకో ఏడాది గడిచే సరికి మనల్ని ఆశ్చర్యపర్చేలా చక్కగా అన్ని మాటలూ మాట్లాడేస్తుంటాడు. ఈ ఏడాదిలో ఆ పిల్లోడు ఏ కోచింగ్ సెంటరుకు వెళ్లిందీ లేదు, ఏ గ్రామర్ పుస్తకం చదివిందీ లేదు..కాని ఆ పిల్లాడికి భాష వచ్చేస్తుంది. అది కేవలం తన చుట్టూ వుండే మనుషుల సంభాషణల ద్వారా మాత్రమే నేర్చుకున్నాడు. అదే ఫార్ములా మీరు ఇప్పుడు అప్లయ్ చేయండి. భాష ఎందుకు రాదో చూద్దాం.

కోచింగ్ సెంటరులో కూర్చుంటే ఇంగ్లీష్ రాదు. మందితో మాట్లాడితే వస్తుంది

గ్రామరు పుస్తకాలు పట్టుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ రాదు. క్లాసురూములో కూర్చుంటే కూడా రాదు. మందిలో ఉంటేనే వస్తుంది. నోరు తెరిచి సంభాషించే ప్రయత్నం చేస్తేనే వస్తుంది. భాషకు చెందిన భావజాలం తెలుసుకుంటేనే వస్తుంది. భాషను నేర్చుకునేందుకు 30 రోజులు, 60 రోజుల టార్గెట్ పెట్టుకోకండి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. భాషా పండితులు కూడా నిరంతర అబ్యాసం చేస్తుంటారు. కొత్తగా నేర్చుకునే మీరు అంతకు మించి నేర్చుకునే ప్రయత్నం చేయాలి.

స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేందుకు 5 మెళుకువలు

  1. సిగ్గు, బిడియం గట్టుపైన పెట్టి మాట్లాడటం మొదలు పెట్టండి

  2. న్యూస్ వినండి & సినిమాలు చుడండి

  3. న్యూస్ పేపర్లు & బుక్స్ చదవటం అలవాటు చేసుకోండి

  4. ప్రతిరోజు ఒక కొత్త పదం నేర్చుకోండి

  5. కొత్త భాషను ప్రయోగించండి

సిగ్గు, బిడియం గట్టుపైన పెట్టి మాట్లాడటం మొదలు పెట్టండి

కొత్త భాష నేర్చుకునేటప్పుడు మొదట చేయాల్సిన పని..ఎక్కువగా మాట్లాడటం. మీరు మాట్లాడే మాటలు సాంకేతికంగా సరైనదా, కాదా అనే విషయం పక్కన పెట్టి మాట్లాడుతూనే ఉండండి. అది మీ చుట్టూరా ఉండే వారితోనా లేదా మీలో మీతోనా అనేది కూడా అనవసరం.

మీరు యెంత ఎక్కువగా మాట్లాడితే ఆ భాష అంత త్వరగా మీ జీవితంలో భాగమౌతుంది. తప్పులు దొర్లితే ఎవరు ఎలా అనుకుంటారనే సిగ్గు, బిడియం కాసెపు గట్టుపైన పెట్టి ఇప్పుడే మాట్లాడం మొదలు పెట్టండి.

ఇక్కడ ఒక ఉపాయం ఉంది. మీరు ప్రయత్నించే ఈ ప్రయత్నం సార్ధకం కావాలంటే, మీ పాకెట్ యందు ఒక వాయిస్ రికార్డరు పెట్టుకుని, మీ రోజువారి జీవితంలో జరిగే అన్ని సంభాషణలు రికార్డు చేయండి. తీరిక సమయం చేసుకుని రికార్డు చేసిన సంభాషణలను, ఏదైనా లాంగ్వేజ్ ట్రాన్సలేటర్ ద్వారా మీరు నేర్చుకునే భాషలోకి తర్జుమా చేయడం వలన మీ సహజ సంభాషణలు జరిపే నైపుణ్యం పెంపొందించుకోవచ్చు.

న్యూస్ వినండి & సినిమాలు చూడండి

కొత్త భాష నేర్చుకోవడంలో మాట్లాడటం యెంత ముఖ్యమో, వినడం & చూడటం కూడా అంతే ముఖ్యం. భాషలో ప్రధానమైంది శబ్దం. ఒక మాటను ఏ విధంగా పలుకుతున్నాం అన్నదే భాషలో ప్రధానమైన అంశం. వినే మాటలే మన ఉచ్ఛరణను నిర్ణయిస్తాయి. దీనికోసం న్యూస్ చానెల్స్, రేడియో, ఫిలిమ్స్, మ్యూజిక్, ఉపన్యాసాలు వంటివి రెగ్యూలర్'గా వినడం ద్వారా భాష యొక్క ఉచ్ఛరణను మెరుగుపర్చుకోవచ్చు.

అంతేకాక కొత్త పదాలను నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ఓటిటీల పుణ్యమా అని ఈ రోజు ప్రపంచ అన్ని బాషల సినిమాలు, వెబ్ సిరీస్లు మీకు అందుబాటులో ఉన్నాయి. వాటి తెలుగు డబ్బింగ్ వెర్షన్లు చూడకుండా వాటి మాతృకలను సబ్ టైటిల్స్ పెట్టుకుని చూడం ద్వారా మాట నిర్మాణం, కొత్త మాటలు అలానే పద ఉచ్ఛరణను మెరుగుపర్చుకోవచ్చు.

న్యూస్ పేపర్లు & బుక్స్ చదవటం అలవాటు చేసుకోండి

కొత్త భాష నేర్చుకోవడంలో చదవటం మరో ముఖ్యమైన అంశం. పలానా అని కాకుండా న్యూస్ పేపర్ల నుండి బుక్స్ వరకు దొరికిన ప్రతి దానిని చదవండి. దీని వలన కొత్త భాష యొక్క ఉచ్ఛరణకు అలవాటు పడతారు. అలానే ఎన్నో కొత్త పదాలను నేర్చుకునే అవకాశం దొరుకుంది. దీనితో పాటుగా ఒక డిక్షనరీ పక్కన ఉంచుకుంటే తారసపడే ప్రతి కొత్త పదం యొక్క అర్డంను గ్రహించవచ్చు.

అదే విధంగా గూగుల్ ట్రాన్సలేటర్స్ వంటివి ఉపయోగించి మీకు తెలియని ఆంగ్ల భాష పదాలను లేదా మాటలను.. తెలుగు భాషలోకి మార్చుకోవడం ద్వారా ఆ మాటల యొక్క అర్దాలను తెలుసుకోవచ్చు.

తినగా తినగా వేము తియ్యగా ఉన్నట్లు..! చదవగా చదవగా భాష తేలిక అవుతుంది. దీనితో పాటుగా న్యూస్ పేపర్లు చదవటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా జరిగే తాజా అంశాలను తెలుసుకోవచ్చు. అలానే బుక్స్ చదవటం ద్వారా మీకు తెలియని విజ్ఞానాన్ని దొరక పుచ్చుకోవచ్చు. అదే విధంగా మీ ఆలోచన పరిధిని పెంచుకోవచ్చు.

ప్రతిరోజు ఒక కొత్త పదం నేర్చుకోండి

ముందు చెప్పినట్లే ఒక భాష గొప్పగా రావాలంటే దానికి సంబంధించిన పూర్తి పదజాలాన్ని తెలుసుకుని తీరాలి. మనకు భాషా నియమాలు తెలిసినా.. దేనిని ఏమంటారో తెలియకుంటే, మాట్లాడేందుకు మాటలు ఉండవు. దీని కోసం ప్రతిరోజూ ఒక కొత్త పదం అనే కంటే, తారసపడే ప్రతీ దానిని.. కొత్త భాషలో ఏమంటారో తెలుసుకోవడం ఉత్తమం.

ఎందుకంటె ఇలా నేర్చుకునే ప్రతి పదం మీకు గుర్తుంటుంది. ఈ పద్దతి మిమ్మల్ని సులభంగా కొత్త భాషకు దగ్గర చేస్తుంది. మీరు కొత్త భాష యందు పట్టు సాధించాలంటే మీకు ఉన్న ఏకైక మార్గం ఇది మాత్రమే. అలానే కొత్త ఇంగ్లీష్ తెలిసిన స్నేహుతులతో కాలక్షేపం చేయడం ద్వారా కొత్త పదజాలంను సులభంగా నేర్చుకోవచ్చు.

కొత్త భాషను ప్రయోగించండి

ఇప్పటి వరకు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం తెలుసుకున్నారు. ఇప్పుడు నేర్చుకున్న భాషను పక్క వారిపై ప్రయోగించం మొదలు పెట్టండి. మన పరిధిలో ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్ వరకు అందరిని దీని కోసం ఉపయోగించుకోండి. ప్రారంభంలో ఇది కొంచెం కష్టంగా ఉన్నా, మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే అది మీకు అలవాటుగా మారుతుంది.

మాట తడబడిన, పదాలు గుర్తుకు రాకున్నా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. నాకు ఇంగ్లీష్ రాదు, కాని మాట్లాడేందుకు ప్రయత్నిస్తా ..దయచేసి అర్థం చేసుకోండి అనే మాటతో ప్రారంభించే ప్రతి సంభాషణ.. మీకు పూర్తి సంతృప్తిని ఇస్తుంది. ఇదే ప్రయత్నం మరికొద్ది రోజుల్లోనే మిమ్మల్ని పూర్తిస్థాయి స్పీకరుగా మార్చేస్తుంది. భాష ఏదైనా లింగం, కాలం మరియు ఆ యొక్క భాష పదజాలం ముఖ్యమైనవి. ఈ మూడు అంశాలు నేర్చుకుంటే మీరు ఏ భాష యందు అయినా ప్రావీణ్యం పొందొచ్చు. విజయస్తూ..!

Post Comment