తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 02 మార్చి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.
అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబిసిఎ) ఏర్పాటుకు ఫిబ్రవరి 29న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని కోసం 2023-24 నుండి 2027 వరకు ఐదేళ్ల కాలానికి ఒకేసారి రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబిసిఎ)కు భారతదేశం ప్రధాన కార్యాలయంగా ఉండనుంది.
పులులు మరియు అంతరించిపోతున్న అనేక పులుల జాతులను సంరక్షించడంలో భారతదేశం యొక్క ప్రముఖ పాత్రను గుర్తిస్తూ, గ్లోబల్ టైగర్ డే, 2019 సందర్భంగా భారత ప్రధాని మోడీ దీని ఏర్పాటుకు పిలుపునిచ్చారు. ఆసియాలో వేటను అరికట్టడానికి గ్లోబల్ లీడర్‌ల కూటమి అవసరం ఉందని నాడు ఆయన అన్నారు. ఏప్రిల్ 9, 2023న భారతదేశం యొక్క ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50 సంవత్సరాల జ్ఞాపకార్థం సందర్భంగా ఆయన దీనిని పునరుద్ఘాటించారు.
అదే రోజున పెద్ద పిల్లుల భవిష్యత్తును సురక్షితంగా ఉంచే లక్ష్యంతో అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్‌ను లాంఛనంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ ఏడు పెద్ద పిల్లులలో పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, ప్యూమా, జాగ్వార్ మరియు చిరుత వంటివి ఉన్నాయి. వీటిలో పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత మరియు చిరుత భారతదేశంలో కనిపిస్తాయి.
- ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది 96 బిగ్ క్యాట్ దేశాల కూటమి.
- ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద పిల్లులు మరియు వాటి ఆవాసాల భవిష్యత్తును సురక్షితం చేస్తుంది.
- పెద్ద పిల్లి సంరక్షణకు మద్దతు ఇచ్చే వ్యాపార సమూహాలు మరియు సంస్థలకు వేదిక అందిస్తుంది.
- ఇది పెద్ద పిల్లుల పరిరక్షణ ప్రయత్నాలకు ఆర్థిక మరియు వనరుల మద్దతు అందిస్తుంది.
న్యూఢిల్లీలో ఓషన్ హెల్త్ అండ్ గవర్నెన్స్‌పై మొదటి బ్లూ టాక్స్ సమావేశం
ఫిబ్రవరి 29, 2024న న్యూఢిల్లీలో ఓషన్ హెల్త్ అండ్ గవర్నెన్స్‌పై మొదటి బ్లూ టాక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అధ్యక్షత వహించింది. ఈ సమావేశంలో ఫ్రాన్స్ రాయబార కార్యాలయం మరియు భారతదేశంలోని కోస్టారికా రాయబార కార్యాలయం సహ-భాగస్వాములుగా వ్యవహరించాయి.
- ఈ సమావేశానికి భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబారి మిస్టర్ థియరీ మాథౌ మరియు కోస్టారికా చార్జీ డి'అఫైర్స్ సోఫియా సలాస్ మోంగేతో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కార్యదర్శి రవిచంద్రన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు.
- ఈ సమావేశం ఓషన్ హెల్త్ అండ్ గవర్నెన్స్‌కు సంబంధించిన విషయాలపై ఉన్నత స్థాయి చర్చలకు వేదిక కల్పించింది.
- ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు మరియు పరిశోధన సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.
ఈ సమావేశం 2024 జూన్ 7 నుండి 8 వ తేదీ వరకు కోస్టారికాలోని శాన్ జోస్‌లో జరగనున్న హైలెవెల్ ఈవెంట్ ఆన్ ఓషన్ యాక్షన్ (HLEOA) ఈవెంట్ ఇమ్మర్‌స్డ్ ఇన్ చేంజ్‌కు ముందస్తు సమావేశంగా నిర్వహించారు. హైలెవెల్ ఈవెంట్ ఆన్ ఓషన్ యాక్షన్ అనేది రాబోయే యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ (UNOC3) కోసం నిర్వహిస్తున్న ఒక సన్నాహక కార్యక్రమం.
2025లో నీస్‌లో జరగనున్న ఓషన్ కాన్ఫరెన్స్‌కు భారతదేశం ప్రధాన భాగస్వామిగా గుర్తింపు పొందింది. ఈ ముఖ్యమైన ప్రపంచ ఈవెంట్‌కు సిద్ధం కావడానికి ఫ్రాన్స్ మరియు కోస్టారికాతో సన్నిహిత సహకారం కోసం భారతదేశం ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేసారు.
2023లో భారతదేశంలోని రాజకీయ పార్టీల ఆదాయాలు
భారతదేశంలోని జాతీయ పార్టీలు 2023 ఏడాదికి సంబంధించి ఆదాయాన్ని ప్రకటిస్తాయి. ఈ జాబితాలో అధికార బిజెపి అత్యధిక వాటాతో ముందంజలో ఉంది. బీజేపీ అత్యధికంగా రూ. 2361 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది, ఇది ఆర్థిక సంవత్సరంలో మిగతా ఆరు జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 76.73 శాతంకు సమానం. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) ఈ తాజా డేటాను విడుదల చేసింది.
- ఆరు జాతీయ పార్టీలు సమిష్టిగా మొత్తం రూ. 3,076.9 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయి.
- జాతీయ పార్టీల ప్రధాన ఆదాయ మార్గాలలో విరాళాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
- విరాళాల ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందిన పార్టీలలో రూ. 2361 కోట్లతో బీజేపీ అగ్రస్థానంలో ఉంది.
- 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 49.09 శాతం (1,510.61 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాయి.
- ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బిజెపి 1,294.15 కోట్లు, కాంగ్రెస్ 171.02 కోట్లు, మరియు ఆప్ 45.45 కోట్లు పొందాయి.
2023 ఆర్థిక సంవత్సరంలో అధికార బీజేపీ మొత్తం రూ 2,360.8 కోట్లు ఆర్జించగా, అందులో కేవలం 57.68% అంటే 1,361.7 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. జాతీయ కాంగ్రెస్ పార్టీ 452.4 కోట్లు ఆర్జించగా అందులో 467.2 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదించింది.ఇది దాని వ్యయాన్ని మించి 3.26% అధికంగా ఉంది.
మరో జాతీయ పార్టీ సిపిఐ(ఎం) పార్టీ ఆదాయం 141.6 కోట్లు కాగా, ఆ పార్టీ 74.87 శాతం అంటే 106.06 కోట్లు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం ఆదాయం 85.17 కోట్లు కాగా, ఆ పార్టీ 102.1 కోట్లతో 19.82 శాతం అదనపు ఖర్చు చేసింది. అలానే బీఎస్పీ ఆదాయం 88.90 కోట్లు కాగా, ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఏకైక పార్టీ జాతీయ పార్టీ అయిన నేషనల్ పీపుల్స్ పార్టీ తన ఆదాయం 7.09 కోట్లుగా పేర్కొంది.
ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన జాతీయ పార్టీల రికార్డుల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరం మరియు 2022-23 ఆర్థిక సంవత్సరం మధ్య కాంగ్రెస్, సీపీఐ(ఎం) , బీఎస్పీల ఆదాయం వరుసగా 12.68 శాతం (20.57 కోట్లు), 33.14 శాతం (14.50 కోట్లు) మరియు 16.42 శాతం ( 88.90 కోట్లు) తగ్గిందని ఏడీఆర్ నివేదిక పేర్కొంది.
- బీజేపీ ఆదాయం : రూ. 2361 కోట్లు
- కాంగ్రెస్ ఆదాయం : రూ. 452.4 కోట్లు
- సిపిఐ(ఎం) ఆదాయం : రూ 141.6 కోట్లు
- ఆమ్ ఆద్మీ పార్టీ ఆదాయం : రూ 85.17 కోట్లు
- బీఎస్పీ ఆదాయం : రూ. 88.90 కోట్లు
- నేషనల్ పీపుల్స్ పార్టీ : రూ 7.09 కోట్లు
2027లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు బీజింగ్ ఆతిథ్యం
2027లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు బీజింగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. 2015లో విజయవంతమైన హోస్టింగ్ తర్వాత బీజింగ్ ఈ ఈవెంట్‌ను నిర్వహించడం ఇది రెండోసారి. గ్లాస్గోలో జరిగిన 234వ ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోబడింది.
నాన్‌జింగ్‌లో వచ్చే ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్‌షిప్‌కు కూడా చైనా ఆతిథ్యం ఇవ్వనుంది. 2008 ఒలింపిక్ క్రీడల తర్వాత దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, బీజింగ్ మరోసారి ఒక ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌ను నిర్వహించనుంది.
వాస్తవానికి ఈ ఈవెంట్ రోమ్ యందు జరగాల్సి ఉంది. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని పొందడంలో విఫలమైనందున రోమ్‌లో ఈవెంట్‌ను నిర్వహించడానికి తన బిడ్‌ను ఉపసంహరించుకున్నట్లు ఇటాలియన్ అథ్లెటిక్స్ సమాఖ్య ప్రకటించింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ల చివరి ఎడిషన్ గత ఏడాది ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరిగింది. తదుపరి ఎడిషన్ 2025లో టోక్యోలో, తర్వాత 2027లో బీజింగ్‌లో జరుగుతుంది.
- చైనా 1.4 బిలియన్ల కంటే ఎక్కువ జనాభాతో, ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా మార్కెట్లలో ఒకటిగా ఉంది.
- ఇది 2023లో 368.9 మిలియన్ల సంచిత ప్రేక్షకులతో వాండా డైమండ్ లీగ్ ప్రసార వినియోగానికి అగ్రగామిగా నిలిచింది.
- చివరి నాలుగు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అయిన యూఎస్ (ఒరెగాన్), ఈయూ (బుడాపెస్ట్), జపాన్ (టోక్యో) మరియు చైనా (బీజింగ్)లలో నిర్వహించబడ్డాయి.
ప్రస్తుతం 2024 ఏడాదికి సంబంధించి ప్రపంచ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్‌షిప్స్, మార్చి 1-3 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతోంది. 130 కంటే ఎక్కువ దేశాల నుండి 650 కంటే ఎక్కువ మంది పోటీదారులు 26 అథ్లెటిక్స్ విభాగాల్లో పతకాల కోసం పోటీ పడుతున్నారు.
నాగాలాండ్‌లో యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం
నాగాలాండ్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో పూర్తి నిధులతో కూడిన సార్వత్రిక జీవిత బీమా పథకాన్ని ప్రకటించింది. కుటుంబ పెద్ద అకాల మరణం కారణంగా ఆర్థిక ఇబ్బందులకు లోనవకుండా సహాయం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకం రూపొందించింది. ఈ పథకంకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిధులను అందిస్తుంది.
- ఈ పథకం కింద బ్రెడ్ విన్నర్‌కు 2 లక్షల జీవిత బీమా కవరేజీ ఇవ్వబడుతుంది.
- అదనంగా, బ్రెడ్ విన్నర్ మరియు మరో ముగ్గురు కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 2 లక్షల ప్రమాద బీమా కవర్ అందించబడుతుంది.
- ఇది ప్రమాదం కారణంగా మరణం మరియు వైకల్యం రెండింటినీ కవర్ చేస్తుంది.
- ప్రమాద బీమా వైకల్యం మరియు మరణం రెండింటినీ కవర్ చేస్తుంది.
- ప్రమాదవశాత్తు మరణించిన పక్షంలో ప్రతి లబ్ధిదారునికి బీమా మొత్తం 2 లక్షలు అందిస్తారు.
- ప్రమాదంలో రెండు చేతులు లేదా కాళ్లు కోల్పోయిన పక్షంలో కూడా 2 లక్షలు బీమా అందిస్తారు.
- ఈ పథకం నాగాలాండ్‌లోని ప్రతి ఇంటికి అమలు చేస్తున్నారు.
- నివాసితులు బీమా కోసం ఎలాంటి ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ పథకం కుటుంబ పెద్ద అకాల మరణం సంభవించినప్పుడు కుటుంబాలకు ఆర్థిక భద్రత మరియు రక్షణ కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. కుటుంబాలు ముఖ్యంగా విద్య, ఆరోగ్యం మరియు సామాజిక-ఆర్థిక శ్రేయస్సుకు సంబంధించి, కుటుంబ పెద్ద కోల్పోవడం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడంలో సహాయం అందిస్తుంది.
2023-24 ఆర్థిక సర్వేను సమర్పించిన ఢిల్లీ ప్రభుత్వం
ఢిల్లీ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను మార్చి 2న అసెంబ్లీలో సమర్పించింది. ఈ సర్వే నివేదిక ప్రకారం ఢిల్లీ తలసరి ఆదాయం రెండేళ్లలో 22 శాతం పెరిగి 2023-24లో రూ. 4.61 లక్షలకు చేరుకున్నట్లు ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి వెల్లడించారు. ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ 2023-24లో 9.2% వృద్ధి చెందుతుందని, తలసరి ఆదాయం 22% పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు అతిషి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మరియు బ్యూరోక్రసీ నుండి అడ్డంకులు ఉన్నప్పటికీ, కేజ్రీవాల్ నాయకత్వంలో అప్ ప్రభుత్వం అద్భుతమైన వృద్ధిని సాధించినట్లు నొక్కిచెప్పారు. దేశ జనాభాలో ఢిల్లీ జనాభా కేవలం 1.5 శాతమే అయినప్పటికీ జాతీయ జీడీపీలో ఢిల్లీ సహకారం దాదాపు 4 శాతంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
- ఢిల్లీ భారతదేశంలో రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉందని, బడ్జెట్ కేటాయింపులు పెరిగినప్పటికీ, ఢిల్లీ ఆదాయం గణనీయమైన వృద్ధిని నమోదు చేసినట్లు వెల్లడించారు.
- ఢిల్లీ ప్రభుత్వం 2021-22లో 3,270 కోట్ల రెవెన్యూ మిగులును నమోదు చేయగా, 2022-23లో 14,457 కోట్లకు పెరిగినట్లు తెలిపారు.
- ఢిల్లీ పన్ను వసూళ్లు 2022-23లో 18% వృద్ధి చెందాయని, ఇది కేంద్రం యొక్క పెరుగుతున్న రుణాలకు భిన్నంగా ఉందని, ఇది 155 లక్షల కోట్లకు మించి ఉందని అతిషి పేర్కొన్నారు.
- ఢిల్లీ ప్రభుత్వం ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగం యొక్క సమర్థవంతమైన నిర్వహణను కూడా ఆమె ప్రశంసించారు.
- జాతీయ రేటు 5.6%తో పోలిస్తే 2023లో ఢిల్లీ యొక్క ద్రవ్యోల్బణం 2.8%గా ఉన్నట్లు పేర్కొన్నారు.
- ఢిల్లీ నిరుద్యోగిత రేటు కూడా 2020-21లో 6.3% నుండి 2022-23లో 1.9%కి తగ్గిందని, ఇది ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడంలో ప్రభుత్వ విజయవంతమైన ప్రయత్నాలను ప్రదర్శిస్తుందని ఆమె వెల్లడించారు.
విద్యా రంగానికి సంబంధించి జాతీయ బడ్జెట్ 13.5%తో పోల్చితే ఢిల్లీ ప్రభుత్వం తన బడ్జెట్‌లో 21.1% కేటాయించినట్లు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం ఆరోగ్యం, విద్యుత్, నీరు మరియు రవాణా రంగాలలో కూడా మెరుగైన ఫలితాలు సాధించినట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా, పర్యావరణ సుస్థిరత పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శిస్తూ ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యలో ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉందని తెలియజేసారు.
తక్కువ విద్యుత్ ఛార్జీలు, మహిళలకు ఉచిత ప్రజా రవాణా సవారీలు మరియు విద్య మరియు ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు వంటి దాని విధానాలు ఆర్థిక వృద్ధికి దోహదం చేశాయని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ప్రధాన భారతీయ నగరాల్లో ఢిల్లీ అత్యంత తక్కువ ద్రవ్యోల్బణం రేటును కలిగి ఉందని, ఢిల్లీలో నిరుద్యోగం తగ్గుతోందని ఈ సర్వే పేర్కొంది.
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది పులులు, సింహాలు, చిరుతలు, జాగ్వర్లు, ప్యూమాస్, మంచు చిరుతలు మరియు చిరుతలు అనే ఏడు పెద్ద పిల్లుల రక్షణ మరియు సంరక్షణ కోసం పని చేస్తుంది.
9 ఏప్రిల్ 2023
97 దేశాలు
- రాయల్ బెంగాల్ టైగర్ (పాంథెరా టైగ్రిస్)
- ఆసియాటిక్ సింహం (పాంథెరా లియో)
- ఇండియన్ చిరుతపులి (పాంథెరా పార్డస్)
- మంచు చిరుతపులి (పాంథెరా అన్సియా) & (ఇండో-చైనీస్ క్లౌడెడ్)
- చిరుతపులి (నియోఫెలిస్ నెబులోసా)
2024 ప్రపంచ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్‌షిప్స్ స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో నిర్వహించారు.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025 జపాన్ (టోక్యో) లో జరగనుంది.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 202 దేశాలు పాల్గొంటాయి.
2027 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు బీజింగ్ ఆతిథ్యం ఇవ్వనుంది.